ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
111.దయ్యాలు పని పట్టారు:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 2, 2020 • T. VEDANTA SURY • Memories

పార్వతీపురానికి దగ్గర లోనే వల్లరి గొడబ అనే ఊరుంది.ఆ ఊరికి ఒక చెరువుంది.ఆ చెరువు చేపలకు ప్రసిద్ధిగా ఉండేది.ఊరి వారు ఎవరైనాచేపలు పట్టుకోవచ్చు.పసందుగ తినొచ్చు. ఆ చెరువు లోని చేపలపై అందరికీ హక్కు వుండేదట.అలా సాగుతున్న సమయంలో కొరివి దయ్యాలబెడద వచ్చి పడింది. చెరువులోని చేపలనుఆ దయ్యాలు తినడం వల్లనే అందులో చేపలు తగ్గాయని పుకారు వ్యాపించింది. ఆ పుకారునిజమే అని నమ్మారు ఊరి వారు.చివరకు రాత్రి సమయంలో చెరువు వైపు చూడడానికి భయపడే
పరిస్థితి వచ్చింది.ఆ పరిస్థితి ఎన్నాళ్ళు సాగలేదు.ఆ విషయం విన్నాక నాకు కథ రాయాలనిపించింది.ఆ కథే కొరివి దయ్యాలు.కథ
లోకి వెళ్తే...వల్లరి గొడబ అనే ఊరుంది. ఊరికిదూరంగా పెద్ద చెరువుంది.ఆ చెరువు రకరకాలచేపలకు ప్రసిద్ధిగా వుండేది.అంత పేరు పడినచెరువుకు  దయ్యాలు ఆ చెరువుగట్టు మీద తిరుగుతున్నాయని ఒక పుకారు వ్యాపించింది. ఒకసారి ఆ కొరివి దయ్యాలు చూడడానికి వెళ్ళే మనిషి ఒళ్ళంతా కాలిన గాయాలతో వచ్చాడట! ఇంకొకడు గుండె ఆగి ఆ గట్టు మీదేచనిపోయాడు!అప్పటి నుంచి ఆ గ్రామస్తులు రాత్రి పూట చెరువు వైపు చూడడంమానుకున్నారు.చెరువులో చేపలు తగ్గడానికిఆ కొరివి దయ్యాలే కారణమని నమ్మారు.ఒక రోజు
ఆ ఊరి పెద్ద ఇంటికి ఒక చుట్టం వచ్చాడు.చదువుకున్న యువకుడతడు.కొరివి దయ్యాల సంగతి\విని అదంతా అబద్ధమని కొట్టి పారేశాడు.ఇరుగుపొరుగు వారు ఈ మధ్యనే చూశాం బాబూ అనిచెప్పారు. ఆ యువకుడు "చెరువులో చేపలుతస్కరించడానికి ఎవరో ఆడుతున్న నాటకమది.మీలో కొందరు నాకు సహకరిస్తే కొరివి దయ్యాలుకావని నిరూపిస్తాను"అని అన్నాడు. యువకులుకొందరుముందు కొచ్చారు.అర్థరాత్రి అయింది.ఊరిపెద్ద ఇంటికి వచ్చిన ఆ చుట్టం యువకులతోచెరువుకు బయలుదేరాడు.తుప్పల చాటున చేరి
గమనించసాగారు.అంతలో ఒక దీపం గాలిలోకదలుతూ రాసాగింది.ఆ వెనుక మరికొన్ని దీపాలువస్తున్నాయి. ఎవరూ మాట్లాడ వద్దని చుట్టంయువకులకు చెప్పాడు.అందరూ నిశ్శబ్దం గాచూస్తున్నారు. దీపాలు దగ్గరయ్యాయి.ఆ దీపాలవెలుగులో ముఖం మీద మసి పూసిన ఆకారాలుకనిపించాయి. నడుముకు కట్టిన పొడుగాటికర్రల చివర కాగడాలున్నాయి.చేతిలో వల, నడుముకు చేపలు వేసే బుట్ట ఉన్నాయి. చెరువులో దిగి ఆ ఆకారాలు చేపలు పట్టడంప్రారంభించాయి.చుట్టం యువకులకు సైగ చేశాడు.ఒకేసారి యువకులు బాణాకర్రలతోఆ ఆకారాలపై దాడి చేశారు. ఆ ఆకారాలుఎదురు దాడి చేశాయి.వల్లరిగొడబ యువకులేగెలిచారు.ఆ ఆకారాలను ఊళ్ళోకి ఈడ్చుకువచ్చారు.ఊరి జనాన్ని లేపి చూపించారు.కాగడాలు వెలుగులో ఆకారాలు చూశారు.ఇన్నాళ్లు కొరివి దయ్యాలుగా భయపెట్టిన వాళ్ళు పక్క ఊరి మనుషులే.ఊరి వాళ్లు దేహశుద్ది చేసిబుద్ధి చెప్పి వాళ్ళను వదిలేశారు. కొరివి దయ్యాలురహస్యం బయటపడినందుకు ఊరి జనం సంతోషించారు.ఊరి పెద్ద ఇంటికి వచ్చిన చుట్టాన్ని మెచ్చుకున్నారు.చెరువులో చేపలు ఆ ఊళ్ళోవారికి మళ్ళీ హక్కు అయ్యాయి.ఈ కథ పిల్ల‌ల్లోహేతువాద దృక్పథం కలిగించడానికి ఉపయోగపడుతుంది.2004 సెప్టెంబరు 15 వార్త దినపత్రికలో వచ్చింది.(సశేషం)