ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
125.భావతరంగాలే బాలగేయాలు::--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 14, 2020 • T. VEDANTA SURY • Memories

ఇరుగు పొరుగు దేశాలు స్వతంత్ర భారత్ మీదఅకారణంగా దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం.కార్గిల్ యుద్ధ సమయంలో ఏ పత్రికలో
చూచినా యుద్ధ వార్తలే.ఏ నోట విన్నా కార్గిల్విశేషాలే.మన సైనికుల ధైర్యసాహసాలు ప్రపంచానికి తెలిసొచ్చాయి.పిల్లలు, యువకుల్లో
మన సైనికులు స్ఫూర్తి నింపారు.ఆ స్ఫూర్తితో రాసిన గేయమే "చిచ్చర పిడుగు"!//మతం పేరుతోభారత భూమిలో/మారణహోమం చేయగ తలచిన/మతమౌఢ్యులగు శత్రు మూకలను/పతనం చేసీ వచ్చెదనమ్మా/అమ్మా అమ్మా దీవించమ్మా/దేశ రక్షణకు పోతానమ్మా//హిమగిరి
శ్రేణిలో దాగొని మనపై/ఫిరంగి దాడులు క్షిపణిదాడులను/అధర్మ రీతిని చేసెడి అరులను/అంతంచేసీ వచ్చెదనమ్మా/అమ్మా అమ్మాదీవించమ్మా/దేశ రక్షణకు పోతానమ్మా//సహనశీలిగా శాంతిదూతగా/వినుతి కెక్కిన భరత భూమిపై/శత్రువులెన్నడు చొరని రీతిగ/చిచ్చర పిడుగై వచ్చెదనమ్మా/అమ్మా అమ్మా దీవించమ్మా/దేశరక్షణకు పోతానమ్మా//ఈ గేయం జాగృతి వారపత్రిక వారి శ్రీ పార్థివ ఉగాది
ప్రత్యేక సంచిక(4-4-2005)లో వచ్చింది. మరొకసరదా గేయం"టక్కరి కుక్క" అదే పత్రికలో వచ్చింది. ఆ గేయం://తాతగారి ఇంటి వద్ద కుక్కఉన్నది/కుక్క కేమొ నటన బాగ అబ్బి ఉన్నది/అర్థరాత్రి దొంగ ఒకడు అచటి కొచ్చెను/కదలనట్టి కుక్కనేమొ అతడు చూచెను/నిద్ర పోవు చున్నదనీనిబ్బర పడెను/మంచి వేళ ఇది యనీ సంతసించెను/ఒడుపు చూచి దొంగ అంత గోడదూకెను/గోడ దూకి ఇంటి తలుపు నెట్టబోయెను/అంత వరకు మెదలకున్న కుక్క మొరిగెను/అరపు విన్న ఇంటి వారు నిద్ర లేచిరి/దొంగ బెదిరిపారి పోవ త్రోవ వెదికెను/మీద కురికి కుక్క వానికాలు పట్టెను/ఇంటి వారు దొంగ నంత చావ బాదిరి/దొంగ దొరక గానె కుక్క తోక ఊపెను/కుక్క నంత ఇంటి వారు మేను దువ్విరి/ముద్దుముద్దు చేసి వారు మురిసి పోయిరి//ఈ గేయం3+3+3+3+3+4 మాత్రలలో రాయడం జరిగింది.అందువల్ల లయ సాధించడం జరిగింది.మరొకగేయం "పెద్ద వారి మాట!"అనుభవంతో చెప్పినపెద్దల మాటను నిర్లక్ష్యం చేయకూడదన్న సందేశం
తో రాసిన గేయమిది!//చెరువు లోన నిండు గానునీళ్ళు ఉన్నవి/నీళ్ల లోన మీనములూ దండిగున్నవి/దండిగున్న చేపలనూ బెస్త చూచెను/ఎరను గుచ్చి గాలమునూ నీట విసరెను/నీటి లోని ఎరను చూచి చేపలొచ్చెను/చేపలన్ని ఎరను మ్రింగ ముందు కురికెను/అది
చూచిన ముసలి చేప కీడు ఎంచెను/ఎర వద్దకుపోవద్దని హెచ్చరించెను/హెచ్చరికను విని చేపలుఆగిపోవగా/అహము తోడ చేప ఒకటి ఎరనుపట్టెను/చూశారా బాలలార చేప బ్రతుకును/ఎరకు చిక్కి ప్రాణమును కోలుపోయెను/అనుభవాన పెద్దవారు చెప్పినట్టిది/ఆచరిస్తె చిన్నవారు మేలు పొందును//ఈ గేయం 2005 మే నెలఆటవిడుపు పత్రికలో వచ్చింది.(సశేషం)