ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్నేహితం--పి.విశాలాక్షి.. కరీంనగర్
October 1, 2020 • T. VEDANTA SURY • Story

మెట్రో స్టేషన్ ప్రతిరోజు ఎంతోమంది వారివారి పనులమీద హడావుడిగా వెళ్తూ ఒకరికొకరు పట్టించుకునే సమయం కూడా ఉండదు.
ఎక్కడనించి వచ్చిందో ఓ కుక్కపిల్ల స్టేషన్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరినీ మెట్లదగ్గర పలకరిస్తూ తోక ఊపుతూ తన విశ్వాసాన్ని ప్రకటించేది.
కొంతమంది విసుక్కునేవారు ఇంకొంతమంది భయపడేవారు. 
కానీ ఒకమ్మాయి అది చూసి రోజు ఆ కుక్కపిల్లకి బిస్కెట్లు పెట్టడం దానికి మట్టిమూతలో మంచినీళ్లు పోయడం ప్రతిరోజు తను వెళ్ళేటప్పుడు వచ్చినపుడు చేసేది.అల ఒక నెలరోజులు గడిచింది.

ఒకరోజు తను కుక్కపిల్లను కుంటడం చూసింది ప్రొద్దున బాగానే వుంది సాయంత్రానికి ఏమయిందో అని దాన్ని దగ్గరగా తీసుకుని చూస్తే కాలికి దెబ్బ కనిపించింది.తన ఒక్కడానివాల్ల అవుతుందో లేదో అని అటుఇటు చూసింది తనతో పాటు రోజు మెట్రోలో ప్రయాణించే అమ్మాయిని పిలిచింది నీ పేరు ఏంటి అని ఆడిగేసరికి రోజు చూద్దాం వల్ల ఆ అమ్మాయి సందేహపడక జ్యోతి అని చెప్పింది . 

జ్యోతి నా పేరు అనురాధ ఒకచిన్న సాయం చేస్తావా అంది దానికి జ్యోతి  ప్రశ్నఅర్ధకంగా చూసింది ఏమీలేదు ఈ కుక్కపిల్లకి కాలుకి దెబ్బ తగిలింది డాక్టర్క్ కి చూపించాలి తోడు వస్తావా అని అడిగింది అనురాధ.

జ్యోతి ఇప్పుడు నీకు ఇది అవసమా అంది.

 స్నేహం అంటే మనుషులతో చేసేదే అని అనుకుంటారు అందరూ.జీవజాతులతో కూడా స్నేహం చేయవచ్చు.కష్టం అందరికి సమానమే, మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితులే సంతోషంలో తొడున్నా లేకున్నా కష్టంలో మాటసాయం చేసి పక్కన దేర్యానిచ్చే స్నేహితులు ఉంటే చాలు సమస్య సామరస్యంగా పరిస్కారం అవుతుంది.అంది అనురాధ.

దాంతో జ్యోతి సరే అని ఒప్పుకుంది.

ఆటో మాట్లాడి ఇద్దరు కలిసి ఆ కుక్కపిల్లని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కట్టుకట్టించి .వ్యాక్సిన్ వేయించి తీసుకుని వచ్చి మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న పార్కింగ్ లో ఉంచి దానికి తినడానికి పెట్టి వెనుదిరిగారు ఇరువురు.

ఇదంతా జరుగుతున్న క్రమంలో జ్యోతి మాత్రం చాలా అసహనంగా ఇదంతా అవసరమా అన్నట్టు గొణుగుతూనే ఉంది .

కానీ అనురాధ తనకు తోడుగా వచ్చిన జ్యోతికి థాంక్స్ చెప్పింది.చిన్న పరిచయానికే నువ్వు నాకు తోడుగా వచ్చావు.నా కోసం రోజు ఎదురుచూసే ఈ కుక్కపిల్ల కోసం ఈ మాత్రం చేయకపోతే నేను దాని స్నేహితురాలిని ఎలా అవుతాను అనేసరికి ..

జ్యోతి సారి నేను తప్పుగా ఆలోచించాను నిజమే స్నేహితం అంటే ఇదే ఇహనించి నేను నువ్వు కూడా స్నేహితులం స్నేహం అంటే అర్థం తెలిపావు అని ధన్యవాదాలు తెలిపింది.

చిరునవ్వుతో ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అప్పటినుండి ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండిపోయారు.