ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సెయింట్ జార్జ్ కోట:--కోట అనగానే తమిళనాడు ప్రభుత్వం అనే విధంగా ప్రసిద్ధి పొందింది సెయింట్ జార్జ్ కోట. మన దేశంలో ఆంగ్లేయులు కట్టించిన తొలి కట్టడమిదే కావడం విశేషం. ఈ కట్టడం తమిళనాడు రాజధాని మద్రాసులో ఉంది.1600 సంవత్సరంలో వాణిజ్య ఉద్దేశంతో మన దేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ లో ఆనుమతి పొంది తమ వాణిజ్యాన్ని చేపట్టింది. బంగాళాఖాతంలో తన వాణిజ్య నౌకలనూ వాసనద్రవ్యాలనూ తమ బాగోగులకోసమూ మలేసియా, ఇండోనేషియా తదితర దేశాలకు సమీపంలో ఓ రేవుపట్టణాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది ఈస్ట్ ఇండియా సంస్థ.ఇందుకు అవసరమైన జాగా అన్వేషించిపెట్టే బాధ్యతలను తూర్పు ఇండియా కంపెనీ తమ ఏజెంట్ ఫ్రాన్సిస్ డే అనే అతనికి అప్పగించింది.మచిలీపట్నంలో తమ వ్యాపారాభివృద్ధికి అనుకూలమైన అంశాలు లేవనుకున్న ఈస్ట్ ఇండియా సంస్థ తమిళనాడుకు దగ్గర్లో ఓ స్థలంకోసం వెతుకులాటలోపడింది. అప్పుడు వేంకటప్పర్ అనే అతను ఆంగ్లేయులకు వ్యాపారానికి సంబంధించి రాయితీలివ్వడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే శాంథోంకి అయిదు కిలోమీటర్లు ఉత్తరంగా మద్రాసు పట్టణం తర్వాత జాలర్లు నివసించే ఓ గ్రామాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి వ్యాపారలావాదేవీలు కొనసాగించడానికి హక్కులు పాందారు. ఇందుకు సంబంధించి 1639 మార్చి ఒకటో తేదీన ఓ ఒప్పందం కుదిరింది. కుదుర్చుకున్న ఒప్పందం . ఏడాదికి ఆరు వందల పౌండ్లు చెల్లించడమే ఆ ఒప్పంద నిబంధన.ఈ ఒప్పందం జరిగినప్పుడు మొదటి చార్లస్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నారు. అనంతరం ఇక్కడ ఒక కోట కట్టాలనుకున్నారు.కోటలోని ఓ భాగాన్ని 1640 లో నిర్మించడం మొదలుపెట్టారు. అది సెయింట్ జార్జ్ పవిత్ర దినమైన ఏప్రిల్ 23 వ తేదీన పూర్తవడంతో ఈ కట్టడానికి సెయింట్ జార్జ్ కోట అని పేరు పెట్టారు. 1641 లో చోళ మండల తీరాన ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ప్రధాన వర్తక కేంద్రంగా మారింది. ఫ్రాన్సిస్ డేతో సహా ఎందరో ఆంగ్లేయులు ఈ కోట నిర్వాకాన్ని చూస్తూ వచ్చారు.1678 లో సెయింట్ జార్జ్ కోట ఆవరణలోనే సెయింట్ మేరీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోనే 1753 లో రాబర్ట్ క్లైవ్ వివాహం జరిగింది.1670లలో యేల్ అనే అతను మద్రాసు గవర్నర్ గా ఉండేవారు. ఇతను ఆంగ్లేయుడు. ఇతను గోల్కొండ సుల్తాన్ నుంచి తిరువల్లిక్కేణి, తండయార్ పేట, ఎగ్మూర్ తదితర గ్రామాలను కొనుగోలు చేసి బ్రిటీష్ వారి ఎల్లలను విస్తరించాడు.ఏదేమైనా సెయింట్ జార్జ్ కోట మన దేశ కట్టడాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే అపూర్వమనదిగా నిలుస్తుంది. - యామిజాల జగదీశ్
June 28, 2020 • T. VEDANTA SURY • News