ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
108.అలరించే శైశవ దశ::--బెలగాం భీమేశ్వరరావు 9989537835.
August 30, 2020 • T. VEDANTA SURY • Memories

నమ్మకం కథ 2003 ఆగస్టు 13 వార్తా పత్రిక లో వచ్చింది.ఒక రోజున దుగరాజుపేట స్కూలుపిల్లలు గుర్తుకొచ్చారు.వారి ఆటపాటలు గుర్తు
కొచ్చాయి.వారి సందడి కళ్ళ ముందు కదిలింది.అలాంటి పిల్లల కోసం "ముద్దు బిడ్డలు" గేయంరాశాను.ఆ గేయం చదువుతూ ఆ పదాల వెంబడిపరుగెత్తుదాం.//పిల్లల్లారా బుడుతుల్లారా/నవ్వులు రువ్వే పువ్వుల్లారా/రాగాలొలికే పిట్టల్లారా/పాటలు పాడే కూనల్లారా//ఆడుతు,
పాడుతు గడపండర్రా/బడిలో పాఠాల్ నేర్వండర్రా/ఆటల్లోనా పాటలున్నవీ/పాటల్లోనా నీతులున్నవీ//ఆటలు,పాటలు,నీతుల కథలూ/
అన్నీ నేర్చే విజ్ఞులుకండీ/భరత మాతకూ ముద్దుబిడ్డలై/కన్న వారికీ పేరును తెండీ//ఈ గేయం 2003 నవంబరు 9 వార్త ఆదివారం అనుబంధంలో వచ్చింది. మరొక గేయం గురించి చెబుతాను.ఒకసారి విశాఖపట్నం లోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు కి కుటుంబం తో వెళ్ళాను.సువిశాలమైన ప్రాంతమది.జూ అంతా నడిచిచూడాలంటే కష్టమే.జ్యూ ఒక రిజర్వు ఫారెస్టు లోఏర్పాటు చేశారు.625 ఎకరాల విస్తీర్ణమట.వందలాది జంతువులను అక్కడచేర్చారు.రకరకాల పక్షులను కూడా ప్రదర్శనకుఉంచారు.అలాగే పాములున్నూ ఉన్నాయి. ఆవింతలన్నీ చూడడానికి రోడ్డు పై వెళ్ళే రైలుబండిఎక్కాం.అక్కడక్కడా ఆ రైలుబండి ఆగుతుండేది.ఆ బండి నుంచి దిగి ఆయా ప్రాంతాలలో ఉండేవింతలను చూశాం.ఆ జూ దృశ్యాలు పిల్లలకందజెయ్యాలని ఆ రైలుబండి ప్రయాణం అనుభూతి ని పిల్లల వరకు తీసుకు వెళ్ళాలని "జూలో సందడి" పేరుతో గేయం రాశాను.//చుక్ చుక్ బండీ జూ లో బండి/చరచర బిరబిర సాగే బండి/
రంగుల పెట్టెల చలాకి బండి/కిలకిల నవ్వులపిల్లల బండి//రైలుబండి లా వెళ్ళే బండి/జూ లోపలనే తిరిగే బండి/అక్కడక్కడా ఆగే బండి/వింతలు మనకూ చూపే బండి//బెంగాల్ పులులుకొదమ సింహములు/గున్న ఏనుగులు,   నీటి గుర్రములు చింపాంజీలు ,ఎలుగుబంటులును/జంతు ప్రపంచం చూపే బండి//నెమలి గుంపులు,రంగుల చిలుకలు/మైనా జంటలు, గోర పిట్టలు/గూడ బాతులు, నిప్పు కోళ్లనూ/పక్షుల జగతినిచూపే బండి//కొండ చిలువలు,గోధుమ నాగులు/కట్ల పాములు,పసిరిక పాములు/ఉల్లి పాములు,మల్లె నాగులను/నాగుల లోకం చూపేబండి//హద్దుల లోన ముద్దుగ తిరిగే/వన్యప్రాణులను చూడగ రండి/జూ చూపుటకు తిప్పే బండీ/
బండీ ఎక్కగ త్వరగా రండి//ఈ గేయం 2003సెప్టెంబరు ఆటవిడుపు పత్రికలో వచ్చింది.పిల్లలుసబ్బునీటిని ఊదగా వచ్చే బుంగలను చూసి చాలాసరదా పడడం మనకు అనుభవైకవేద్యమే.ఆ సబ్బు నీటి బుంగల పై ఒక గేయం రాశాను.ఆ గేయానికి నీటి బంతులు అని పేరు పెట్టాను.ఆ గేయం చూడండి.//బుడగలండి బుడగలు/బలే బలే బుడగలు/గాలి లోన తేలియాడు /బంతిలాంటి బుడగలు//విరజిమ్ముతు వెలుగులోన/కనిపించే బుడగలు/మూకుమ్మడి బంతులుగ/జారిపోవు బుడగలు//ఇంద్ర ధనుసు రంగుల్లో/మెరిసి పడే బుడగలు/ఉఫ్ అంటే టప్ అనీ/పేలి పోవు బుడగలు/క్షణకాలం ఉండినను/మురిపించే బుడగలు/బుడగలండి బుడగలు/సబ్బునీటి బుడగలు//ఈ పాట 2003 సెప్టెంబర్ 23 న వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.శైశవ దశలో ఉన్న పిల్లలను చూచి తల్లి పొందే
ఆనందం అంతా ఇంతా కాదు.ఒక తల్లి తన పాపాయిని ఎలా వర్ణిస్తుందో చెప్పే గేయమే"మంగళ ధ్వనులు".//పాపాయి నేత్రాలు/కృష్ణ
మీనాలే/తెరచి చూశాయంటే/వెన్నెల్ల వెలుగులు//పాపాయి ముంగురులు/తుమ్మెదల రెక్కలు/ఎగురుతుంటే అవీ/కారు మేఘాలే//పాపాయి
పిడికిళ్ళు/లేలేత మొగ్గలు/విచ్చుకుంటే అవీ/మంకెన పువ్వులే//అందాల మా పాప/రాగముతీస్తేను/ఏడేడు వీధులకు/మంగళ స్వరాలు//
తల్లికి పాపాయిని ఎంత వర్ణించినా తనివి తీరదు.ఆఖరకు ఏడుపులో కూడా మంగళ స్వరాలేవినిపిస్తాయి.(సశేషం)