ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సెవన్ వెల్స్---1639 లో మద్రాసులో అడుగు పెట్టిన ఈస్టిండియా కంపెనీ వాళ్ళు బంగాళా ఖాతానికి సమీపంలో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు.ఈ కోటలోనే ఈస్టిండియా కంపెనీ అధికారులు, ఉద్యోగులు నివసించేవారు. ఇక్కడ వీరిని నీటికొరత నానా ఇక్కట్లపాలు చేసింది. సముద్రానికి సమీపంలో ఉండటం వల్ల జార్జి కోటలో ఎక్కడ తవ్వినా ఉప్పునీరే లభించేది.శీతల ప్రదేశమైన ఇంగ్లండు నుంచి వచ్చిన వీరిని అటు మద్రాసు ఎండలు ఉడికించిపడేసేవి. ఇటు నీటిఎద్దడితో చిక్కులు.దాహం తీర్చుకోవడానికి మంచినీరు కావలసి వచ్చేది నీటి కొరత నుంచి బయటపడటం కోసం ALL IS WELL అని చెప్పాలంటే మనకంటూ అవసరం ఓ మంచి బావి అని కెప్టెన్ బెకర్ అనే ఇంగ్లీష్ ఇంజనీయర్ ఓ సూచన చేసాడు.ఆయన సూచన మేరకు నేటి మింట్ పరిధిలో అప్పట్లో పది బావులు తవ్వించారు. కానీ ఏడింట్లోనే నీళ్ళు పడ్డాయి. దాంతో ఆ ప్రాంతాన్ని సెవన్ వెల్స్ Seven Wells అని పిలవడం మొదలుపెట్టరు. ఈ ప్రాంతాన్ని పూర్వం పెత్తనాయకన్ పేట అని పిలిచేవారు. పదహారు అడుగుల వృత్తాకార విస్తీర్ణంలో 23 నుంచి 29 అడుగుల లోతుకుఈ బావులను తవ్వారు. ప్రస్తుతం ఒక్క బావిలో మాత్రమే ఇంకా నీరున్నట్లు సమాచారం. మిగిలిన ఆరు బావులు పూర్తిగా ఎండిపోయాయి.1772లో తవ్వించిన ఈ బావులలోని నీటితో ఏడేళ్ళపాటు దాదాపు ఆరు వేల మంది నీటిసమస్యను తీర్చారుఈ ఏడు బావుల నీటిని ఈస్టిండియా వారు పదిన్నర వేల రూపాయలకు కొనుగోలు చేసారు.ఏడు బావుల సమీపంలి ఉన్న వీరాసామి స్ట్రీట్ లో రామలింగ అడిగళర్ (స్వామి. ఓ సాధువు) స్మారక మందిరం ఉంది. ఈ ఇంట్లో ఆయన దాదాపు ముప్పై మూడేళ్ళు నివసించారు.- యామిజాల జగదీశ్
July 27, 2020 • T. VEDANTA SURY • Memories