ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్నేహితుల దినోత్సవం' సంక్షిప్త వివరణ --రచయిత మేకల మోహనరావు చైర్మన్ & ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరి--ప్రపంచదేశాల ప్రజలందరూ స్నేహ భావంతో ఉంటే అంతర్జాతీయ శాంతి.. సామరస్యం సాధ్యమవుతుందని భావించి 'స్నేహితుల దినోత్సవం' అనే అంశాన్ని మొదటిగారిగా 1958 లో ప్రతిపాదించి.. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవానికి అంకురార్పణ చేసిన దేశం దక్షిణ అమెరికా ఖండంలోని 'పరాగ్వే' (Paraguay) దేశం. 1958 లో పరాగ్వే దేశం ప్రతిపాదించిన 'స్నేహితుల దినోత్సవం' భావనను 2011 ఏప్రిల్ 27వ తారీఖు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1945 అక్టోబర్లో ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ... ఆమోదించి.... ప్రతియేటా జూలై నెల 30 వ తారీఖుని 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' గా జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 197 దేశాలకు పిలుపునిచ్చింది. అప్పటి 2011 నుండి ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 ఖండాలలోని 197 దేశాల్లోని ప్రజలందరూ జూలై 30 వ తేదీ 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' ఘనంగా నిర్వహిస్తున్నారు.--అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ జూలై 30 వ తేదీనే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోకుండా....ఆయా దేశాల్లోని తేదీలకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి వేర్వేరు తారీఖులలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అమెరికాలో ఫిబ్రవరి 15 వ తారీఖు... మన భారతదేశం..బాంగ్లాదేశ్.. మలేషియా.. మరియు సౌదీ అరేబియా (United Arab Emirates UAE) లో ఉన్న 7 దేశాలలో ఆగస్టు నెలలో వచ్చే మొదటి 'ఆదివారం' నాడు స్నేహితుల దినోత్సవం' జరుపుకుంటుండగా... నేపాల్ లో జూలై 30 న.... ఫిబ్రవరి 14 వ తేదీ మెక్సికో.. ఈక్వెడార్..ఎస్థోనియా...వెనిజులా దేశాల్లోనూ... బ్రెజిల్.. అర్జెంటీనా..స్పెయిన్.. ఉరుగ్వే.. దేశాలు జూలై 20 వ తారీఖు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి-కులం..మతం..డబ్బు. .అధికారం..హోదా.. జాతులు..దేశాలు..రాష్టాలు.. ప్రాంతాలు.. వయసు..వీటన్నింటికీ అతీతమైనది స్నేహబదం.(అయితే స్త్రీ పురుషుల స్నేహాలు ఎన్నో అనర్ధాలకు దారితీయవచ్చు). ద్వాపర యుగంలో.. శ్రీకృష్ణుడు..కుచేలుని 'స్నేహం' నిస్వార్థమైన..కల్మషంలేని స్నేహానికి గొప్ప ఉదాహరణ మరియూ ఈ నాటి స్నేహితులకూ ఆదర్శప్రాయం-నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలంటే... స్నేహితుడికి సమాజంలో పేరుప్రఖ్యాతులు వస్తుంటే ప్రోత్సహించాలి... ఆపదల్లో ఉంటే అవసరమైన సహాయం చేయాలి.. ప్రమాదంలో చిక్కుకుని ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఆదుకోవాలి. స్నేహితుడి పిల్లలు.. బంధువులు ఎక్కడైనా కనిపిస్తే మనస్ఫూర్తిగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలి. స్నేహితుడికి అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. ఈ మధ్యకాలంలో స్నేహితుడికి ఆరోగ్యం బాగోక ఆస్పత్రుల్లో... సీరియస్ గా ఉండి 'రక్తం అవసరమైన'సందర్భాలలో...స్నేహితులు వెళ్ళి ఆపదలో ఉన్న స్నేహితుడికి 'రక్తం ఇచ్చి' స్నేహితుడిని బ్రతికించుకుంటున్న సందర్భాలు మనం అనేకం చూస్తున్నాము. ఇలాంటివారే అసలైన స్నేహితులు...వీరే 'ప్రాణ స్నేహితులు'. ఇలాంటి స్నేహమే 'అజరామరం' మరియు భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయం
August 2, 2020 • T. VEDANTA SURY • News