ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
'వినాయక స్వరూపానికి తాత్త్విక వివరణ..' --సుజాత.పి.వి.ఎల్
August 26, 2020 • T. VEDANTA SURY • Story

ప్రణవ మంత్రం అయిన ఓంకార స్వరూపమే వినాయకుడు.వినాయక స్వరూపానికి తాత్విక వివరణ దేవా నాగరి లిపిలో ఇలా చెప్పబడింది.వినాయకుడి ఆకారం ''ఓం '' అనగా ''ప్రణవం '' ను పోలి ఉంటుంది.తొండము ''ఓం''కారానికి సంకేతం.
తల- జ్ఞానానికి, యోగానికి చిహ్నం.శరీరము- మాయ, ప్రకృతికి సంకేతము.కుడి చేతిలోని పరుశువు- అజ్ఞానమును ఖండించే ఖడ్గము.
ఎడమ చేతిలో పాశము- విఘ్నాలను కట్టడి చేసే సాధనము.విరిగిన దంతము- త్యాగానికి చిహ్నము.మెడలోని మాల - జ్ఞాన సముపార్జన.
పొట్టపై నున్న నాగ బంధము- శక్తికి, కుండలినికి సంకేతము.పెద్ద చెవులు- భక్తుల కోర్కెలు శ్రద్దగా ఆలకించేందుకు నేనున్నానని విజ్ఞానాధిపతి చెప్పే అభయ చిహ్నాలు.ఇంత మహా శక్తి కాయుడిని మోస్తున్న ఎలుక వాహనం - జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలని మానవాళికి సందేశం తెలుపుతోంది. అందుచేతనే అనేక ధార్మిక లౌకిక కార్యక్రమాలలో వినాయకుడిని పూజించడం సర్వసాధారణమైన విషయం. ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ, ఏ శుభ కార్యం తలపెట్టినా ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామీ అని ఆ గణనాథుడిని వేడుకుని పూజిస్తాం అందుకే వినాయకుడిని ప్రధమ పూజ్యుడు అంటారు.