ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*భాస్కర శతకము* - పద్యం (౨౨ - 22)
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
 *ఎప్పుడదృష్టతా మహిమ | యించుక పాటిలు నప్పుడింపు సొం*
*పొప్పుచునుండుఁగాక యది | యొప్పని పిమ్మట రూపుమాయఁగా*
*నిప్పున నంటియున్న యతి | నిర్మలినాగ్ని గురుప్రకాశముల్*
*దప్పిననట్టి బొగ్గునకుఁ | దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
అదృష్టం మనవెంట వున్నపుడు మనకు కలిగిన సంపదలు అదృష్ట దేవత చూపు పక్కకు మరలగానే సంపదలన్నీ తొలగిపోతాయి. ఎలాగంటే, నల్లటి బొగ్గుకు అగ్ని దేవుడు తోడైతే ఆ బొగ్గు బంగరు కాంతితో మెరుస్తుంది.  అగ్నిశిఖలు చల్లారిన పిదప బొగ్గు కు వున్న నల్లని రూపం యథాతథంగా కనిపిస్తుంది కదా. .. అని భాస్కర శతకకారుని వాక్కు.
*సంపదలు కలిగినప్పుడు మాత్రమే చుట్టాలు దూర ప్రాంతాలనుంచి వచ్చి కూడా మనతో వుండే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పడైతే మనకు దురదృష్టం తోడై సంపదలు దూరమౌతాయో, ఎవరూ మనతో వుండరు. మనం మాత్రమే మనతో వుంటాము. అందుకని పైన కనిపించే మెరుపులకు మోహ పడక మనల్ని నడిపించిచే మన లోపలి శక్తిని మాత్రమే నమ్మి నడవాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss