ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సెల్యూట్.....:--.అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి ).
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

బాలలూ.....
అయిన వాళ్ళందరికీ దూరంగా
ఆకలి దప్పులు మర్చి
ఆలు బిడ్డల అప్యాయతానురాగాలు
ప్రక్కన పెట్టి
ఆద మరచే నిద్రను
దూరం నెట్టి
ఆట పాటల జీవితాన్ని
ఆవల గెంటి
అర చేతిలో 
ప్రాణాలు పెట్టి
అనుక్షణం దేశరక్షణ
కోసం పోరాడి
అశువులు బాసే
అమర వీర జవానుల కోసం
చేద్దామా సెల్యూట్ ....!!