ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
112.రకరకాల భావాలు పిల్లలకందివ్వాలి:--బెలగాం భీమేశ్వరరావు 9989537835
September 3, 2020 • T. VEDANTA SURY • Memories

సాంఘిక శాస్త్ర బోధన సమయంలో ఉపాధ్యాయుడు మానవ సమాజం గురించి ఆలోచించక తప్పదు.దేశభక్తి ,సామాజిక సేవ, సౌభ్రాతృత్వం,వసుధైక కుటుంబం మొదలైనభావనలు పిల్లలకందించడానికి ప్రయత్నించాలి.విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగాఎదగడానికి సహాయపడే అవకాశం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకే ఎక్కువగా వుంటుంది.ఒకసారి విశ్వశాంతి గురించి విద్యార్థులకుచెప్పవలసిన సందర్భం వచ్చింది. ఆ సందర్భం
లో పుట్టిన గేయమే "సమభావం".//ఒకటే ఒకటే
ఒకటేరా/దాహం ఆత్రుత ఒకటేరా/ఒకటే ఒకటే
ఒకటేరా/ఆకలి మంటా ఒకటేరా/ఒకటే ఒకటే
ఒకటేరా/రక్తం రంగూ ఒకటేరా/ఒకటే ఒకటే ఒకటేరా/ప్రాణ భీతియూ ఒకటేరా/భేదాలెందుకు
మనలోన/మానవులందరు ఒకటేరా/చెట్టా పట్టా
లేసుకొనీ/హాయిగ మనమూ బతకాలి/ఐకమత్యముగ మెలగాలీ/భువిలో స్వర్గం చూడాలి//ఒకే రకమైన భౌతిక అవసరాలు,మనోభావాలు కలిగిన మానవజాతిభేదభావాలతో కోరి సమస్యలు తెచ్చుకోవడం
ఆశ్చర్యకరమైన విషయం. పిల్లల్లో మానవులందరూ ఒకటే అన్న వసుదైక కుటుంబ భావం కలిగించడానికి ఈ గేయంలో
ప్రయత్నించాను.ఈ గేయం 2004 ఫిబ్రవరి 1 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.పూర్వం పిల్లలు లక్కపిడతలతో ఆడుకోవడం మనకందరికీవిదితమే.టీవీల ముందు కూర్చోపెట్టడం సెల్ ఫోన్  చేతికందించడం ఇలాంటివి చేయడం కంటే పిల్లల ముందు ఆటవస్తువులు లక్కపిడతలు పెట్టిచూడండి పిల్లలెంత సరదా పడతారో.ఆటవస్తువులతో ఆడుకుంటారు.లక్కపిడతలతో వంట చేసినట్టు నటించి ఆనందిస్తారు.కుటుంబ సభ్యుల పాత్రలలో ప్రవేశిస్తారు.ఇన్నిమాటలెందుకు అసలు సిసలు బాలల లోకంలోవిహరిస్తారు.ఆ అవకాశం పిల్లలకివ్వాలి.మానసికఆనందం వారికి పంచేవారమౌతాం.ఇవన్నీ దృష్టిలోపెట్టుకొని "విందు - పసందు" గేయం రాశాను.
చిన్న పిల్లలున్న ఒక ఇంట్లో ఏం జరిగిందో
చూడండి.//చంటీ చిట్టీ వచ్చారు/లక్కాపిడతలు
తెచ్చారు/అమ్మా దగ్గర కెళ్ళాము/పప్పూ బెల్లం
తెచ్చాము/అత్తా దగ్గర కెళ్ళాము/అరటి అత్తమూ
తెచ్చాము/కుండా పొయ్యీ పెట్టాము/గారెలు
బూరెలు వండాము/అరిసెల పాకం తీశాము/
అప్పాలెన్నో వండాము/పళ్ళేలన్నీ పెట్టాము/
వండినవన్నీ వేశాము/ఇంట్లో వారిని పిలిచాము/
కొసరి కొసరి వడ్డించాము/అంతా పకపక నవ్వారు/ఎంతో సరదా పడ్డాము//ఈ గేయం
2004 డిశంబరు ఆటవిడుపు పత్రికలో వచ్చింది.తువ్వాయిని చూసి పిల్లలు సరదా పడతారు.పిల్లలను చూసి తువ్వాయి సరదా పడుతుంది.ఒక తువ్వాయితో పిల్లలు జట్టు కట్టి ఏమంటున్నారో "పోటీ" గేయం లో చూడండి.
//బుజ్జీ బుజ్జీ తువ్వాయి/పాలా పొదుగు నీకోయి/
పొట్టా నిండా తాగోయి/చెంగు చెంగున గెంతోయి//
అమ్మా ఏమీ అనదోయి/మాతో నీవూ రావోయి/
నీకూ మాకూ జట్టోయి/చల్ చల్ పరుగులు పెట్టోయి//అరుపులు కేకలు మావోయి/పరుగుల
పందెం చాలోయి/నీతో పోటీ బాబోయి/నీవే ఫస్టు
లేవోయి// ఈ గేయం 2004 డిశంబరు 12 వార్తఆదివారం అనుబంధం లో వచ్చింది.(సశేషం)