ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
119.నూతన అక్షరాస్యుల కోసం పుస్తకాలు:: బెలగాం భీమేశ్వరరావు 9989537835
September 9, 2020 • T. VEDANTA SURY • Memories

2003 నుంచి 2005 సంవత్సరం వరకు వయోజననూతన అక్షరాస్యుల కోసం రచనలు చేయడానికివిజయనగరం, కడప,హైదరాబాద్ లలో సెమినార్లునిర్వహించారు. నూతన అక్షరాస్యుల పుస్తకాలలోసరళమైన వాక్యాలు, సరళమైన పదాలుండాలి.తప్పదనిపిస్తే ద్విత్వాక్షరాలు వాడాలి. సంయుక్తాక్షరాలు ఎక్కడోగాని వాడ కూడదు. చదవడానికి భాష భారం కాకూడదు.ఒక రకంగాఇది కూడా బాలసాహిత్యం వంటిదే.కాకపోతేకథావస్తువులో తేడా ఉంటుంది. సెమినార్ల లోపాల్గొనేది ఎక్కువ మంది బాలసాహిత్య రచయితలే.ఆ సెమినార్లు లోనే శ్రీ పి.చంద్రశేఖర్అజాద్ పరిచయమయ్యారు.ఒక స్క్రిప్ట్ అంగీకరించబడాలంటే అయిదారుసార్లయినా
రాయవలసి వచ్చేది. ఉదాహరణకు "పాపం బంగారయ్య"అనే పుస్తకం పరిచయం చేస్తాను.ఇది హాస్య కథ.బాలలు కూడా చదువుకొని ఆనందపడేలా రాశాను.కథలోకి వెళ్దాం: రామాపురం పెద్ద ఊరు.ఆ ఊళ్ళో బంగారయ్యఒకడు. అతనికి బియ్యం దుకాణం ఉంది. అతడు
పిసినారి. ఒకరోజు ఉదయం బంగారయ్య దుకాణానికి బయలుదేరాడు.అతని మనవడువెంటపడ్డాడు.బంగారయ్యకు మనవడిని తీసుకు
పోవడం నచ్చదు. ఏదైనా కొనిపెట్టమంటాడనిభయం.అందువల్ల మనవడిని రావద్దు అన్నాడు.మనవడు వినలేదు.బంగారయ్యకు మనవడినితీసుకు వెళ్ళక తప్ప లేదు. తాతా మనవడుదుకాణం చేరారు. బంగారయ్య దుకాణం తలుపులు తెరిచాడు. మనవడు అరుగు మీదనిలబడ్డాడు. వీధిలో రబ్బరు బొమ్మలు అమ్మేవాడిని చూశాడు.తాతను బొమ్మ కొనమన్నాడు.ఆ బొమ్మ వెల రూపాయి.బంగారయ్య కొన లేదు.మనమడు అలిగాడు.కోపంతో చిందులేశాడు.బంగారయ్య పట్టించుకోలేదు.మనమడు వేలికిఉన్న ఉంగరం తీసి బియ్యం మూటల వెనకకువిసిరాడు. బంగారయ్య అది చూశాడు. కంగారుపడ్డాడు. మూటల వెనక వెతికాడు. ఉంగరంకనిపించలేదు. మూటలు జరిపి వెతకాలి.అవినిండు మూటలు.కదిలించలేక పోయాడు.దుకాణంలో ఎలుకలున్నాయి.అవిఉంగరం తీసుకుపోతాయని భయపడ్డాడు .కూలీనిపిలిచాడు.ఉంగరం తీసి ఇమ్మన్నాడు.కూలీ ఐదురూపాయలడిగాడు.బంగారయ్య బేరం చేశాడు.మూడు రూపాయలకు బేరం కుదిరింది. కూలీమూటలు కదిలించి వెతికాడు. ఉంగరం దొరికింది.బంగారయ్యకు ఇచ్చాడు.కూలి అడిగాడు. బంగారయ్యకు చెడు ఆలోచన కలిగింది. కూలిమనిషికి ఒక రూపాయి ఇచ్చాడు.కూలి మనిషి మిగిలిన రెండు రూపాయలు అడిగాడు.చిటికెలో చేసే పనికి మూడు రూపాయలా అనిదబాయించాడు బంగారయ్య. కూలి మనిషికికోపం వచ్చింది. రూపాయి విసిరి కొట్టాడు. మూడురూపాయలు ఇచ్చితీరాలి అన్నాడు.ఇద్దరికీమాటా మాటా పెరిగింది. బంగారయ్య కోపంతోఊగి పోయాడు.కూలిమనిషిని బలంగా వీధిలోకి
తోశాడు.కూలిమనిషి వీధి కాలువలో పడ్డాడు.తిరిగి అతడు లేవలేక పోయాడు.జనం చేరారు.బంగారయ్య ను తిట్టి పోశారు. పోలీసులు వచ్చారు.జరిగినది తెలుసుకున్నారు.బంగారయ్య తన తప్పు లేదని వాదించాడు.పోలీసులు కేసు పెడతామని బెదిరించారు.బంగారయ్య బెదిరాడు.కూలిమనిషిని డాక్టర్ దగ్గరకు తీసుకుపోయాడు.అతడు ఎముక తొలిగింది కట్టు కట్టాలి అని అయిదు వందలడిగాడు. బంగారయ్యకుఅయిదు వందల రూపాయలు ఇవ్వక తప్పలేదు.మనమడు అది చూశాడు. తాతా బొమ్మకొంటాను డబ్బులియ్యవా అని అడిగాడు. బంగారయ్యకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.రూపాయి మనమడికి ఇచ్చాడు. ముందే ఆ రూపాయి ఇచ్చి ఉంటే అయిదు వందలు వదిలేదికాదు కదా! ఈ కథే కాకుండా మూఢనమ్మకాల మీద "తీరిన అనుమానం"పశువుల పెంపకం
మీద"లేగ దూడల సంరక్షణ" పుస్తకాలు రాశాను.ఇంకా పురాణ కథలు రాసిచ్చాను.డా.వెలగా వెంకటప్పయ్య గారు చెట్లొస్తున్నాయ్ జాగ్రత్త బాలల నవలలాంటిదే వయోజనుల కోసంరాయండని కోరారు. అప్పుడు "చెట్లను పెంచుదాం" నవల రాశాను. వయోజనుల కోసం
నేను రాసిన పుస్తకాలు బాలలు చదువుకొన దగినవే.నూతన అక్షరాస్యుల పుస్తకాలు రాయడంవల్ల బాలసాహిత్యం సరళంగా రాయడానికి మెలకువలు తెలుసుకోగలిగాను.(సశేషం)