ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
105.సరదా సరదా గేయాలు::బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 27, 2020 • T. VEDANTA SURY • Memories

హైస్కూల్ లో పనిచేసే అనుభవం ప్రారంభమయింది. తెలుగు పండిట్ అర్హతలున్నాతెలుగు పోస్ట్ లో పని చేసే అదృష్టం కలగలేదు.
సాంఘిక శాస్త్రం పాఠశాల సహాయకుడుగాపదోన్నతి వచ్చింది. మా ప్రధానోపాధ్యాయులు శ్రీబేతా రామకృష్ణారావు  గారు నాకు బాల్యమిత్రుడే. హైస్కూల్ సహాధ్యాయులం.నా తెలుగు సరదాతీర్చుకోడానికి 6వ తరగతి తెలుగు బోధించేఅవకాశం ఇమ్మనమని కోరాను.అలాగే అన్నారు.6వ తరగతి తెలుగు,7వ తరగతి ఇంగ్లీష్, 8,9,10తరగతుల సాంఘిక శాస్త్ర బోధన నాకు అప్పజెప్పారు. అన్ని తరగతులకు రోజూ వెళ్ళే అవకాశం నాకు కలిగింది.పాఠశాలలోనివిద్యార్థులంతా పరిచయమవుతారు. బాగుందనుకున్నాను.మర్నాడు ప్రార్థనా సమావేశంలో ప్రధానోపాధ్యాయులు  నన్ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా బాలసాహిత్య రచయితగా పిల్లలకు పరిచయం చేసి ఏయేతరగతులకు ఏయే విషయాలు బోధన చేయడానికి వెళ్తానో అది కూడా చెప్పారు. ప్రార్థనముగిశాక కాలనిర్ణయ పట్టిక ప్రకారం నా తరగతికివెళ్ళాను.రోజులు గడుస్తున్నాయి.ఒక సెలవు రోజు ఏవైనా పిల్లల గేయాలు రాయాలనుకున్నాను."సరదా" పేరుతో ఒక గేయం రాశాను.పార్కుకివెళ్లిన అన్నాచెల్లెళ్ళు అక్కడ ఎలా గడిపారోగేయంలో  పొందుపరిచాను.//చెల్లీ నేనూ పార్కు కివెళ్ళి/ఊయల ఊగాము/గిర గిర తిరిగే చక్రం పైన/గిర్రున తిరిగాము/ఇసుకా దిబ్బల మీదకు ఎక్కి/గంతులు వేశాము/జారుడు బల్లా పైకీ ఎక్కి/జర్రున జారాము/ఆటలు ఆడీ అలసీపోయీ/ఇంటికి వచ్చాము/అమ్మా ఇచ్చిన పాయసాన్నీ/గమ్మున తాగాము// ఈ పాట 2003 ఫిబ్రవరి 2వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.మరొకగేయం బీచ్ లో పిల్లలు ఎలా గడుపుతారో పిల్లలుచెప్పినట్టు రాశాను.ఆ గేయానికి "షికారు"అని పేరు
పెట్టాను.//అమ్మా నాన్నా అక్కా నేనూ/షికారు కెళ్ళాము/సముద్రపొడ్డున నడుస్తు మేమూ/సరదా పడ్డాము/జొన్నాపొత్తులు ఐసుక్రీములూ/
అక్కడ తిన్నాము/హోరున వీచే గాలికి మేమూ/
సంబరపడ్డాము/సముద్ర గవ్వలు నత్తగుల్లలూ/
ఎన్నో ఏరాము/కెరటాల్ ఉధృతి చూచీ మేమూ/
బెంబేలెత్తాము/అమ్మా నాన్నల అక్కున చేరీ/
ధైర్యం పొందాము//ఈ గేయం 2003 జూన్ 22నవార్త ఆదివారం లోనే వచ్చింది.అక్షర విజయంకార్యక్రమాల అనుభవంతో మరొక గేయం రాశాను.ఆ గేయం లో నిరక్షరాస్యులైన ఒక తల్లి తన బిడ్డవద్ద చదువు నేర్చుకొనే వైనం చెప్పాను.ఆ గేయానికి చదువులతల్లి అని పేరు పెట్టాను.//నుదుట మీద చిన్న బొట్టు/చక్కగున్నది/జడలోనా ముద్దబంతి/ముద్దుగున్నది/చెవుల లోన లోలక్కులు/తళుకుమన్నవి/ముక్కునున్నముక్కరేమొ/మెరయుచున్నది/దూరాన బడిగంటలు మ్రోగ గాను/తల్లి నొదిలి బుజ్జి పాప/
పరుగు తీసెను/పరుగు తీస్తు బడికి పాప/వెళ్ళ గానూ/అమ్మ మనసు ఎంత గానొ/పులకరించెను/
బడి లోన టీచరమ్మ/ చదువు చెప్పగా/శ్రద్ధ గాను
బుజ్జి పాప/నేర్వ సాగెను/బడి లోన నేర్చుకున్న/
చదువునంతా/రాత్రి వేళ పాప చెప్ప/అమ్మ నేర్చెను/అక్షరాలు కూడ బలికి/అమ్మ చదవగ/
పాప మనసు ఎంతగానో/మురిసి పోయెను//ఈ గేయం పిల్లల వరకు వెళ్తే కొందరు పిల్లలైనా చదువు రాని తమ తల్లులకు అక్షరాలు నేర్పగలరని భావించాను.ఈ గేయం 2003 జూలైతెలుగు విద్యార్థి పత్రిక లో వచ్చింది.(సశేషం)