ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం 68(౬౮) చింతింపకు గడచినపని కింతులు వలతు రని నమ్మ కెంతయు మదిలో నతఃపుర కాంతలతో మంతనములు మాను మిదియు మతముర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... నేనెరిగిన ఒక మంచి అభిప్రాయము చెప్తాను విను. జరిగిపోయిన పని / విషయం గురించి అదేపనిగా చింతించకు / ఆలోచించకు. నీకు పరిచయమైన ప్రతీ స్త్రీ నీపై ప్రేమ, ఆదరణ చూపుతుంది అని అనుకోకు. మహారాజులు అంతఃపుర కాంతలతో రాచ వ్యవహారాలు ముచ్చటించరాదు ..... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *"గతజల సేతు బంధనం" - నీరు వెళిపోయిన తరువాత వారధి కడితే ఉపయోగం ఏమి వుంటుంది.* *కనుక "దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి"* *నాటి సమాజంలో స్త్రీ, తక్కవ విషయ పరిజ్ఞానం కలిగి వుంటుంది అని అప్పటి అభిప్రాయం. కనుక వారితో రాచ కార్యాల గురించి, ఇంటి విషయాల గురించి చర్చించినా ఏమీ సమాధానం రాదు అని ఆనాటి భావం. కానీ ఈనాడు అలాకాదు.* *ఏనాడైనా, పరకాంత, వెలయాలు మన మీద అభిమానం, ఆత్మీయత కలిగి వుండదు, చూపదు.* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
July 1, 2020 • T. VEDANTA SURY • Poem