ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం 66(౬౬) కరణముల ననుసరిపక విరసంబునఁ దిన్న తిండి వికటించుఁ జుమీ యిరుసున గందెనఁ బెట్టక పరమేశ్వరు బండియైన బారదు సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... కందెన (బండి చక్రాలకి పెట్టే నూనె లాంటి పదార్థం) రాయనిదే దేవుడి రధమైనా ముందుకు కదలదు. అలాగే, ఎంతటి బలవంతునికైనా, ధనవంతునికైనా కరణము గారి కచేరీలో (ఆఫీసులో) పని జరగాలంటే అవసరమైన రొక్కము(డబ్బులు) ఇస్తేనే పని అవుతుంది. అలా కాకపోతే మన ఆస్తికే ముప్పు వస్తుంది..... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *మన తెలివితేటలు, సంపదలు, సమాజంలో మనకున్న గౌరవం పక్కన పెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా నడచుకుంటేనే మన పనులు సవ్యంగా అవుతాయి అని భావం.* *అలవిగాని చోట అధికులమనరాదు* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
June 29, 2020 • T. VEDANTA SURY • Poem