ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
123.నా మొదటి బాలల కథా సంపుటి::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 13, 2020 • T. VEDANTA SURY • Memories

గురుతుల్యులు శ్రీ రెడ్డి రాఘవయ్య గారు 2004లో ఒకరోజు ఫోన్ చేసి"ఈమధ్య ఋషి పబ్లికేషన్స్   విజయవాడ వారు కథాసంపుటిలు వేస్తున్నారు.మీ కథలు 30 పంపి చూడండి. కథలు నచ్చితేసంపుటిగా తీసుకొస్తారు"అని అన్నారు.కథలు రాస్తుండి పాతిక సంవత్సరాలయింది కాని నాకథలు సంపుటిగా రాలేదు. రాఘవయ్య గారిసూచన మేరకు ఋషి ప్రచురణలకు 30 కథలు
పంపేను.2005 జూలై నెలలో "చిన్నారులకు చక్కనైన 16 నీతికథలు"అనే పేరుతో ఋషి ప్రచురణలు నా కథల సంపుటిని తీసుకొచ్చారు.
మిగిలిన 14 కథలకు చిత్రాలు వేయించి పంపితేమరొక కథాసంపుటిని తీసుకొస్తామన్నారు.ఆ పనిచెయ్యలేకపోయాను.కొన్నాళ్ళు తరువాత ఆ14 కథలు తిప్పి పంపేరు. అలా నా మొదటిబాలల కథాసంపుటి వచ్చింది.124.మంత్రం వేసినమామయ్య:ఆ రోజుల్లో 7వ తరగతి పరీక్షలు జిల్లాఉమ్మడి పరీక్షలు సంస్థ వారు నిర్వహించేవారు.ఆ పరీక్షలలో తప్పిన వారిని 7వ తరగతి లోఉంచేసేవారు.ముఖ్యంగా ఆడపిల్లలు 7వ తరగతితప్పితే చదువు మానివేస్తుండేవారు.అటువంటి అమ్మాయికథే"మామయ్య మంత్రం"!కథలోకి వెళ్తే... సీత 
7వ తరగతి తప్పింది. ఒకసారి కాదు రెండు సార్లు.ఏడవ తరగతి రెండో సారి చదవనని ఆమె మొండికేసింది.తండ్రి నచ్చచెప్పినా వినలేదు.తల్లినచ్చచెప్పినా వినలేదు. సీత మొండితనానికి తల్లికి కోపం వచ్చింది. దేహశుద్ధి చెయ్యడానికి చీపురు పుచ్చుకుంది.సీత దెబ్బలు తినడానికిసిద్ధపడింది కాని బడికి వెళ్తానని మాత్రం అనలేదు.ఆ రభస జరుగుతుండగా సీత మేనమామ వాసువచ్చాడు.ఆ రభసకు కారణం తెలుసుకున్నాడు.అక్కాబావలకు అక్కడ నుంచి వెళ్ళమని చెప్పిఆప్యాయంగా మేనకోడలును దగ్గరకు తీసుకున్నాడు.వెక్కి వెక్కి ఏడుస్తున్న సీత తలనునిమురుతూ"బడికి వెళ్ళనని ఎందుకు మారాంచేస్తున్నావు?"అని అడిగాడు."ఏడో తరగతి రెండుసార్లు తప్పాను మామయ్యా!బడికి వెళ్తే అందరూవెక్కరిస్తారు.నా స్నేహితులు పాసయ్యారు.నేనేపాసు కాలేకపోయాను.మరి నేను చదవను!" మామయ్య ను పట్టుకుని బోరున ఏడ్చింది సీత!సీత పరిస్థితి అర్థం చేసుకున్నాడు వాసు.ఆమెనుకోప్పడకుండా"సరే చదువు మానేయి!బడికివెళ్ళకుండా ఏం చేస్తావయితే? రోజంతా తీరికేగా!అమాయకంగా అడిగాడు. మామయ్య తననేమీ అనకపోయేసరికి సీతకు ధైర్యం కలిగింది."టీవిలోసినిమాలు చూస్తాను.స్నేహితులతో ఆడుకుంటాను!"చప్పున చెప్పింది సీత! వాసు ఫక్కున నవ్వాడు."టి.వి.ముందు అస్తమానం కూర్చొని చూస్తుంటే నడుము నొప్పి, కళ్ళు నొప్పులు కలుగుతాయి. కావాలని అనారోగ్యం
తెచ్చుకొనే దాని వౌతావు.ఇక రెండో విషయం.స్నేహితులతో ఆడుకోవడం.నీ స్నేహితులంతానీ లాగ ఖాళీ గా ఉండరుగా!రోజూ స్కూలుకు
వెళ్తారు.నీతో ఆడుకోడానికి వాళ్ళకు సమయమెక్కడ ఉంటుంది?స్కూలుకు వెళ్ళకుండా నీతో ఆడుకొని పరీక్ష పోగొట్టుకుంటారా?!" అన్నాడు. సీత మామయ్యకుఏ సమాధానం చెప్పలేకపోయింది.అప్పుడు వాసు"చూడు సీతా!బడి మానేసి ఇంట్లో వుంటే ఊసు
పోదు!ఖాళీగా ఉన్న నిన్ను చూసి అమ్మ అంట్లు తోము,కూరలు తరుగు,ఇల్లు ఊడ్చు అని పనులుచెప్పొచ్చు!నీవు కాదనలేవు!చేస్తావు!మరి చదువుకేనా వెనుకడుగు వెయ్యడం?పరీక్ష పోతేఅది పెద్ద అవమాన మనుకుంటున్నావా?అలాఆలోచించడం చాలా తప్పు!మళ్లీ చదువు!మంచిమార్కులు తెచ్చుకో!అందరూ నిన్ను వెక్కరిస్తారనిఅంటున్నావు!పాఠాలు వినడం మాని నిన్ను వెక్కిరించడమే వాళ్ళకు అవసరమా!అదంతా నీఅపోహ!"అన్నాడు. సీత మామయ్య వైపు చూస్తూ"నాకు తెలివితేటలు లేవు.పాసవ్వలేను"కళ్ల నీళ్ళు
తెచ్చుకుంటూ అంది.వాసు మేనకోడలును బుజ్జగిస్తూ"పిచ్చి పిల్లా! మొదటి ప్రయత్నం లోనేఅందరూ పాసైపోరమ్మా!అలాంటి వారందరు పట్టుదల పెంచుకొని విజయం సాధిస్తారు.ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు నీలాగ ఎక్కడో ఒక దగ్గరపరీక్ష తప్పిన వారున్నారు. నీ లాగ చదువు మానెయ్యాలనుకుంటే వాళ్ళకు ఆ ఉన్నత స్థానాలు దక్కగలిగావా?!నేను కూడా ఏడవతరగతి తప్పేను!ఒకసారి కాదు!రెండు సార్లు!పట్టుదలతో నేను చదవలేదా!పదవతరగతిలోజిల్లా ఫస్ట్ సాధించలేదా!లోకంలో విసుగు పడకుండా కృషి చేసి విజయాలు సాధించేవారుఎందరో ఉన్నారు!నీకు కూడా మంచి రోజులు వస్తాయి!నిన్ను వెక్కిరించినవాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు!"అన్నాడు. సీత ఆలోచనలో మార్పుకలిగింది."మామయ్యా!బడికి దిగబెట్టు!"అంది.అందరూ సంతోషించారు.ఇదీ కథ!2005 ఆగస్టు9వ తేదీ వార్త దినపత్రికలో వచ్చింది. డ్రాపవుట్స్ లో ఆత్మ విశ్వాసం కలిగించడానికి ఈ కథ రాశాను.(సశేషం)