ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
118.కక్కిన కూడు తింటారా :--బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 8, 2020 • T. VEDANTA SURY • Memories

కొందరు విద్యార్థులు పాఠాలు వినరు. చదువు మీద శ్రద్ధ చూపరు. పరీక్షల సమయంలో నానాహంగామా పడతారు.పాఠాలు వింటే కదా చదివినది తలకెక్కుతుంది.అపుడెంత చదివినాఅవగాహన కాదు.పరీక్షల్లో సొంతంగా ఏమిరాయలేరు.పక్క నున్న వారి మీద ఆధార పడతారు.చిన్న తరగతులు గట్టెక్కినా పెద్ద తరగతులకు వచ్చే సరికి చతికల పడతారు.ఇలాంటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తారస
పడుతుంటారు.నిజాయితీ గల ఉపాధ్యాయులుఆ విద్యార్థులలో వుండే దురలవాటును మాన్పడానికి ప్రయత్నిస్తారు.అటువంటి ఉపాధ్యాయుడి కథే హితవు.ఇక కథ లోకి వెళ్తే...జగదీష్ ఆకతాయి.ఏడో తరగతి. పాఠాలు వినడు.ఇంటి వద్ద చూడడు.ఇంట్లో పోరు పడలేక పాఠశాలకు వస్తాడు.తోటి పిల్లలతో కయ్యానికికాలు దువ్వుతాడు.అవసరమనిపిస్తే దౌర్జన్యంచేయడానికి వెనుకాడడు.పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత మందలించినా బుద్ధి మారలేదు. ఆ పాఠశాలకు సుబ్బారావు మాష్టారుఅనే అతను ప్రధానోపాధ్యాయులుగా వచ్చారు.విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని అప్పుడేచదువు దానంతట అది వస్తాదని ఆయన నమ్ముతారు.ఆయన తీసుకున్న చర్యలతో అల్లరిపిల్లల ఆకతాయి పనులు తగ్గాయి.జగదీష్ అల్లరికట్టడయింది.మనసు మాత్రం కట్టడి కాలేదు.పాఠాలు వినినట్లు నటించేవాడు.బడివిడుపు గంట ఎపుడు కొడతారా అని ఎదురుచూసేవాడు.క్వార్టర్లీ పరీక్షలు వచ్చాయి. సుబ్బారావు మాష్టారు కఠినంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నించారు.దసరా సెలవులకు ముందే పరీక్షలయిపోయాయి.సెలవులు తరువాత సుబ్బారావు మాష్టారు సాంఘిక శాస్త్రం పేపర్లుతీసుకొచ్చారు.రెండు పేపర్లు టేబుల్ మీదవేరుగా వుంచి మిగిలిన పేపర్లు పిల్లలకు పంచారు.పిల్లలు తమకు వచ్చిన మార్కులు సరిపోయాయోలేదో చూసుకుంటున్నారు.సుబ్బారావు మాష్టారువేరేగా ఉంచిన పేపర్లప్పుడు తీశారు. సురేష్ , జగదీష్ అని పిలిచి ఆ ఇద్దరిని నిలబెట్టించారు.ఆ రెండు పేపర్లు వారికి చూపి ఇవి కాపీ పేపర్లు.ఎవరు ఎవరిది చూశారు గద్దించి అడిగారు.సురేష్
భయపడుతూ"నేను సొంతంగానే రాశాను సార్!నా పేపరును ఎగిరెగిరి చూసి జగదీష్ రాశాడు సార్!"అని .జగదీష్ వెంటనే"అదేమీ కాదు సార్!సొంతంగా జవాబులు నేనే రాశానుసార్!"అన్నాడు. సుబ్బారావు మాష్టారు ఆవలిస్తేపేగులు లెక్క పెట్టే మనిషి! ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సమాధానాలడిగారు.సురేష్ జవాబులుచెప్పాడు.జగదీష్ జవాబులు చెప్పలేకపోయాడు.మాష్టారుకు కాపీయింగ్ చేసినదెవరో తెలిసిపోయింది. తరగతి పిల్లలను "కక్కిన కూడును ఎవరైనా తింటారా?"అని అడిగారు.పిల్లలు వెంటనే"ఛీ ఛీ"అన్నారు. మాష్టారు అదేప్రశ్నను జగదీష్ కి అడిగారు.జగదీష్ అసహ్యంకక్ముఖం పెట్టి"ఛీ!యాక్!"అన్నాడు.మాష్టారు వెంటనే నువ్వు చేసేది ఆ పనే అన్నారు.తరగతిపిల్లలను చూసి ఆయన"పరీక్షల్లో కాపీయింగ్చేయడం కక్కిన కూడు తినడంతో సమానం.కష్టపడి చదవాలి.పాఠాలు అర్థం కాకపోతేఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.సొంతం గా పరీక్షలు రాయగలిగే అలవాటుండే వారేరాణిస్తారు.ఉన్నత చదువుల వరకు వెళ్ళగలరు.కాపీయింగ్ మీద ఆధారపడేవారు వారి భవిష్యత్ ను వారే పాడుచేసుకొనే వారవుతారు"అని హితవు చెప్పారు.జగదీష్ పేపరు మీద సున్నామార్కులు వేశారు. జగదీష్ అవమానంతోతలవంచుకున్నాడు. సుబ్బారావు మాష్టారు మాటలు ఆ అబ్బాయి మీద బాగానే పనిచేశాయి.శ్రద్ధగా చదివి అర్థసంవత్సర పరీక్షలలో మంచిమార్కులు తెచ్చుకొని మాష్టారి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కథ 2005 జనవరి 4వ తేదీవార్త దినపత్రికలో వచ్చింది. ఉపాధ్యాయవృత్తి లోఉండే బాలసాహిత్య రచయితలకు కథావస్తువులకు కరువుండదు.ఎన్నో విద్యాసమస్యల మీద కథలు తయారుచేయొచ్చు.(సశేషం)