ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
120. బాలల మనోభావాలే బాలగేయాలు:--బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 10, 2020 • T. VEDANTA SURY • Memories

మతభేదాలు, కులభేదాలు,భాషాభేదాలు ఇవన్నీపెద్దలకే పరిమితం. పిల్లలవేవీ పట్టించుకోరు.కలసిమెలసి తిరగడం వారి ప్రత్యేకత.వాళ్ళకు కావలిసింది ప్రశాంతత. అప్పుడే వారికి ఆనందం.వాళ్లు ఎటువంటి పరిస్థితులు కోరుకుంటున్నారో
వివరించే గేయమే"దీక్ష".//మత భేదాలు మాకొద్దు/మత మౌఢ్యాలు మాకొద్దు/మారణహోమం కోరుకొనే/మతాలు మాకు వద్దే వద్దు//రామ్ రహీమ్ లు మా కొకటే/బుద్ధుడు,క్రీస్తు మా కొకటే/వివిధ మతస్థులు చేసుకొనే/ప్రార్థనలన్నీ మా కొకటే//పిట్టల్లాంటి పిల్లలమూ/స్వేచ్ఛను కోరే
బాలలమూ/విశ్వశాంతిని కోరుతు మేము/దీక్షాదక్షుల మౌతాము//ఈ గేయం 2005 జనవరి23 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.
జనవరి నెలలో రాబోయే గణతంత్ర దినోత్సవసందర్భంగా మన భారతదేశం జాతీయ పక్షినెమలి గురించి పిల్లలకు పరిచయం చెయ్యడానికి"జాతీయ పక్షి"అనే గేయం రాశాను.//కారుమబ్బుచూడగానె/పురిని విప్పుతుందిరా/తళుకు వంటిమెరుపులతో/నాట్యమాడుతుందిరా//విప్ప చెట్టువెతుకుచూను/రివ్వునెగురుతుందిరా/కొమ్మ కొమ్మ నెగురుచూను/కూత కూయుచుండురా//ఇష్టమైన
విప్ప మొగ్గ/లొట్టలేసి మింగురా/పురివిప్పిన కన్నులతో/చూడ చక్కగుందిరా//తెలిసిందా అది ఏదో/అందమైన నెమలిరా/రాజ్యాంగం గుర్తించిన/భరతజాతి పక్షిరా// ఈ గేయం 2005 జనవరి 24జాగృతి వారపత్రికలో వచ్చింది. అదే సంచికలోవేకువ సమయ వర్ణనతో "వేకువ"అనే గేయం వచ్చింది. పల్లెల్లో ఆ వేకువ క్షణాలు ఎలా ఉంటాయో చెప్పడానికి గేయంలో ప్రయత్నించాను.
//వేగుచుక్కా పొడిచిందీ/వేకువ కోడీ కూసిందీ//పక్షులు కిలకిలలాడాయి/ప్రకృతి నిద్దుర లేచిందీ//వంత కోళ్ళూ కూసాయి//రైతులు హలాలు పట్టారు//ఉషః కాంతులు వెలిశాయి/తామరపువ్వులు విరిశాయి//దీపం కుందెలు వెలిగాయి/గుడిలో గంటలు మ్రోగాయి//ఆవులు
అంబా అన్నాయి/దూడలు గంతులు వేశాయి//వాకిలి ముగ్గులు వెలిశాయి/పనులకు అందరుకదిలారు//తెల్లగ తెలతెల వారింది/పల్లె హాయిగానవ్వింది//... పిల్లలకు పిల్లులకు అవినాభావసంబంధముంది. తల్లులు వీధిలో తిరిగే పిల్లులనుపిల్లలకు చూపిస్తుంటారు.కొందరు పిల్లలు భయపడతారు.మరి కొందరు పట్టుకోడానికి ప్రయత్నిస్తారు.ఇంట్లో దాచిన పాలను తాగేస్తాదనిపిల్లలు పిల్లిని తరుముతారు.అదే అంశం తీసుకుని "మ్యావ్ మ్యావ్" గేయం రాశాను.//పాల వన్నె పిల్లీ/మచ్చ లేని పిల్లీ/మ్యావ్ మ్యావ్పిల్లీ/రాకు రాకు మళ్లీ//ఉట్టి మీద పాలు/తాగివేస్తావులే/చట్టి లోన వెన్న/మెక్కి వేస్తావులే//పాలు లేక పాప/గోల చేస్తుందిలే/నెయ్యి లేక నాన్న/చిందులేస్తాడులే//మా ఇంట్లో ఎలుకలు/లేవు లేవు లేవోయ్/ఎలుకలున్న ఇంటికి/దారి చూసి పోవోయ్//ఈ గేయం 2005 మార్చి 20వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.(సశేషం)