ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వామి వివేకానంద సూచన: --- యామిజాల జగదీశ్
November 19, 2020 • T. VEDANTA SURY • Story

ఓమారు స్వామి వివేకానంద హిమాలయాలకు బయలుదేరారు. అయితే పర్వత మార్గంలో ఓ చోట ఓ పెద్దాయన నీరసంగా కూర్చున్నారు. 

ఆయన వద్దకు వెళ్ళి వివేకానందులవారు 
"ఏంటిలా డీలా పడి కూర్చున్నారు? ఏమైంది?" అని అడిగారు.

అప్పుడాయన "నిజానికి మరింత పైకి వెళ్ళాలనే అనుకున్నాను. కానీ నావల్ల కావడం లేదు. అలసిపోయాను. కాళ్ళు నొప్పెడుతున్నాయి" అన్నారు.

అప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పారో తెలుసా....

"మీ లక్ష్య సాధనలో పైకెందుకు చూస్తున్నారు? ఒక్కమారు కింద చూడండి. ఎంత దూరం వచ్చారో తెలుస్తుంది. అంత దూరం మీ పాదాల కింద ఉంది. పైకి చూస్తే ముందుకుపోలేరు. ఇప్పటికే మీరు నడిచొచ్చిన దూరాన్ని చూడండి. అంత దూరం వచ్చిన మీరు మరింత ముందుకు వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలరు...." అన్నారు. 

స్వామి వివేకానంద చెప్పిన ఈ మాటలు ఆ పెద్దాయనకు అమూల్యమై ఆయన తన లక్ష్య సాధనలో ముందుకుపోవడం సాధ్యమైంది.