ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
106.సాంఘిక శాస్త్ర భావనలకు గేయ రూపాలు:: బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 28, 2020 • T. VEDANTA SURY • Memories

ఆరవ తరగతి సాంఘిక శాస్త్ర బోధన చేసే సమయంలో సమైక్యత అనే భావనను చెప్పడంజరిగింది. దేశప్రజలు సమైక్యంగా వుంటేనే ప్రత్యర్థిదేశాలు మనపై దాడికి భయపడగలవని పిల్లలకు చెప్పాను.మనలో మనం కుమ్ములాడుకుంటే శత్రు దేశాలకు మన దేశం అలుసగునని చెప్పాను.సమైక్య భావన పిల్లల మనసుల్లో కలిగించడానికిదేశం మనది అనే అభిప్రాయం వారిలో మొలకెత్తించడానికి సమైక్యత పేరుతో ఒక గేయంరాశాను.ఆ గేయం చూద్దాం.//మనవే మనవే మనవేరా/హిమగిరి వరుసలు మనవేరా/మనవేమనవే మనవేరా/పునీత నదులు మనవేరా/మనవే మనవే మనవేరా/అన్ని భాషలు మనవేరా/మనవే మనవే మనవేరా/పండుగలన్నీ మనవేరా/
మతభేదాలు మనకు ఏలర?/కల్లోలాలు మనకెందుకుర?/కలిసిన మనకు ఎదురు లేదని/ఎదుట వారికి చాటి చెప్పుర!// ఈ గేయం 2003మార్చి 2 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. మరొకసారి ఒకే గేయంలో మన జాతీయగీతాల ప్రస్తావన తీసుకు రావాలని ప్రయత్నించాను.ఆ ప్రయత్న ఫలమే భారతీయతఅనే గేయం.ఈ గేయం 2003 జూన్ 1 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. మహారాష్ట్రరాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి మరియు పాఠ్యప్రణాళికపరిశోధన సంస్థ వారు 6వ తరగతి తెలుగు సరళభారతి వాచకంలో పాఠ్యాంశంగా తీసుకున్నారు.2016 నుంచి ఆ వాచకం మహారాష్ట్ర పాఠశాలల్లోతెలుగుభాషను ఐచ్ఛికంగా తీసుకున్న వారికి
అమలులో వుంది. ఆ గేయమేదో తెలుసుకుందాం.//జనగణమనయని పాడండీ/జాతి గౌరవం నిలుపండీ/సుజలాం సుఫలాం పలుకండీ/పాడిపంటలను పెంచండీ/సారే జహాసే పాడండీ/సహనశీలురుగ మారండీ/గాంధీ బోధలు చదవండీ/శాంతి మార్గమున నడవండీ/జెండా
ఊంఛా పాడండీ/జెండాకండగ ఉండండీ/వివిధభాషలు నేర్వండీ/భారతీయతను చాటండీ//నాగేయ రచనలలో ఈ గేయం చాలా సంతృప్తికలిగించింది. పుస్తక ప్రయోజనాలు పిల్లలకుచెప్పాలని "చిరంజీవి" అనే శీర్షిక తో ఒక గేయంరాశాను.ఆ గేయాన్ని కూడా చూద్దాం.  //  పుస్తకమంటే నా ప్రాణం/పుస్తకమేరా నా నేస్తం/అజ్ఞానాన్ని పారదోలునురా/ఆప్యాయతను రంగరించునురా/తెలియని తనమును తరుమునురా/తెలివితేటలను ఇచ్చునురా/చరిత్ర కథలను చెప్పునురా/గతమును కళ్ళకు కట్టునురా/కొత్తకుప్రాణం పోయునురా/పాతకు భద్రతనిచ్చునురా/పుస్తకానికి చావే లేదురా/చిరంజీవికి ఎదురే లేదురా/పుస్తకమంటే నా ప్రాణం/పుస్తకమేరానా నేస్తం//ఈ గేయం 2003 ఆగస్టు 24  వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.ఉపాధ్యాయులకు చదువు మీద శ్రద్ధచూపని పిల్లలు తారసపడుతుంటారు .అటువంటి వారికి చదువు విలువ తెలియపరచడానికి "చదువు ఘనత" అనే శీర్షికతో ఒక గేయం రాశాను.//శ్రద్ధగ పొత్తము పట్టుమురా/మొద్దునిద్దురను తరుముమురా/చదువుతు ముందుకుసాగుమురా/వెనుకకు అడుగులు వేయకురా//చదువే ధనమని చాటుమురా/చదువు ఘనతనుచెప్పుమురా/సోమరితనమును వీడుమురా/ప్రియముగ చదువును నేర్చుమురా//చదువే మనకూ దీపమురా/నాగరికతనూ ఇచ్చునురా/చదువే మన్నన నిచ్చునురా/చదువే కీర్తిని తెచ్చునురా//ఈ గేయం 2003 డిశంబరు 21 ఆదివారం అనుబంధం లో వచ్చింది. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా సరికొత్త అనుభవాలుసరికొత్త ఆలోచనలు నా బాలసాహిత్యం లోచోటుచేసుకోవడం ప్రారంభమయ్యాయి.(సశేషం)