ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సౌదామిని అనే కథ గురజాడవారు వ్రాసిన అసంపూర్ణమైన కథ. సౌదామిని పేరుతోనే ఒక చారిత్రక నాటకానికి కూడా ప్రణాళిక వేసుకొని వదిలి పెట్టారు. స్ర్తీల సమస్యల గురించి లోలోతులకు పోయిన ఆలోచనలు ఈసౌదామినిలో చాలా ఉన్నాయి. గురజాడ దీనిని ఒక చిత్తు ప్రతిగా ఇంగ్లీషులో వ్రాసుకుని అసంపూర్ణంగా విడిచి పెట్టు కున్నారు. ఈ కథ చదువుతున్నంతసేపూ మొదటి నుంచీ ఆఖరి వరకూ అంతా గజిబిజిగా ఉంటుంది. గురజాడ ఏం వ్రాస్తున్నాడో, ఏ ఆశయంతో వ్రాస్తున్నాడో చదివేవారికి అర్థంకాదు. ఈ కథలో ఒకామె తన బిడ్డలతో రైలులో ప్రయాణం చేస్తుంది. ఆ కంపార్టుమెంట్లోనే ఒక కవి, మరోవ్యక్తి ప్రయాణం చేస్తుంటారు. " కవి" ఆ కంపార్టుమెంట్లో ఉన్న ఆవిడతో మోజులో పడ్డాడు. కవి ఐదు క్షణాలలో పరిచయం ఏర్పాటు చేసుకోగల శక్తి సామర్ధ్యాలున్నవాడని రచయిత ( ' నేను' అన్నవాడు ) పాఠకునికి చెబుతాడు. అటువంటి లక్షణాలు కవి కలిగుండటం రచయితకు ఈర్ష్య, బాధ కలిగిస్తాయి. అయితే కవి ఇంతలోనే ఆమె పిల్లలకు ఆపిల్ పళ్లు ఇచ్చి , బొమ్మలు చూపించి స్నేహం చేసేస్తాడు. రైలు కిటికీలో నుండి నీలగిరి అందాలను పిల్లలు ఆశ్వాదిస్తుంటారు. అది గమనించిన కవి వారి తల్లితో మాటా మాటాకలిపి ఆమెను ముగ్గులోకి దించుతాడు. రచయిత కూడా వారితో మాటల్లో మాటలు కలిపాడు. కొద్దిసేపటి తరువాత రైలు ఒక స్టేషన్ లో ఆగితే ఆమె దిగవలసిన చోటున దిగింది. ఆమెకు రిసీవ్ చేసుకోడానికి ఆమె మిత్రులు ఆమెకెదురుగా వచ్చారు. ఆమె వారిరువురకూ వీడ్కోలు చెప్పి రైలు దిగి దగ్గరగానున్న బంగ్లాకు వెళుతున్నది. అది చూసిన కవిగారు తన సంచిపట్టుకొని రైలు దిగి ఆమె వెంటబడ్డాడు. అది చూసిన రచయిత తనతోపాటు రైలులో రాలేదా ? అని కవిని అడుగుతాడు. అందుకు సమాధానంగా " పిల్లల విద్యవిషయంలో తనకు మిక్కిలి ఆశక్తి కలదనీ, విద్యాబోధనకు సంబంధించిన ఒక నూతనపద్ధతి ఆమెకు కొట్టిన పిండి అనీ,ఆ నూతన పద్ధతిని బోధపరచుకోవాలనుకుంటున్నానని " కవిగారు చెప్పారు. కవిగారి మాటలకు రచయిత నివ్వెరపోయాడు. కవిగారు తన స్వంత విద్యపట్ల ఆశక్తి తప్పితే , విద్య గురించి ఆశక్తి చూపడం ఏనాడూ చూపలేదు. ఆమెలో ఎంతో ఆకర్షణ శక్తి ఉంది. కవియేకాదు. రచయిత(నేను అన్నవాడు) కూడా ఆమె ఆకర్షణ నుండి తప్పించుకో లేకపోయాడు. రచయిత ఆమె వెళ్లిపోయేవరకూ ఆమెను చూసీచూడనట్టు ఆమె ప్రక్కనే నిలుచున్నాడు. కవి, రచయిత ఇద్దరూ ఆమెపట్ల ఆకర్షితులయ్యారు. ఊటీ రోడ్డు దగ్గర జట్కా ఎక్కాడు రచయిత. జట్కా బండి ఎక్కాడేగానీ రచయిత తన మనసంతా కవిగారి మీదే ఉంది. ఆ కవి ఏ పెద్దింటావిడ భవనంలోనో దర్జాగా కూర్చొని, భూమ్యాకా శాల గురించి ఫెళఫెళమని వాగేస్తూ ఉంటాడనీ, తను ఈ కుదుపుల జట్కాలో కూలబడ్డానని అనుకుంటాడు. ఆ గుర్రందెబ్బలు తింటున్నా ముందుకు పోయేదికాదు. రచయిత(నేను ) మరో జట్కాకు మారాడు. నేను బాలసాహిత్యరచయితగా మారేముందు ఇటువంటి మెలికలు గల గురజాడ రచనలు చదివినందుకు సంతోషిస్తున్నాను. ( సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 16, 2020 • T. VEDANTA SURY • Memories