ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సృజనాత్మకత--చీకట్ల సంగీత-జగిత్యాల.
November 7, 2020 • T. VEDANTA SURY • Poem

మానవ మస్తిష్కంలో 
తళుక్కు మన్న తారలా
సృజనాత్మక మెరిసి..
ఆశల సౌదానికి,
ప్రతిభకు --
ఊపిరిగా నిలుస్తూ..
ఆకాశమంత -
ఎత్తుకు చేరవేస్తుంది..!

తెల్లని కాగితంపై
ఇంద్రధనస్సులాంటి
 రంగులతో---
అందమైన చిత్రలేఖనంలా
సృజనాత్మక...
అడ్డుగా వచ్చిన-
 అవరోధాలను,
అవలీలగా ఎదుర్కొని,
ఎవరెస్టు శిఖ రమంత
విజయాన్నందిస్తుంది ..!

ప్రతి మనిషికి సృజనాత్మకత
వజ్రాయుధంలా ఆరో ప్రాణమై
జీవితాన్ని---
నందనవనంలా మారుస్తూ..
తేజోవంతంగా వెలిగేలా,
అద్భుత అవకాశాలనందించి,
విజయ కీర్తి పతాకాన్ని
ఎగురవేసి--
జీవితాన్ని గెలిపిస్తుంది..!!