ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
1. గుడి- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి -కులసమాజం ముందు నిలిచి మాట్లాడుతున్నడు బుంగి.‘‘కుల బాంధవులారా! పిడికెడు మందిమి లేని మనం సంఘంగా ఏర్పడడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. గుడి కోసం స్థలం సంపాదించడం గగనమైంది. అయినా సంఘం ఆ పని సాధించింది. కాని వెంటనే నిర్వీర్యమైంది. ఇది మన పూర్వీకుల ఘనత. నగరం విస్తరించడం వల్ల నాటి మూలగొట్టు స్థలం మధ్య బిందువు అయింది. అపడే దాన్ని తన్నుకు పోవడానికి చట్టబద్ద చిల్లుల్ని వెతకడం మొదలైంది. మనవాళ్ళే ఆ పని చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా మనం ఐక్యం కావాలె. ఎన్ని అడ్డంకులొచ్చినా, సంఘ భవనం, శివుని గుడి నిర్మించాలి. ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి’’ అన్నాడు. అక్కడ మౌనం రాజ్యమేలింది.ఇరువైపులా ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ప్రత్యర్థులుపావులు కదిపారు. సంఘం ఎక్కిన మెట్టు ఎక్కకుండా తిరిగింది. దైవకార్యమని నలుగురు చురుకుగా పనిచేసారు. మంది పని నాకెందుకు అనుకోకుండా ఒకరిద్దరు పూర్తి సమయం వెచ్చించి, భూమిని కాపాడి శివుణ్ణి ప్రతిష్టించారు. ప్రత్యర్థుల ఆటకట్టయింది. గుడి నిర్మాణం పూర్తయింది. ఇది గిట్టని కులపెద్దలకు అరికాలి మంట తలెకక్కింది. సంఘం పూజారిని నియమించింది. పూజలు, భజనలు నిత్యకృత్యాలయ్యాయి. జన్మకోశివరాత్రి కాక, మాసానికో శివరాత్రి మామూలయింది. కులం మురిసింది. ఈ తంతు ఇలాగే సాగాలంటే, నాథుడొకరు కావాలనుకుంది. బుంగి నాయకుడయ్యాడు. పట్టుమని పదిమంది లేని కుల సంఘంలో మొదటి నుండీ తెరవెనుక బాగోతం నడిపిన వాడు ప్రతినాయకుడుగా తలెత్తాడు. ఏకముఖంగా సాగాల్సిన ఆధ్యాత్మిక బాట రెండుగా చీలడం ద్వైతం. ఒడలు, గుడి, యంతరాత్మయ ఒడరుండను, పలుకు లుడిగి భక్తిని గుడియే గుడియనియు లింగమూర్తియ ఒడరుండని కొలువకునికి పాతకముశివా! శివతత్త్వసారము మల్లికార్జున పండితారాధ్యుడు
August 19, 2020 • T. VEDANTA SURY • Story