ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
101. శ్రద్ధ ఆసక్తి కలబోస్తేనే మంచి విద్యార్ధి:బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 23, 2020 • T. VEDANTA SURY • Memories

ఉపాధ్యాయుడిగా పని చేసిన నాకు రకరకాలవిద్యార్థులు ఎదురయ్యారు.కొందరు విద్యార్థులు మొదట్లో చురుకుగా వుండి రాను రాను చదువులోవెనుకబడే వారు. కారణాలు కోకొల్లలు. గృహసంబంధ కారణాలు,అనారోగ్య కారణాలు, పరిసరాల ప్రభావం,ఉపాధ్యాయులు వ్యక్తిగతశ్రద్ధ చూపకపోవడం ఇలాంటి కారణాలు కనిపిస్తుండేవి.సకాలంలో కారణం తెలుసుకొనిఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా పుణ్యం కట్టుకుంటే ఇటువంటి విద్యార్థులను మొదటి దారికి తీసుకు రావచ్చు. మరి కొందరు విద్యార్థులుమొదట్లో సామాన్యంగా వుంటారు.ఆ తరువాతఎవరో ఒకరి ప్రేరణ వల్ల చదువులో ముందుకుదూసుకు వెళతారు.ఆ ప్రేరణ ఒక ఉపాధ్యాయుడి
వల్ల కావచ్చు లేదా ఒక మంచి స్నేహితుడి వల్లకావచ్చు లేదా ఒక బంధువు వల్ల కావచ్చు. ఇంకొందరు విద్యార్థులుంటారు.పూర్తిగా వెనకబడివుంటారు.5 లేదా 6 వ తరగతికి వచ్చేసరికివిచిత్రంగా వారు మారిపోతారు.చదువు మీదఆసక్తి కలిగి తెలివిగల వారితో కలసి పోతారు.నాన్ డిటంక్షన్ విధానం ఇటువంటి వారికి వరమే.మరి కొందరు సహజంగా చురుకుగా ఉంటారు. చదువు మీద శ్రద్ధ చూప‌రు.చదువంటే ఇష్టముండదు.వారి చురుకుదనం అల్లరికే పరిమితం.అటువంటి వారి మీద సరియైన శ్రధ్ధ చూపి చదువు వైపు వారి చురుకుదనం మళ్ళిస్తే వారిచరిత్రే మారిపోతోంది. తారాజువ్వలా చదువులోదూసుకుపోగలరు.ఇలా రకరకాల విద్యార్థులుంటారు.కీలెరిగి వాత పెట్టాలంటారుపెద్దలు. ఆ చాకచక్యం తెలిసిన ఉపాధ్యాయులుకొమ్ములు తిరిగిన అల్లరబ్బాయిలను లొంగదీసుకొని చదువు లో రాణింపజేయగలరు.ఒక అల్లరి అబ్బాయి కథే " శ్రద్ధ - ఆసక్తి ". ఇకఆ కథ లోకి వెళ్తే... సూర్యం అల్లరి చిల్లరిగా తిరిగేఅబ్బాయి.చదువంటే అశ్రద్ధ.ఎప్పుడూ వీధి తగవులు ఇంటి మీదకు తెచ్చేవాడు.తల్లి దండ్రులు బుద్ధిగా చదవరా అని ఎంత చెప్పినావినేవాడు కాదు.ఏడో తరగతికి వచ్చాడు.ఆ తరగతితో చాలించి కొడుకును ఏ దుకాణం లోనో పనికి  పెట్టేయాలనుకున్నారు.అంతలో ఆ ఊర్లోఒక పాఠశాలకుసత్యమూర్తి అనే మాష్టారు ప్రధానోపాధ్యాయులుగా వచ్చారు.ఆయనకుమంచి ఉపాధ్యాయుడిగా ఆ పట్టణంలో పేరు
వుంది. సూర్యం తండ్రి ఆశపడ్డాడు. కొడుకునుతీసుకువెళ్ళి సత్యమూర్తి మాష్టారుకు అప్పజెప్పాడు.సత్యమూర్తి మాష్టారు సూర్యంని
తరగతికి పంపించి ఆ తండ్రితో "అబ్బాయి చురుకుగా ఉన్నాడు. నా ప్రయత్నం నేను చేస్తాను"అన్నారు.ఒక వారం గడిచింది. సూర్యం
ప్రవర్తన సత్యమూర్తి మాష్టారు గమనించారు.ఒకరోజు పాఠం మొదలు పెట్టే ముందు "పిల్లలూ! మన పాఠశాలకు విద్యార్థి నాయకుడుండాలి.అతడు పట్టదల గలవాడై ఉండాలి. అందుకు నేనొక పరీక్ష పెడతాను.ఇంగ్లీష్ పదాలు కొత్తవి ఇరవై ఇస్తాను.రేపు తప్పు
లేకుండా ఎవరైతే ఆ పదాలన్ని చెప్పగలరో వారినివిద్యార్ధి నాయకుడిగా చేస్తాను"అని ప్రకటించారు.నల్లబల్ల మీద ఇరవై పదాలు రాశారు. పిల్లలు వాటిని రాసుకున్నారు.సూర్యం విద్యార్థి నాయకుడిగా అవ్వాలనుకున్నాడు.విద్యార్థి నాయకుడైతే అందరి విద్యార్థుల మీద అజమాయిషీ చేయవచ్చనుకున్నాడు. బడి వదిలాక సత్యమూర్తి మాష్టారు ఇంటికి వెళ్ళాడు.మాష్టారితో "మా నాన్నకు చదువు రాదు.మా అమ్మకు చదువు రాదు.ఉదయం మీరిచ్చిన పదాలు నేర్చుకుంటాను"అన్నాడు.సత్యమూర్తి మాష్టారు నవ్వుతూ"నువ్వు చురుకైన
వాడివి తెలివైన వాడివి.నీలో పట్టుదల వుంది.ఆ పట్టుదల చదువులో చూపావంటే అందరినిమించిపోతావు"అని సూర్యం ని ప్రశంసించారు.రాముని ముందు ఆంజనేయుడిలా మాష్టారిముందు కూర్చున్నాడు సూర్యం.సత్యమూర్తి మాష్టారు సూర్యానికి పదాల అర్థాలు చెప్పి నాలుగైదు సార్లు చదివించారు.సొంతంగా చదవడం నేర్చుకొని ఇంటికి వెళ్ళాడు సూర్యం. పట్టుదలతో రాత్రి చాలా సేపటి వరకు చదివాడు.తెల్లారి లేచి మళ్ళీ చదువుకు కూర్చున్నాడు. పదాలన్ని వచ్చేశాయి. ఆత్మవిశ్వాసంతో తరగతికి వెళ్ళాడు.
ఒక్క తప్పు రాకుండా ఒక్క సూర్యమే చెప్పగలిగివిద్యార్థి నాయకుడయ్యాడు.చదువు వల్ల కలిగేగౌరవం తెలిసొచ్చింది. విద్యార్థి నాయకుడయ్యాడుగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ప్రవర్తన మారిపోయింది. చదువు లోరాణించి ఆ సంవత్సరం పరీక్షలలో ప్రథముడిగారాగలిగాడు.శ్రద్ధగా చెబితే విద్యార్థులు ఆసక్తిపెంచుకుంటారని రుజువు చేశాడు సూర్యం.ఆ శ్రద్ధ ఆసక్తి ఉపాధ్యాయులకు కూడా వుంటే విద్యార్ధులుకు ఆ ఉపాధ్యాయులు దేవుళ్ళే మరి! 2002 జూలై 10వ తేదీన వార్త దినపత్రికలో వచ్చింది.(సశేషం)