ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
109.అతని ఆలోచనలు మనకు ఆదర్శాలు:; బెలగాం భీమేశ్వరరావు, 9989537835.
August 31, 2020 • T. VEDANTA SURY • Memories

  గాంధీ గారి గురించి గేయం రాయాలనుకున్నాను.ఆయన జయంతి రాబోతుంది. అందుకు గాంధీ జయంతి పేరుతో ఒక గేయం రాశాను.గేయంలోపిల్లలను గాంధీ జయంతి రోజున గాంధీ విగ్రహానికిపూలదండలు వేసి ఆయన ఆశీస్సులు పొందండనికోరాను.ఆ గేయం://చిన్నారి బాలలూ/చిరు మల్లెపూవులూ/తెల తెల్ల వారింది/తొందరగ లేవండి//వేవేగ రారండి/స్నానాలు చేయండి/తోటలో పూవులను/దండలుగ కూర్చండి//సత్యాగ్రహప్రదాత/మన గాంధి తాత/అవతరించిన రోజు/అక్టోబరూ రెండు//శాంతి సమరం చేసి/స్వరాజ్యంబును తెచ్చి/మన భారతీయులకు/స్మరణీయుడయ్యాడు//మత సామరస్యమే/మనకు సమ్మతమనుచు/జాతి శ్రేయస్సుకూ/
నీతి బోధించాడు//అతని ఆలోచనలు/మనకుఆదర్శాలు/ఆ అడుగు జాడలే/మన శాంతి మార్గాలు//కూర్చినా దండలను/దండిగా వేయండి/అతని ఆశీస్సులను/మెండుగా పొందండి//ఈ గేయం 2003 అక్టోబర్ తెలుగువిద్యార్ధిలో వచ్చింది.పిల్లలను చూస్తే దూడలకు
దూడలను చూస్తే పిల్లలకు ఎక్కడ లేని హుషారువస్తోంది. మనకది అనుభవైకవేద్యమే. వీధి లోనిఒక పిల్లడు చేసే అల్లరి గుర్తుకు వచ్చి అల్లరి పేరుతో గేయం రాసి ఆటవిడుపు పత్రికకు పంపేను.ఆ గేయం://కొట్టాంలో ఆవు చెంత/ కోడెదూడ/కడుపు నిండ పాలు తాగి/ గెంతుచుండె/కోడె దూడ మెడ లోన/ మువ్వలన్ని/చెంగు మనుచు దూడ గెంత/ఘల్లుమనెను/సరదాగా గంతులేయు/ఆ దూడను/పిల్ల లెల్ల వెంట పడుతు/పరుగు తీసె/ఆకతాయి బాలుడొకడు/తోక లాగగ/ఫఢీలుమని కాలు తోడ/దూడ తన్నె/నేల పడ్డ ఆకతాయి/ఏడ్వగాను/పిల్లలేమొ ఘొల్లుమనీ/గేలి చేసె//ఆకతాయి బాలునకు/బుద్ధి వచ్చె/దూడ తోక లాగుటను/ మాని వేసె//ఈ గేయం 2003 ఫిబ్రవరి ఆటవిడుపు పత్రికలోవచ్చింది.ఆ యేడు మార్చి నెల నుంచే ఎండలుఆరంభమయ్యాయి.ఎండాకాలం వర్ణిస్తూ మండేకాలం అని పేరు పెట్టి ఒక గేయం రాశాను./ఎండాకాలం ఎండాకాలం/ఎండలు మెండుగ కాసే కాలం/నీటికి కటకట చెందే కాలం/నిప్పులు
చెరిగే ఎండాకాలం/ఊపిరి సల్పని ఎండాకాలం/తీక్షణమైనా ఎండాకాలం/గాలులు తరచుగ వీచేకాలం/అగ్ని ప్రమాదం జరిగే కాలం/జలనిధి నీరుఆవిరులగుటకు/హేతువు అయ్యెడి ఎండాకాలం/ఆవిరులన్నీ ఫై పై కెగసీ/నల్లని మబ్బులు అయ్యేకాలం/వర్షాకాలం ఆగమనానికి/మూలకారణం మండే కాలం//....వానలు పడడానికి శాస్త్రీయ కారణం చెప్పడానికి ప్రయత్నించాను. ఈ గేయం
2003 ఏప్రిల్ 6 వార్త ఆదివారం అనుబంధం లోవచ్చింది.(సశేషం)