ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సౌదామిని -- గురజాడ రచన: శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 22, 2020 • T. VEDANTA SURY • Memories

గురజాడవారి కథ ' సౌదామిని' అయిదవ అంకానికి వెళ్ళి ఆ కొద్దిపాటి లైన్ లు (అంటే పది, పన్నెండు లైన్ లు) చదివితే ఆఖరి లైన్ లో ' సౌదామిని' ప్రశక్తి వస్తుంది. దానిని ఆధారంగా మనం నాల్గవ అంకం ఆఖరి రెండు లైన్లలో 'ఆమె' అని వచ్చిన చోటల్లా మనం' సౌదామిని' గా భావించుకోవాలి.ఐదవ అంకంలో ఒక జమీందారు ఆమెను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఈ వాక్యంలో 'ఆమెను' అంటే 
సౌదామిని గా మనం భావించుకోవాలి. సౌదామిని జమిందా రుని కత్తితో పొడిచేస్తుంది. అంటే నాల్గవ అంకములో స్ర్తీ ఖడ్గ విద్య నేర్చుకోవాలంటాడు. సౌదామిని  ఖడ్గ విద్య, కవిత్వం, పద్యాలు చదవడాన్ని' కవి' గారి పర్యవేక్షణలో నేర్చుకుంటుంది. అలా తను నేర్చుకున్న విద్యలలో ఖడ్గ విద్య కూడా ఒకటుంది. ఆ కారణంగానే జమిందార్ తనను ఎత్తుకుపోయినప్పుడు అతనిని  కత్తితో పొడిచేస్తుంది.ఆ సమయంలో 'కవి' కూడా దెబ్బతింటాడు.రక్తంకారుతుంది. కొండమీద నుండి గంతులేస్తూ ఆమె తిరిగి వస్తుంది.  కవి
గారిని రిక్షాలో పడేసి తెచ్చేస్తారు. కొండల్లో గుర్రపు స్వారీ చేస్తుండగా జమిందారుని దగ్గులు పొడిచి చంపినట్లుగా మరుసటి రోజు అక్కడ ఉన్నవాళ్లు విన్నారు. కవి ఆమె ( సౌదామిని ) సోదరుణ్ణి కత్తిసాములో కింద పడేసి అతనిని నరుకుతానంటాడు. సౌదామిని జోక్యం చేసుకుని ఆమె సోదరుడుని పక్కకు తీసుకుపోయి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అతనిని  మౌనంగా ఉండమని చెబుతోంది. సౌదామి నికి,  ఆమె సోదరునికీ వారి వారి మనోప్రవృత్తుల మధ్య, నైతిక దృక్పథాల మధ్య తేడా ఉంది. మతపరమైన అభిప్రా యాలు వగైరాలు ఇద్దరిలోనున్న ఉమ్మడి లక్షణం. తమకుఎలా తోస్తే అలా చేసే తత్వం ఇద్దరిదీనూ ! ఎవరి పద్ధతిలో వారు గట్టివారే ! సౌదామినికి తన తల్లి పుట్టుక గురించి తనకు తెలుసు. తన తల్లి పుట్టుక సౌదామిని హృదయాన్నిపురుగులా తొలుస్తుంది. ఇలా ఐదవ అంకములో సౌదామిని
కుటుంబ  సభ్యుల మనస్థత్వాలు వివరించబడతాయి. ఆరవ అంకములో ' కవి' ట్యూడర్ హాల్ వద్దకు వస్తాడు. అక్కడ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ ' 'సౌందర్యం' అంటే సౌదామినియే !  ప్రియా అని ఆమెను పిలుస్తాడు. అలా తను పిలిచినందుకు కంగారు పడొద్దు  అంటాడు ఆమెతో. అలా ఆమెను పిలవడం వలన తను ఆమెను ప్రేమిస్తున్నాననీ, దాని వలన తనకు ఎటువంటి 
హానీ కలుగదనీ చెబుతూ తనకు జరిగే  హాని ఏమీ లేదనీ, తన స్నేహం మాత్రమే కావాలంటాడు. అంతేకాదు  తననుచూడడమే కవికి అమితానందమట. ఆమె మాటలు సరససంగీతం,నిత్యమూ నవనవోన్మేషం.శృంగార ఇంద్రధనస్సుతో తనీ వాతావరణాన్ని ఆమె ఏలుతుందంటాడు . అలా తన స్నేహాన్ని మాత్రమే కోరుతున్నానని ఒక ప్రక్క చెబుతూ తనే (కవి) గనుక ధనవంతుడనై ఉంటే సముద్రం మధ్య గలద్వీపానికి ఎత్తికెళ్ళి అక్కడ తనను  సౌందర్య  రాజ్యానికి పట్టపురాణిని చేసి ఉండేవాడిని." అంటాడు. కవి తన ప్రేమ వలన ఆమెకు ప్రమాదంలేదని చెబుతూనే ఆమెను ఎక్కడికో ఎత్తుకుపోయి సౌందర్య రాజ్యానికి పట్టపు రాణిని చేస్తాననడం ఏమీ బాగులేదు. ఆ సౌందర్యవతికి మాయమాటలు చెప్పి, స్నేహం పేరుతో ప్రేమ వలలో పడేయడం కాదా? స్ర్రీలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే పరుల దృష్టిలో స్ర్తీ తన సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని కోల్పోవచ్చు. కానీ హృదయ మూ,  మెదడూ గల భర్త దృష్టిలో మాత్రం  భార్య సౌందర్యంఎన్నటికీ తరగదు. వివాహం, భార్యాభర్తల అనుబంధాన్నిగురించి కవి పాత్ర ద్వారా గురజాడ చెప్పిస్తాడు. పరుల దృష్టిలో ఒక పురుషుని భార్య సౌందర్యం కోల్పోతే వచ్చిన  నష్టం  ఏమైనా ఉందా ? ఆ భార్యను భర్త విడిచిపెట్టేస్తాడా ?  అలానే ఒక పురుషుడు తన  సౌందర్యాన్ని కోల్పోతే వచ్చే నష్టమేమైనా ఉందా ? ఆ పురుషుడిని ఆ భార్య విడిచి పెట్టేస్తుందా ? అలా ఒకరినొకరు విడిచిపెట్టుకోవడం పాశ్చాత్యసాంప్రదాయాల్లో ఉందేమోగానీ, భారతీయ సాంప్రదాయాల్లోలేదు. అయినా గురజాడ భావమేమిటో అర్థంకాలే ! కొంత మంది స్రీలు తమ సౌందర్యాన్ని కాపాడుకోడానికి శ్రమించడం, ఆరుబయట గాలిలో నడవడం, సైకిల్ తొక్కడం, గుర్రపుస్వారీ చెయ్యడం, కష్టాలను దరిచేరనీయకుండా ఉండటం చేయాలంటాడు ఈ కథలో. కానీ మనం ఇక్కడ ఒక్క విషయం గ్రహించాలి. సౌందర్యాన్ని కాపాడుకోవడంలోస్ర్తీ, పురుషులిద్దరూ ఎవరి కృషి వారు చేయాలి.  స్ర్తీ అందం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటాడు గురజాడ. పురుషునిఅందం  కూడా శాశ్వతం కాదని మనం గ్రహించాలి.  స్ర్తీ ఒక పురుషుని వివాహం చేసుకోవాలనుకున్న ప్పుడు శారీరక సౌందర్యం కంటే   స్ర్తీ కళ్లల్లో , స్ర్తీ జీవితం లో  ఎక్కువ సౌందర్యం చూడగల పురుషుని మాత్రమే ఆమె వివాహం చేసుకోవాలి. భర్త పూర్తిగా జబ్బు మనిషిగా మారి అశక్తుడైనప్పుడు  అప్పుడు కూడా తన భార్య, బిడ్డలు అతనిని సహిస్తారు, భరిస్తారు. ఏ ఉపాధి లేని కుటుంబానికిప్రభుత్వమే ప్రత్యేక వనరులు కల్పించాలనే సూచన ఈకథలో  చేసారు గురజాడ. ఇది అసంపూర్ణమైన కథగా మిగిలిపోయింది. ( సశేషం )