ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
స్వేచ్ఛాగీతం!! ప్రభాత ప్రాంగణాన ప్రతి హృదిలో దేశభక్తి ఊసులెత్తి ఉప్పొంగిన స్వాతంత్ర సంబరం--కె ఎస్ అనంతాచార్య-- అత్యున్నత ఆశయాలు ,ఉదాత్త లక్షణాలన్నీ ప్రతి ఊపిరిలో! ఉత్తమ భావాల పరంపర నడకల్లో కలిగిన చరిత గంగానదిలో కరిగిన హిమానీనదమన్తా సాహిత్యo లోకి ప్రవహిస్తుంది! ఈ దేశ మట్టిలో ఏదో దివ్య ధాతువులు శరీరంలోని అణువణువునా నిండి నినదిస్తున్నాయి! సద్యోజాత భావావేశ అణురజo రక్తం లో పొంగి శతృసేనలకు సవాల్ విసరుతోంది! మానవత్వపు సారమంతా ఉత్ప్రేరకమై మనసుల్లోదూరి ఆధ్యాత్మికత పరిమళిస్తుంది అందరు బాగుండాలి అందున నేనుoడాలి జండా నీడన త్రివర్ణ శోభితమై బ్రతుకు పండాలి ఉరికొయ్యల భగ భగ లు ఆజాద్ హిందు కవాతులు ఈశ్వర్ అల్లా తేరే నామ్ లు జలియన్ వాలా దురంతాలు తెచ్చిన స్వతంత్ర ఫలాలు స్మరిస్తూ పఠిస్తూ ..... జాతి బేధాలు మరచి మతాల విష లతలు తుంచి పాడుకునే జాతి గీతం వందేమాతరం!! జండానెగురేద్ధాం జేజేలు కొడుదాo అవినీతిని తరిమికొడుదాo జాతి ఐక్యతగ జనగణ పాడుదాం ( స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల తో)
August 15, 2020 • T. VEDANTA SURY • Poem