ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*భాస్కర శతకము* - పద్యం (౦౮-08)
September 12, 2020 • T. VEDANTA SURY • Poem

చంపకమాల :
*అలఘు గుణ ప్రసిద్ధుఁడగు | నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్*
*వలచి యొకించు కేమిడిన | వానికి మిక్కిలి మేలు చేయగా;*
*తెలిసి కుచేలుఁడొక్క కొణి | దెం డటుకుల్ దనకిచ్చినన్ మహా*
*ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక | భాగ్యము నాతనికీఁడె  భాస్కరా!*
*ఒక్క కొణిదెడు = ఒక్క చారెడు*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురు మూర్తివైన ,భాస్కరా!
చక్కటి గుణవంతుడు, మిక్కిలి సంపద గలవాడు, చక్కటి ధైర్యశాలి, అతి చక్కని కార్య నైపుణ్యం గలవానికి, తన స్నేహితుడు తనకు ఏమి ఇచ్చాడు అని ప్రశ్నించు కోకుండా, ఆ స్నేహితునికి అవసరమైన సమయంలో, తన శక్తిని మించి కూడా సహాయం చేస్తాడు.  ఎలా అంటే, సర్వ శక్తి సంపన్నుడు, సర్వ వ్యాప్తుడు అయి అన్నీ తానే అయిన శ్రీకృష్ణ భగవానునికి అతని చిన్ననాటి సహాధ్యాయి, సన్నిహితుడు ఐన సుధాముడు(కుచేలుడు) ఇచ్చిన చారెడు అటుకులకు ప్రతి ఫలముగా, సకల సంపదలు, సకల విధాలైన ఐశ్వర్యయాలు అనుగ్రహించారు కదా........ అని భాస్కర శతకకారుని వాక్కు.
 *మన స్నేహితులు / హితులు మనకు ఏమి ఇచ్చారు అని ఆలోచించకుండా, మన శక్తి, అవకాశం వున్న మేరకు వారి వున్నతికి సహాయ పడాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss