ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమహాసిని--పద్మ త్రిపురారి. జనగామ.
September 28, 2020 • T. VEDANTA SURY • Poem

ప్రకృతి సహజత్వం
ప్రేమ రూపమయి
ఇంటింటి వరముగ
జనించిన మమతల
 మరుమల్లి కూతురు
అమ్మనాన్నల
ఆత్మబంధమయి 
గుండె గూటిలో
 వెలిగిన మణిదీపమే
 కూతురు
ఒద్దిక పొందిక కలిగిన
కరుణామయి
నిండుగ మెండుగ
సహృదయత చాటెడి
సహనశీలి.
అమ్మలోని ఆత్మీయత
నాన్నలోని నవనీయత
పుణికి పుచ్చుకొని
మానవత లతలనల్లెడి
సుమనస్విని  కూతురు.
ఓర్పు సహనముల
నాభరణములుగ ధరించి
ఓటమెరుగని ప్రేమ
 విజేతగ నిలిచెడి
 భూజాత కూతురు.
తల్లిదండ్రుల ఆశల
 ఆశయాలను
శ్వాసగా చేసుకొని
ఆదర్శపయనమైన
కార్యశీలి కూతురు.
బంధానుబంధాలకు
బంధమైన లోగిలిలో
సిరిమల్లై విరబూసిన
సుమహాసిని కూతురు.