ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సూర్య నమస్కారములు - ఆరోగ్యం - పి . కమలాకర్ రావు
October 3, 2020 • T. VEDANTA SURY • health tips

ప్రతి వ్యక్తి సూర్యోదయం కాగానే ఆరు బయట గాలి ధారాళంగా వీచే చోట ప్రతి రోజు చేయవలసిన సూర్య నమస్కారములు , తూర్పు వైపునకు తిరిగి సూర్యుడికి అభిముఖంగా చేయడం వలన శరీరానికి నేరుగా సూర్యుడి కిరణాలు తగులు తాయి . సూర్య నమస్కారాలు సంపూరణమైన వ్యాయామం మొత్తం 12 సూర్య నమస్కారాలు శరీరం లోని అన్ని భాగాలను చైతన్య వంతం చేస్తాయి. ఊపిరి తిత్తులలోనికి గాలిని పీలుస్తూ వెన్నెముకను వెనక్కి వంచడం మళ్ళీ గాలిని ఫేదులుతూ ముందుకు వంగడం వలన శరీరం లోని కండరాలకు, నరాలకు కదలికలు కలిగిస్తుంది. రక్త ప్రసరణ అన్ని భాగాలకు  సమంగా జరుగుతుంది. కీళ్లు శక్తివంతం అవుతాయి. పొట్టలోని భాగాలు, గుండే, ఊపిరి తిత్తులు ఆరోగ్యమవుతాయి వెన్నెముక , కటి ప్రదేశం లోని లోపాలు , సవరించ బడతాయి. చేతులలోని , కాళ్ళ లోని , భుజముల లోని , తొడలలోని , కండర సముదాయం ఉత్తేజితమవుతుంది . సూర్య నమస్కారాలు చేయడం వలన ఉచ్వాస , నిశ్వాసాలు సమంగా జరుగుతాయి. స్వచ్ఛమైన గాలి పీల్చడం  వలన ఊపిరి తిత్తులలోని  గాలి గదులు తెరుచుకుంటాయి. సూర్య నమస్కారాల వలన శారీరక శక్తి పెరిగి , రోగాలు దరి చేరవు. అన్నింటికన్నా ముఖ్యముగా మధుమేహ వ్యాధి రానివ్వదు . మానసిక ప్రశాంతతను పెంచుతుంది. తొగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సూర్య నమస్కారాలు గురు ముఖతః నేర్చుకుని చేస్తే మంచిది.