ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
114.ఆంధ్రజ్యోతి - ఎమెస్కో వారి బహుమతి(మొదటి భాగం):: బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 5, 2020 • T. VEDANTA SURY • Memories

ఒకరోజు మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీ అనంతపంతులు సామవేది గారు మా ఇంటికి వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రిక అందించి ఉపాధ్యాయులకు పోటీ పెట్టారు చూడండి అని అన్నారు. పోటీప్రకటన చూశాను. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం "బడి నేర్పిన పాఠాలు" అనేపోటీని ఆంధ్ర జ్యోతి - ఎమెస్కో వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.ఉపాధ్యాయుడిగాబడిలో పొందే అనుభవాలను పంపించమన్నారు.ఆ ప్రకటన చూసి నేను ఆలోచనలో పడగా సామవేది గారు నాతో " ముప్పై సంవత్సరాలుగా
ఉపాధ్యాయులుగా ఉంటున్నారు.మీ మనసునుకదిలించే అనుభవాలుంటాయి.గుర్తు తెచ్చుకొనిరాయండి. బహుమతి తప్పదు"అని ప్రోత్సహించివెళ్ళారు.నా మనసులో రెండు సంఘటనలుమెదిలాయి.ఆ రోజు రెండు సంఘటనలనుకాగితం మీద పెట్టాను.మరో రోజు పోటీ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించి ఆ నిబంధనలకు తగినట్టు బడి అనుభవాలను రచనలుగా మార్చాను.ఒక దానికి ఒట్టు మరోదానికి పనసపిందెలు అని పేర్లు పెట్టిపోటీకి పంపించాను.2004 నవంబరు రెండోవారంలో పోటీ ఫలితాలు తెలిశాయి. మంచివారి
మాట పొల్లు కాదు అన్నట్టుగా మిత్రులు సామవేదిగారి మాట నిజమయింది. నేను పంపిన ఒట్టురచన రాష్ట్ర స్థాయి బహుమతిని నాకు తెచ్చిపెట్టింది. ఉపాధ్యాయుడిగా నాకది ఎంతఆనందం?! మరొక గమ్మత్తు... ఒట్టు అనుభవంబాలసాహిత్యం వైపు నన్ను నడిపించిన దుగరాజుపేట పాఠశాల లోనే పొందాను.ఆ అనుభవ రచన సంక్షిప్తంగా.... పాతిక సంవత్సరాలు కిందటి మాట! ఒక ప్రైవేటు
భవనంలో ఆ స్కూల్ నడపబడుతుండేది.నేనుఒకటవ తరగతి పూర్తి గాను 4వ తరగతి తెలుగుఆ యేడాది బోధిస్తున్నాను.విద్యార్థులు ఆటల్లోపోటీ పడినట్లుగానే చదువులో కూడా పోటీపడాలనే భావిస్తాను.నాకు మంచి దస్తూరీపైబలమైన అభిప్రాయముంది.మంచి దస్తూరీ వచ్చిన పిల్లలు చదువుపై ఆసక్తి చూపుతారు.క్రమశిక్షణ లక్యసాధన వారిలోఎక్కువగా ఉంటుంది.ఓర్పు ఆత్మవిశ్వాసం
వారు కలిగి వుంటారు.తమ దస్తూరీని చూసిమానసిక ఆనందం పొందుతారు.అందుకే పిల్లలదస్తూరీ బాగుండాలని ఆకాంక్షిస్తాను.మనం వ్రాసేది ఇతరులకు చక్కగా కనిపించాలి.అర్థమవ్వాలి.విద్యార్థులలో ఆ లక్ష్యం సాధించడానికి వరవడిపుస్తకాలు వ్రాయించు తాను.స్వయంగా నేనేనమూనా వ్రాత వ్రాసి హోమ్ వర్క్ ఇస్తాను.వరవడిపుస్తకాలను మర్నాడు చూసినప్పుడు ఒక్కొక్కవిద్యార్థిని పిలిచి ఇంకా బాగా వ్రాయడానికి సూచనలిస్తాను.అప్పటి నాలుగవ తరగతి తెలుగువాచకం లో సారాయి వ్యసన ప్రభావం మీదఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో సారాయి వ్యసనానికి బానిసైన ఒక వ్యక్తి మరణావస్థలోఉన్న తల్లి మందుల కోసం ఉంచిన డబ్బుతో
సారాయి త్రాగి మత్తులో ఎక్కడో పడిమందులందించలేక తల్లి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. నా విద్యార్థులలో ఎక్కువ మంది సారామహమ్మారి వల్ల నష్టపోయే కుటుంబాల నుంచి వచ్చిన వారే.పాఠం చెప్పడమయ్యాక పిల్లలచే దురలవాట్లకుఏనాడూ లోనుకామని ప్రతిజ్ఞ చేయించాను.ప్రతిజ్ఞచేయడమంటే ఒట్టు వెయ్యడమే అని చెప్పాను.ఒక వారం గడిచింది.  నేను వేయించినఒట్టు ఒక విద్యార్థి మీద ప్రభావం చూపడం నాకెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఉపాధ్యాయవృత్తి గొప్పతనం తెలిసొచ్చింది.(సశేషం)