ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సోనూసూద్ కి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..: హిమజ . సి. హెచ్ .
September 30, 2020 • T. VEDANTA SURY • News

బాలీవుడ్ యాక్ట‌ర్ సోనూసూద్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. లాక్ డౌన్ స‌మ‌యంలో సోనూ చేసిన నిరుప‌మాన సేవ‌లు ఖండాంత‌రాల‌కు వ్యాపించింది. ఆయ‌న సేవ‌ల‌కుగానూ ఐక్యరాజ్య సమితి అవార్డు వరించింది. UNO అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (United Nations Development Programme)  స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును (SDG Special Humanitarian Action Award ) ప్ర‌క‌టించింది. కరోనా వైరస్ వ్యాప్తి కార‌ణంగా విధించిన‌‌ లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది వలసకూలీలు, విద్యార్థులకు ఊహించ‌నిరీతిలో సేవలందించినందుకు ఆయ‌న‌కు ఈ అవార్డ్‌తో స‌త్క‌రించింది. ఓ వర్చువల్‌ కార్యక్రమంలో  ఈ అవార్డును ప్రదానం చేశారు. కానీ ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. 
ఇప్ప‌టివ‌ర‌కు  సినీ న‌టుల్లో ఆంజెలినా జోలీ, డేవిడ్‌ బెక్‌హమ్‌, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంకా చోప్రాతో పాటు అతికొద్ది మందికి మాత్ర‌మే ఈ అవార్డును అందుకున్నారు. ఆ అతికొద్ది మంది సినీ ప్రముఖుల జాబితాలో సోనూసూద్ చేరారు. ఈ అవార్డును అరుదైన గౌరవంగా భావిస్తున్న‌ట్టు సోనూసూద్ తెలిపారు.