ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
122. మితమే హితం::-బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 12, 2020 • T. VEDANTA SURY • Memories

లోకంలో ఒక విచిత్రం చూస్తుంటాం.పేదతనంలోఉన్నప్పుడు హాయిగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులుసిరిసంపదలు కలిగేసరికి అనారోగ్యం పాలవుతుంటారు.అయ్యో పాపం అనుకుంటాం.కాని,మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది వారి స్వయంకృతాపరాధమని గ్రహించగలం.ఆ అంశం తీసుకుని "భాగ్యం - భోగం - రోగం" అనే కథ రాశాను.ఆ కథలోకి వెళ్తే...గణపతయ్య, పరంధామయ్య స్నేహితులు. కలసి వ్యాపారం
చేసేవారు.వ్యాపారం కలసి రాలేదు. అప్పు చేశారు. తలవని తలంపుగా ఉమ్మడిగా కొన్నలాటరీ టిక్కెట్ కు ఐదులక్షల బహుమతి వచ్చింది.బహుమతిగా వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారంప్రారంభించుదుమా అని పరంధామయ్య మిత్రునకడిగాడు.గణపతయ్య అందుకు అంగీకరించలేదు."ఉమ్మడిగా చేసే వ్యాపారం కలిసిరాలేదు.అప్పు తీర్చి మిగిలిన డబ్బు పంచుకుందాం.ఎవరి వ్యాపారం వారు చేసుకుందాం"అని అన్నాడు.అనుకున్నట్టే డబ్బు సర్దుకొని ఇద్దరూ వ్యాపారం ప్రారంభించారు.ఇద్దరి వ్యాపారాలు లాభాల బాట
పడ్డాయి. డబ్బు కళ్ళ బడడంతో గణపతయ్యజీవన విధానం మార్చుకున్నాడు.హోదా ప్రదర్శించాలనుకున్నాడు.ఖరీదైన ఆహార పదార్థాలు తినేవాడు.ఆరోగ్యకరమైన ఆహారంకాదని తెలిసినా భయపడేవాడు కాదు.నడిచివెళ్ళగలిగే చోట్లుకైనా వాహనమే ఎక్కేవాడు.తానున్న దగ్గరకు పనివాళ్ళు దేనినైనా అందించవలసిందే.శరీర శ్రమ పూర్తిగా మరచిపోయాడు.కొన్నాళ్ళయ్యేసరికి గున్నటేనుగులా మారాడు.ఒకసారి పరంధామయ్య మిత్రుడిని చూసి ఆశ్చర్య పోయాడు." ఈ వయస్సు లో లావెక్కడం మంచిది
కాదు.వైద్యుని సంప్రదించి ఆహారం లోను,నీ జీవనశైలి లోను మార్పు చేసుకోరాదా?"అని సున్నితంగాహెచ్చరించాడు.పరంధామయ్య మాటలు వినిగణపతయ్య నొచ్చుకున్నాడు.పైగా తప్పు పట్టాడు."నా సంపాదన బాగుంది. పేదరికంతో ఉన్నన్నాళ్ళుతిండికి వాచిపోయాం.ఇప్పుడు డబ్బు సమస్య లేదు.ఏది కావాలనిపిస్తే అది తింటున్నాను. జీవితం హాయిగా అనుభవించాలను కుంటున్నాను"అన్నాడు. పరంధామయ్య అప్పుడు "మిత్రమా! ఆరోగ్యవిషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటావని
అన్నానంతే.తప్పుగా తీసుకుంటావని అనుకోలేదు"సమాధానమిచ్చాడు.గణపతయ్యహేళనగా పకపక నవ్వాడు."తిండి మాని డబ్బు
కూడబెడుతున్నావా?"అని మిత్రుడిని ఎద్దేవాచేశాడు.పరంధామయ్య మిత్రుడి మాటలకుబాధపడలేదు."భగవంతుని దయవల్ల మూడు
పూటలు తింటున్నాను.వైద్యుల సలహాను పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుంటున్నాను.అవసరం మేరకు శరీరానికివ్యాయామం చేస్తున్నాను"అని చెప్పి మిత్రునినిర్లక్ష్యానికి బాధపడ్డాడు. తీరిక లేక చాలా కాలంవరకు మిత్రులిద్దరు కలుసుకోలేక పోయారు.ఒకరోజు పరంధామయ్య జబ్బు పడ్డఒక బంధువును చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాడు.అక్కడ గణపతయ్య ఏనుగు చిక్కి ఎద్దు
లా అయినట్టు కనిపించాడు.బంగారు ఛాయలోఉండే అతడు నల్లపూసయ్యాడు.పరంధామయ్యఆశ్చర్యపడ్డాడు.దగ్గరకు వెళ్ళేసరికి" మిత్రమా!నీమాటలు పెడచెవిన పెట్టాను.భోగం రోగంగాపరిణమిస్తుందని నేనూహించలేదు.రకరకాలవ్యాధుల నిలయ మయింది నా శరీరం. పులుపు, కారం,ఉప్పు, చక్కెర ఏదీ తినరాదు.తింటే అరగదు!తినకపోతే నీరస!ఏదో మందులతోబతుకీడుస్తున్నాను!ఏదైనా మితంలో ఉంటేనేమనకది హితమవుతోంది!అంతా అయ్యాక ఇపుడర్థమయింది!"కంట నీరు పెట్టుకున్నాడు గణపతయ్య! ధనసహాయం చేయమంటావా అనిఅడిగాడు పరంధామయ్య. డబ్బు వద్దు గాని వ్యాపారంలో భాగస్వామిగా వుండు అని ప్రాధేయపడ్డాడు.మిత్రుని దీనావస్థకు కరిగిపోయాడే కాని వ్యాపారం లో భాగస్వామికాలేకపోయాడు పరంధామయ్య! ఈ కథ 2005జూన్ నెల బాలమిత్రలో వచ్చింది.(సశేషం)లోకంలో ఒక విచిత్రం చూస్తుంటాం.పేదతనంలోఉన్నప్పుడు హాయిగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులుసిరిసంపదలు కలిగేసరికి అనారోగ్యం పాలవుతుంటారు.అయ్యో పాపం అనుకుంటాం.కాని,మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది వారి స్వయంకృతాపరాధమని గ్రహించగలం.ఆ అంశం తీసుకుని "భాగ్యం - భోగం - రోగం" అనే కథ రాశాను.ఆ కథలోకి వెళ్తే...గణపతయ్య, పరంధామయ్య స్నేహితులు. కలసి వ్యాపారం
చేసేవారు.వ్యాపారం కలసి రాలేదు. అప్పు చేశారు. తలవని తలంపుగా ఉమ్మడిగా కొన్నలాటరీ టిక్కెట్ కు ఐదులక్షల బహుమతి వచ్చింది.బహుమతిగా వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారంప్రారంభించుదుమా అని పరంధామయ్య మిత్రునకడిగాడు.గణపతయ్య అందుకు అంగీకరించలేదు."ఉమ్మడిగా చేసే వ్యాపారం కలిసిరాలేదు.అప్పు తీర్చి మిగిలిన డబ్బు పంచుకుందాం.ఎవరి వ్యాపారం వారు చేసుకుందాం"అని అన్నాడు.అనుకున్నట్టే డబ్బు సర్దుకొని ఇద్దరూ వ్యాపారం ప్రారంభించారు.ఇద్దరి వ్యాపారాలు లాభాల బాట
పడ్డాయి. డబ్బు కళ్ళ బడడంతో గణపతయ్యజీవన విధానం మార్చుకున్నాడు.హోదా ప్రదర్శించాలనుకున్నాడు.ఖరీదైన ఆహార పదార్థాలు తినేవాడు.ఆరోగ్యకరమైన ఆహారంకాదని తెలిసినా భయపడేవాడు కాదు.నడిచివెళ్ళగలిగే చోట్లుకైనా వాహనమే ఎక్కేవాడు.తానున్న దగ్గరకు పనివాళ్ళు దేనినైనా అందించవలసిందే.శరీర శ్రమ పూర్తిగా మరచిపోయాడు.కొన్నాళ్ళయ్యేసరికి గున్నటేనుగులా మారాడు.ఒకసారి పరంధామయ్య మిత్రుడిని చూసి ఆశ్చర్య పోయాడు." ఈ వయస్సు లో లావెక్కడం మంచిది
కాదు.వైద్యుని సంప్రదించి ఆహారం లోను,నీ జీవనశైలి లోను మార్పు చేసుకోరాదా?"అని సున్నితంగాహెచ్చరించాడు.పరంధామయ్య మాటలు వినిగణపతయ్య నొచ్చుకున్నాడు.పైగా తప్పు పట్టాడు."నా సంపాదన బాగుంది. పేదరికంతో ఉన్నన్నాళ్ళుతిండికి వాచిపోయాం.ఇప్పుడు డబ్బు సమస్య లేదు.ఏది కావాలనిపిస్తే అది తింటున్నాను. జీవితం హాయిగా అనుభవించాలను కుంటున్నాను"అన్నాడు. పరంధామయ్య అప్పుడు "మిత్రమా! ఆరోగ్యవిషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటావని
అన్నానంతే.తప్పుగా తీసుకుంటావని అనుకోలేదు"సమాధానమిచ్చాడు.గణపతయ్యహేళనగా పకపక నవ్వాడు."తిండి మాని డబ్బు
కూడబెడుతున్నావా?"అని మిత్రుడిని ఎద్దేవాచేశాడు.పరంధామయ్య మిత్రుడి మాటలకుబాధపడలేదు."భగవంతుని దయవల్ల మూడు
పూటలు తింటున్నాను.వైద్యుల సలహాను పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుంటున్నాను.అవసరం మేరకు శరీరానికివ్యాయామం చేస్తున్నాను"అని చెప్పి మిత్రునినిర్లక్ష్యానికి బాధపడ్డాడు. తీరిక లేక చాలా కాలంవరకు మిత్రులిద్దరు కలుసుకోలేక పోయారు.ఒకరోజు పరంధామయ్య జబ్బు పడ్డఒక బంధువును చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాడు.అక్కడ గణపతయ్య ఏనుగు చిక్కి ఎద్దు
లా అయినట్టు కనిపించాడు.బంగారు ఛాయలోఉండే అతడు నల్లపూసయ్యాడు.పరంధామయ్యఆశ్చర్యపడ్డాడు.దగ్గరకు వెళ్ళేసరికి" మిత్రమా!నీమాటలు పెడచెవిన పెట్టాను.భోగం రోగంగాపరిణమిస్తుందని నేనూహించలేదు.రకరకాలవ్యాధుల నిలయ మయింది నా శరీరం. పులుపు, కారం,ఉప్పు, చక్కెర ఏదీ తినరాదు.తింటే అరగదు!తినకపోతే నీరస!ఏదో మందులతోబతుకీడుస్తున్నాను!ఏదైనా మితంలో ఉంటేనేమనకది హితమవుతోంది!అంతా అయ్యాక ఇపుడర్థమయింది!"కంట నీరు పెట్టుకున్నాడు గణపతయ్య! ధనసహాయం చేయమంటావా అనిఅడిగాడు పరంధామయ్య. డబ్బు వద్దు గాని వ్యాపారంలో భాగస్వామిగా వుండు అని ప్రాధేయపడ్డాడు.మిత్రుని దీనావస్థకు కరిగిపోయాడే కాని వ్యాపారం లో భాగస్వామికాలేకపోయాడు పరంధామయ్య! ఈ కథ 2005జూన్ నెల బాలమిత్రలో వచ్చింది.(సశేషం)