ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
113.సానపెడితేనే వజ్రాలకు ధగధగలు:: బెలగాం భీమేశ్వరరావు 9989537835.
September 4, 2020 • T. VEDANTA SURY • Memories

పూర్వం పాఠశాలల్లో ఉపాధ్యాయులు చీవాట్లుపెట్టినా బెత్తాం తో కొట్టినా పిల్లలు ఇంటి వరకుమోసుకు వెళ్ళేవారు కారు.ఒక వేళ అలా చేశారాతల్లిదండ్రుల చే చీవాట్లు తినవలసిందే.గురువుగారు కారణం లేకుండా కొట్టరు తిట్టరు అని తిరిగిపిల్లలను మందలించేవారు.పరిస్థితులిపుడుమారి పోయాయి. విద్యార్థులు మాట కాయరు.తల్లిదండ్రులు అంగీకరించరు.అందరికీ చదువుండాలని అందరూ విజ్ఞానవంతులవ్వాలనీఆలోచించే సమాజం ఉపాధ్యాయుడికి మందలించే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే ఎలా?
ఈ సమస్యనే తీసుకొని "విద్య"అనే కథ రాశాను.కథ లోకి వెళ్దాం! విజయనగరం సంస్థానంలోబోయపేట అనే ఒక పల్లె వుండేది.అక్కడ పిల్లలుబడికి వెళ్ళేవారు కాదు.తల్లిదండ్రులకు కూడాపిల్లలను బడికి పంపాలన్న ఆలోచన ఉండేది కాదు.రాజుగారికి సంస్థానంలో ఉన్న పల్లెలన్నింటావిద్యావ్యాప్తి జరగాలని కోరిక కలిగింది. బోయపేటతో పాటు నిరక్షరాస్యత అధికంగా ఉన్న పల్లెలకుఅనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎంపికచేసి పంపేరు.బోయపేటకు విద్యానిధి అనేఉపాధ్యాయుడు వచ్చాడు.వెళ్లిన కొద్ది రోజులకే
అక్కడ ప్రజలకు పిల్లలను చదివించాలన్న శ్రద్ధ లేనట్టు గ్రహించాడు. పిల్లలు పశులకాపర్లుగాపాలేర్లుగా ఉంటున్నారు. విద్యానిధి పిల్లలనుబడికి పంపండని తల్లిదండ్రులకు నచ్చజెప్పి చూశాడు. ఎవరూ అతని మాట పట్టించుకోలేదు.చివరకు రాజుగారి సహాయం కోరాడు. పిల్లలకుచదువుతప్పనిసరి అని రాజుగారు శాసనం చేశారు. రాజాజ్ఞ కదా.బోయపేట లోని ప్రజలుపిల్లలను బడికి పంపడం ఆరంభించారు. బలిమినయినా పిల్లలకు చదువు చెప్పడానికినిర్ణయించుకున్నాడు విద్యానిధి. విద్యానిధి తీరుపిల్లలకు వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. తల్లిదండ్రులు రాజగారి వద్దకు వెళ్ళి "మా పిల్లల పైమీరు పంపిన గురువు అదుపు ఎక్కువయింది.
పొద్దస్తమానం బడేనట.ఇతర పనిపాట్లు చేయడానికి వీలు లేదట.తన మాట వినకపోతేతీవ్రంగా పిల్లలను మందలిస్తున్నాడు.ఒకొక్కసారి
చేయి చేసుకోడానికి కూడా వెనుకాడకుంటున్నాడు"అని ఉన్నవీ లేనివీ కలిపిచెప్పారు. ప్రజల ఫిర్యాదు విన్న రాజుగారువిద్యానిధి నిజాయితీ తెలిసినప్పటికీ స్వయంగావిచారణ చేయడానికి బోయపేట వచ్చారు. పాఠశాల ఆవరణలో గ్రామసభ జరిపించారు.ప్రజలకు ఫిర్యాదు వినిపించమన్నారు.ప్రజలు ఫిర్యాదు వినిపించారు.ఫిర్యాదు విన్న విద్యానిధి దిగ్భ్రాంతి చెందాడు.రాజుగారు ప్రజలకు సమాధానమివ్వమని విద్యానిధిని కోరారు.అప్పుడు విద్యానిధి ప్రజలనుద్దేశించి"పిల్లల బాగు కోసం నేను చేసిన
పనులు మీకు నచ్చలేదు. విద్యార్థులలో నిర్లిప్తత,అశ్రద్ధ తగవు.మనకు ప్రకృతి నుంచి అనేక పదార్థాలు దొరుకుతున్నాయి. ధాన్యం, పప్పులు,కాయగూరలు పండించుకుంటున్నాం.వాటినివండుకొని తింటున్నాం కాని నేరుగా తినం కదా.రాగి,ఇనుము, బంగారం లాంటి ముడి ఖనిజాలుశుద్ధి చేసి మనకవసరమయ్యే వస్తువులు గామార్చుకుంటున్నాం.గనుల నుంచి తీసిన వజ్రాలురత్నాలను సానపెట్టి మెరుగు పరచుకుంటున్నాం.పై వాటిని ఎలా సంస్కరించి మనం ఉపయోగించుకుంటున్నామో పిల్లలను కూడా మనం బాగు
చేసుకోవాలి.అప్పుడే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. అలా చెయ్యకపోవడం వల్లనేకొందరు పిల్లలు దొంగలు, రౌడీలు,తాగుబోతులుగా
మారుతున్నారు.మీకిది తెలియదా?ఆలోచించండి.నిర్బంధ విద్య అవసరమని రాజుగారు గుర్తించారు.ఆయన ఆశయసిద్ధికి మనం కృషి
చేయాలి.విద్య వల్ల మానవుల తెలివితేటలుపెరుగుతాయి. సమాజంలో గౌరవంగా బతికేవిధానం తెలుస్తుంది. ప్రజ్ఞావంతుల విజ్ఞానం
ప్రజలకుపయోగపడుతుంది.అటువంటి గొప్పవిలువ గల విద్య అబ్బాలంటే పిల్లల్లో పట్టుదలజిజ్ఞాస ఉండాలి. ఆ గుణాలు పిల్లల్లో కలిగించడానికి అపుడపుడు మందలింపు తప్పదని నా విశ్వాసం"అని ముగించాడు.సభ నిశ్శబ్దం అయింది. ప్రజలు తమ ఫిర్యాదు
వెనక్కి తీసుకున్నారు.విద్యానిధిని క్షమాపణకోరారు. రాజుగారు ఆనందించారు.ఇదీ కథ.విద్యానిధి రెట్టింపు ఉత్సాహం తో పని చేశాడు.
ఈ కథ 2004 డిశంబరు 23 వార్తలో వచ్చింది.(సశేషం)