ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
103. పాఠ్యగ్రంథంలో చోటు చేసుకున్న గేయం:: బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 25, 2020 • T. VEDANTA SURY • Memories

గేయవస్తువులు మన చుట్టూ ఉంటాయి.గమనించాలే కాని పిల్లల చుట్టూ తిరుగుతుంటాయి కూడా. మన పరిశీలనబట్టేబోలెడు తారసపడుతుంటాయి.వాటినందుకొనిపదాలతో దండ కూర్చితే చక్కని బాలగేయాలుతయారవుతాయి.పిల్లల ప్రపంచం మన ప్రపంచం
కావాలి.అప్పుడే బాలగేయాలు విరివిగా పుడతాయి. మన ఇళ్ళల్లో అల్లరి తమ్ముడొకడుకనిపిస్తుంటాడు.అన్నీ తనకే అంటాడు. అన్నీ తనవే అంటాడు. అవి దక్కక పోతే పేచీ పెడతాడు.రాగం తీస్తాడు.అటువంటి తమ్ముడుఒకసారి భంగపడ్డాడు.ఎలా భంగపడ్డాడో చూద్దామా మరి.ఆ గేయానికి ఆరున్నొక్కరాగంఅని పేరు పెట్టాను.//అల్లరి తమ్ముడు ఉన్నాడు/అన్నిట ముందూ ఉంటాడు/పరుగు పరుగునవస్తాడు/అన్నీ నాకే అంటాడు/పక్కకు నన్నూతోస్తాడు/ముందు తనకే ఇమ్మంటాడు/అమ్మావచ్చీ పిలిచింది/తమ్ముడు ముందూ వెళ్ళాడు/ఒంటికి మంచిది తినమంది/గుళికలు రెండూతీసింది/తనకే ఇమ్మని లాగాడు/గబగబ నమిలీమింగాడు/చేదు గుళికలని తెలిసింది/ఏడుపురాగం తీశాడు//ఈ గేయం 2002 జూన్ 23 వార్త అనుబంధం లో వచ్చింది.మరొక గేయం చూద్దాం. కోతులంటే పిల్లలకు సరదా! కొండ మీదున్న ఒకకోతిని ఒక కుర్రాడు ఏవేవో కావాలనికోరతాడు. నేను కోరినవి ఇచ్చావంటే నీకిష్టమైనవిఇస్తానంటాడు.ఆ కుర్రాడు ఏవి అడిగాడు ఏవిఇస్తానన్నాడు తెలుసుకోవాలంటే "ఇచ్చి పుచ్చుకో"గేయం చూడాలి.//కోతీ కోతీ కొండా దిగవే/కొబ్బరి
కాయలు చాలా తేవే/కాయలు తెస్తే దేవుడి కిస్తా/అరటీ పండూ నీకు తెస్తా//కోతీ కోతీ కొండా దిగవే/చెట్టూ చివరీ పండూ తేవే/పండూ తెస్తే అమ్మకుఇస్తా/సున్నీ ఉండా నీకూ తెస్తా//కోతీ కోతీ కొండాదిగవే/పట్టూ తేనే పట్టుకు రావే/పట్టూ తేనే నాకూఇస్తే/రాముడి బొమ్మా నీకూ తెస్తా//ఈ గేయం 2002 జూలై 28 న వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. బాల గేయాలు రాయడానికి మనం బాలల్లో పరకాయ ప్రవేశం చెయ్యాలి.మరొక గేయం మిఠాయి చదువు. పిల్లల్లో గడుసు పిల్లలుంటారు.వాళ్లు అనుకున్నది సాధించడానికిఏవేవో అంటారు.అటువంటి ఒక గడుసు పిల్లడువాళ్ళమ్మతో ఏమి చెప్పి ఏమి కోరాడో తెలుసుకుందామా 
!//అమ్మా అమ్మా అక్కా తోనూ/
బడికీ పోతానే/బడిలో నేనూ ఆటలు పాటలు/
నేర్చుకుంటానే/అమ్మా అమ్మా అక్కా తోనూ/
బడికీ పోతానే/బడిలో టీచరు చక్కని కథలు/
ఎన్నో చెబుతారే/అమ్మా అమ్మా అక్కా తోనూ/
బడికీ పోతానే/బడిలో పాఠాల్ చదివీ నేనూ/
టీచరునవుతానే/అమ్మా అమ్మా అక్కా తోనూ/
బడికీ పోతానే/ఇప్పుడు మాత్రం డబ్బా లోనీ/
మిఠాయి ఇవ్వావే//
ఈ గేయం 2002 సెప్టెంబర్ 22 న వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.మరొక గేయం పాఠాలు పేరుతో రాశాను.ఆ గేయం
2002 ఏప్రిల్ 21 వార్త ఆదివారం అనుబంధం లోవచ్చింది.ఈ గేయాన్నే "ఎవరు నేర్పారు?" పేరుతోమహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి మరియుపాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ వారు 2వ తరగతిబాలభారతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగాతీసుకున్నారు. ఆ గేయం://చెట్టు నున్నా రామచిలుక/మాట నేర్పిందీ/కూ...అంటూ కోయిలమ్మా/పాట నేర్పిందీ/గంతు లేసే కోతీ నాకు/ఆట నేర్పిందీ/నీటి లోని చేపా నాకు/ఈతనేర్పిందీ/చెరువు గట్టున చెవులా పిల్లి/పరుగు
నేర్పిందీ/బడి లోన టీచరమ్మా/పాఠం నేర్పిందీ//ఆ
పాఠ్యపుస్తకంలో ప్రముఖుల గేయాలతో పాటు
నా గేయముండడం చాలా ఆనందం కలిగించింది.(సశేషం)