ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హరిత హారం (బాలగేయం)-- --అన్నాడి జ్యోతి.సిద్దిపేట.
September 20, 2020 • T. VEDANTA SURY • Poem

మనిషి కొక్క మొక్కనైన
నాటుదాము బాలకా!!
ప్రాణ వాయువును పంచును
పచ్చనైన మొక్కలు!!

తరువులున్న తరిగిపోవు
కలుషితమ్ము బాలికా!!
భువికి సారమెంతొనిచ్చు
వృక్షమెపుడు బాలకా!!

        !!  మనిషి కొక్క మొక్క!!

 పచ్చనైన చెట్లతోని
ప్రకృతెంతొ అందము!!
పచ్చదనము చూసి మనసు
పులకరించు బాలకా!!

రంగు రంగు పూలతోని
రమ్యముగను తరువులు!!
చూడముచ్చటెంతొ గొలుపు
చూపరులకు బాలకా!!

          !!మనిషి కొక్క మొక్క!! 

చెట్లు మనకు నీడనిచ్చు,
పూలనిచ్చు,ఫలములిచ్చు
చచ్చి కూడ తనువునిచ్చు
త్యాగానికి గుర్తులు!!
మొక్క నాటి నీరుపోయు
మరువ బోకు బాలకా!! 
    !! మనిషి కొక్క మొక్క!!