ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వాతంత్య్రం తెచ్చింది ఎవరయ్యా-- గాంధీ తాతయ్య--రచన. పోలయ్య కవి కూకట్లపల్లి--హైదరాబాద్ - 9110784502
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

పల్లవి:
వచ్చింది వచ్చింది
స్వాతంత్య్రం  వచ్చింది
ఇచ్చింది ఇచ్చింది 
మనకు స్వేచ్ఛ నిచ్చింది
ఎవరయ్యా ఎవరయ్యా 
స్వాతంత్ర్యం తెచ్చింది
ఇంకెవరు తాతయ్య 
మన గాంధీ తాతయ్య  ||ఎవరయ్యా||

చరణం: 1
సింహమై గర్జించి
సూటు బూటు వేసుకున్న 
తెల్లదొరలను కర్రతో ఖద్దరు 
దుస్తులతో తరిమి తరిమి కొట్టి
మనకు స్వాతంత్ర్యం తెచ్చింది||ఎవరయ్యా||

చరణం: 2
అహింసనే ఆయుధంగా చేసుకుని 
ఆంగ్లేయుల అక్రమాలను
ఆగడాలను ఎదుర్కొని 
రక్తపాతరహితంగా
మనకు స్వాతంత్ర్యం తెచ్చింది ||ఎవరయ్యా||

చరణం: 3
ఉద్యమాలతో ప్రజలను 
ఉర్రూతలూగించింది ఉప్పు 
సత్యాగ్రహమను నిప్పురాజేసి
తెల్లవారగానే తెల్లదొరలను తరిమేసి
మనకు స్వాతంత్ర్యం తెచ్చింది  ||ఎవరయ్యా||

చరణం: 4
పరాయి పాలన
దాస్య శృంఖలాలను తెంచి
స్వేచ్ఛను ప్రసాదించి
హిందూ ముస్లిం క్రిస్టియన్ లు
భాయీ భాయీ అంటూ
సకల జనులు సమానమేనంటూ 
సందేశమిచ్చి
మనకు స్వాతంత్ర్యం తెచ్చింది  ||ఎవరయ్యా||

చరణం: 5
వందేమాతరం వందేమాతరమంటూ
దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ 
జాతీయ జెండాలను చేబూనిన 
సమరసింహాలతో జైళ్ళు నిండిపోగ
జాతి నేతలందరో నేలకొరిగిపోగ
మనకు స్వాతంత్ర్యం తెచ్చింది  ||ఎవరయ్యా||