ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
116.గవర్నర్ గారిచే పుస్తకావిష్కరణ::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 7, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్య పరిషత్, హైదరాబాద్ వారు 2004లో ఒక బాలసాహిత్య ప్రాజెక్టు చేపట్టారు.100 సచిత్ర బాలల పుస్తకాలు తీసుకు రావాలనుకున్నారు.బాలసాహిత్య రచయితలనుంచి రచనలను కోరారు. రచయితలు పంపినకథల్లో వంద ఎంపిక చేసి విజయవాణి ప్రింటర్స్,చౌడేపల్లి వారి ద్వారా ప్రచురించారు.ఆ పుస్తకాలకు ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీ చంద్ర గారువర్ణ చిత్రాలు వేశారు. ప్రఖ్యాత సాహితీవేత్తశ్రీ నాయని కృష్ణమూర్తి గారు సంపాదకత్వంవహించారు.ఆ వంద పుస్తకాలలో అవసరాలు,మంచికి మంచి, కొంగల తెలివి,ఎగురలేని పక్షులుఅనే  4పుస్తకాలు నావి వచ్చాయి. 2004 మార్చి నెల 15 న పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సుశీల్ కుమార్షిండే గారు ముఖ్య అతిథిగా వచ్చి పుస్తకావిష్కరణ చేశారు.ఆ రోజు వంద పుస్తకాలరచయితలతో గవర్నర్ గారు ఫోటో దిగారు.
కార్యక్రమంలో డా. రావూరి భరద్వాజ గారు,డా.రావెళ్ళ కృష్ణారావు గారు,శ్రీ రెడ్డి రాఘవయ్యగారలు పాల్గొన్నారు.117.పండుగల గేయాలు:
వినాయక చవితి, దీపావళి పండుగలంటే పిల్లల కు చాలా ఇష్టం. ఆ పండుగల సందడంతా వాళ్ళదే.పిల్లలు ఇష్టపడే ఆ పండగల మీద 
గేయాలు రాశాను.వినాయక చవితి సందర్భంగాఓ గౌరీ పుత్రా , బాలగణపతి గేయాలు రాశాను.మొదటి గేయం//తొలి పూజ కర్హుడవు/   ఓ గౌరీపుత్రా//మా మదిన నీవుండి/మము బ్రోవుమయ్యా//విఘ్నాల కధిపతివి/ఓ గణ నాయకా/కరుణించి మమ్ములను/ కాపాడుమయ్యా//ఉండ్రాళ్ళు ప్రియుడవూ/లంబోదరాయా/ఆరోగ్య నిధి నిచ్చి/మము కావుమయ్యా//కుడుములా ప్రియుడవూ/లంబ జఠరాయా/ఇడుములను పోగొట్టి/రక్షించుమయ్యా//మూషిక వాహనుడవు/ఓ ఏకదంతా/విఘ్నములు రాకుండ/మము నడుపుమయ్యా//ఈ గేయం 2004 సెప్టెంబర్ నెలఆటవిడుపు పత్రికలో వచ్చింది. బాలగణపతి పైరాసిన మరో గేయం://బాలగణపతికి చందాలంటూ/బాలల సందడి పెరిగింది//వీధుల
వెంబడి తిరిగీ వచ్చీ/చందాలెన్నో దండారు//వేదికనెంతో ముస్తాబు చేసి/బాలగణపతిని కొలిచారు//నవరాత్రులలో పూజలు చేసి/విద్యాబుద్ధులు కోరారు//పాలభోగాన్ని చక్కగ పెట్టీ/ప్రసాదాలనూపంచారు//మతాబులెన్నో వెలిగించీ మరి/ఆనందంతో గడిపారు//బాలగణపతికి జై జై అంటూ/నిమజ్జనాన్నీ చేశారు//ఈ గేయం 2004సెప్టెంబరు 12 వార్త ఆదివారం అనుబంధం లోవచ్చింది. అంతలో దీపావళి వస్తోంది. ఆ దీపావళిపండుగ మీద ఒక గేయం రాశాను.ఆ గేయానికికృష్ణసత్య అని పేరు పెట్టాను.//వరుసగ పెట్టేదీపాలెన్నో/చిమ్మ చీకటిని తరిమేశాయి//రంగురంగులా అగ్గి పుల్లలూ/వింత కాంతులను వెదజల్లాయి//వెన్నముద్దలు మతాబులెన్నో/
వెలుగు పువ్వులను విరజిమ్మాయి//నిప్పంటించి న చిచ్చుబుడ్డీలు/ముత్యాల వానను కురిపించాయి//కాకర పువ్వొత్తి కాల్చి చూడగా/
తారకలెన్నో దిగి వచ్చాయి//వీధి వీధిన మిలమిలలెన్నో/కనుల విందులు చేశాయండీ//నరకాసురునిసంహరించిన/కృష్ణసత్యలకు జేజేలండీ//ఈ గేయం 2004 నవంబర్ 7 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.(సశేషం)