ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హేహే జాతరే జాతరా!: జయంత్ నామిలకొండ
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

హేహే జాతరే జాతరా!:
చేపల జాతరరా!
జిమ్మలే జిమ్మలూ
వజ్రాలకాంతులా
నేల రాలే చుక్కల్లా
మెరుపులే మెరుపులు
నిగనిగలాడేటి వాటి ఒంపులే
సొంపులు రా!

పాపర్లు అదిగో పారుకుంటు
ఉరికెరో! పాలరాతికిందికీ
జిల్లెల్లునదిగో జిల్ జిల్మనియెగిరెరో!
చందమామలే ఆహా!
కనులదోచె అందమురా!

మొట్టలూ నదిగో గుంపులై ఉరికెరో!
నల్లని రాళ్ళచుట్టూఒంగిఒంగిదాగెరో!
జర జాలమే వేయరా పసిగట్టి పట్టరా!
నత్తగుల్లలైనా జారకుండ పట్టాలిరా.!

అరరే ఈజాతర లో సరదాలే చేయాలిరా!
మల్లేడుకాడ మనమేడ ముంటామురో!
ఉన్ననాళ్ళు పదిమందితోనే బాగుండాలిరో!
ఇగ ఈబతుకు బోతే ఎండిన బతుకేరా!

త్సేపలపేర్లే మరిచేనామురో
ఎన్నేళ్ళకచ్చెరో ఈవానలూ
వాగుల వంకలతోనే పొంగిపొర్లెరా!
ఇక మత్తుగా ఇకమతుగా బతికితేనేగానీ
బావుంటంరో జర భద్రంగాఉంటెనే బతుకుడేరో!

దావత్తులు గీవత్తులు మానుకోవాలిరో!
దయగల భార్యా పిల్లలతోనే దర్జాగ ఉండాలి
గుమ్మాలే దాటక గజిబిజి తిరగక
ఇల్లే కైలాసమని పిల్లలే వైకుంఠమని మెదిగి బతకాలిరా! మల్లె పూలాగా ఉండాలిరో!

గీజాతర్లోనే గా కరోనాకు గురిగాక
ముకుదాడు మాస్కులే ఏసుకోవాలి రా
ఏటి పాయలోలే బతుకులే సాగాలిరా
నవ్వుల సంబరాలతోనే సాగిపోవాలిరా!

చెరువులు కుంటలూ వాగులూ నదులూ
మన బతుకుల నింపే ధనరాసులురా!
ఏడేడు ప్రతిఏడు ఇలానే కలిపేలారావాలీ
పచ్చని బతుకుల్లో పరువాలే నింపాలిరా!