ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
.చెప్పరూ ..: ---డా.కె.ఎల్.వి.ప్రసాద్,హనంకొండ.
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

 బోలెడు ,
ఇంటినిండా బొమ్మలు !

ఎక్కడచూచినా 
బొమ్మలే ..బొమ్మలు !

అమ్మకొన్నవి కొన్ని ,
బహుమతులుగా 
వచ్చినవి మరికొన్ని !

దాచుకోలేనన్ని 
బొమ్మలు ...అన్నీ 
ఆడుకునే బొమ్మలు ,
అందమైన బొమ్మలు !

నాకు బొమ్మలంటే -
ఉన్నాయి గాని ..
బొమ్మలంటే -
ఇష్టమేగాని 
ఆడించే వాళ్లే లేరు !

తన గదిలో తాత ..
మొబైల్లో కళ్ళుపెట్టి 
ఏవో మతలబులు 
నడిపిస్తుంటాడు !

అమ్మమ్మ సోఫాలో 
కూర్చుని --
తన్మయత్వంతో 
వాట్స్ ఆప్ స్క్రోల్ 
చేస్తూ ఉంటుంది ...!

మమ్మీ ఫోను ఎప్పుడూ 
మోగుతూనే ఉంటుంది ,
మమ్మీ 
మాట్లాడుతూనే ఉంటుంది !

డాడీ ఆఫీసు పనిలో 
నిమగ్నమయి --
లాప్టాపు -మొబైలు -టివి 
ఒకేసారి నడిపిస్తుంటారు !

వీళ్లంతా ఇలా ..ఇలా 
బిజిగా ఉంటూ .....
నన్ను ఆడుకోమంటారు 
ఈ పద్దతిలో ---
నేనెలా ఆడుకోవాలో ...
కాస్త .. చెప్పరూ ......!!
--------------------------
ఫొటో లో----బేబీ..ఆన్షి.నల్లి.