ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సౌదామిని " సౌందర్యరాశి. యుక్త వయసులో నున్న మేథావి.వయసులో చిన్నదైనప్పటికీ ఆమె భావాలు ఉన్నత మైనవి. తండ్రి బాలయ్య ఆమె గురించి చెబుతూ " ఆమె గొప్ప గర్వమున్నమనిషి. ఆమెకు గొప్ప సంపద ఉన్నది. ప్రేమతో కూడుకున్న అధికార చైతన్యం ఆమెది అంటాడు. ఇక స్ర్తీగుణగణాల గురించి చెబుతూ " జీవితం బోధించే దేేేమిటో స్ర్తీకి తెలిసి ఉండవచ్చు. ఇంటి వెలుపల పురుషుడు సాగించే కార్యకలాపాలలో ఆమె పాలుపంచుకోలేదు. ఆమె జీవితానికి, కుటుంబ జీవితానికి వ్యత్యాసం ఉంది. ఇవన్నీ సోదరుడికి ఎంతమాత్రం పట్టవు. భర్త దృష్టిలో ఇవన్నీ ముఖ్యమైనవే...బాలయ్య రచయితను స్నేహితునిగా భావిస్తున్నాడు. తన కూతురు మనస్థత్వాన్ని రచయితతో వివరించి చెప్పినప్పటికీ రచయిత ఆలోచన మరోవిధంగా ఉంది. సౌదామిని అందాన్ని పరికించాలని రచయితకు కుతూహలంగా ఉంది. అలా చూడలేకపోవడం తనకు వచ్చిన గడ్డురోజులుగా భావిస్తాడు. ఆమెకు గల ఉత్కృష్ట సౌందర్యము, యౌవన పరిమళమూ నిండిన దశలో ఆమె స్పూర్తి ప్రకాశిస్తున్నది అనుకుంటాడు. ఇలా ఆలోచనల్లో రచయిత మునిగి తేలుతుంటాడు. ఇంతలో బాలయ్య వస్తాడు. సౌదామిని గురించి ఎంతగానో ఆలోచి స్తున్న రచయిత ఈలోకంలోకి వచ్చి బాలయ్యను చూసి "మీకెంతో రుణపడి ఉన్నాను. మీ దయార్ద్రతకు బదులు చెల్లించ లేను." అంటాడు. అందుకు బాలయ్య తను ఈ ఊరుకు వచ్చిన పనేమిటని అడుగుతాడు. " నీలగిరిలోనిసుందర దృశ్యాలను చూడ్డానికి, ఆహ్లాదకరమైన గాలిని పీల్చిఆనందించడానికి వచ్చానంటాడు. అలా అనేసరికి వారం రోజులు ఉంటానని వాగ్ధానం చెయ్యమంటాడు బాలయ్య. అలానే అంటూ చాలా సంతోషం పడతాడు రచయిత. తను ఉండాలంటే రచయితకు కొన్ని నిబంధనలు బెడతాడు బాలయ్య. అవేమిటంటే -- 1.మీరెవ్వరినీ చూడరాదు. 2. వీధుల్లోకి వెళ్లరాదు. 3. ఈ ఇంటిలోను, అంతగా తిరగనిఈ ఇంటి ప్రదేశాలోనూ తిరిగే స్వేచ్ఛ మీకు ఉంటుంది. 4. మా (బాలయ్య) కుటుంబం గురించి ఎవ్వరికీ ఒక్కమాట కూడా చెప్పకూడదు అని . తమ కుటుంబం ఇక్కడ ఏకాంతంగా జీవిస్తున్నాం. ప్రపంచం దుర్మార్గమైనది. ఈ ప్రంచానికి కుతూహలం, కిరాయితత్వం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా బాల్యంలోనే తన కూతురుకు వివాహంచేసి ఉంటే బాగుండేది అనుకున్నాడు. ఇప్పుడు సౌదామిని పెద్దదయింది. ఆమెకిప్పుడు స్వంత ఆలోచన ఉంది. బాలయ్య బంధువులు, యువకుల సలహాలను నమ్మడు. వారి సలహాలలో స్వార్థముందని భావిస్తాడు. తన కూతురు సౌదామిని సౌందర్యానికి బాలయ్య గర్విస్తాడు. అంతేకాదు సౌదామిని తల్లి వయస్సులో ఉన్నప్పుడు ఆమె అందం గురించి చెప్పబోయి ఆగిపోతాడు. ఇక గురజాడ కథ మధ్యలో నెల్లూరు బ్రాహ్మణుని ప్రస్తావన తెస్తాడు. కానీ ఆ పాత్ర ప్రాధాన్యత ఈ కథలో ఎక్కడా కనిపించదు. గురజాడ ఈ పాత్రను ఎందుకు ప్రవేశపెట్టారో మనకు తెలియదు. అలానే నాయుడు గురించి, అతను ఉంచుకున్న భార్య గురించి ఈ కథలో ప్రవేశపెట్టడం తరువాత వారి గురించి ఎక్కడా ప్రస్థావించకపోవడం మనం గమనించగలము. 'సౌదామిని' కథ ప్రారంభంలో రైలు దిగి వెళ్లి పోయిన ' కవి ' నాలుగవ అంకానికి వచ్చే వరకూ మనకు ఈ కథలో ఎక్కడ ఉన్నాడో తెలియదు. తరువాత కథ అంతా చివరి వరకూ అర్థం కాని రీతిలో గజిబిజిగా ఉంటుంది. ఏ పాత్ర ఏం మాట్లాడుతుందో ఎవరితోమాట్లాడు తుందో తెలియదు. ఇది గురజాడవారి అసంపూర్ణమైన కథ. తను వ్రాయబోయే కథకు ఇదో చిత్తు ప్రతిమాత్రమేనని మనం భావించాలి. తన చిత్తుప్రతిలో గురజాడ ఏం వ్రాసాడోనన్న ఆకాంక్షతోనో ఇది చదవాలి. ( సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 20, 2020 • T. VEDANTA SURY • Memories