ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
126.అడవి నుంచి ఊర్లోకి::బెలగాం భీమేశ్వరరావు9989537835
September 15, 2020 • T. VEDANTA SURY • Memories

కథలు రాస్తున్న కొత్తలో బాలజ్యోతి లోని పిట్టకథ శీర్షికలో "గర్వపడిన పక్షులు"పేరుతో కోడి,బాతులు ఎందుకు ఎగరలేని పక్షులయ్యాయో తెలిపే కల్పితకథను రాశాను.అది గుర్తుకు తెచ్చి అదే మాదిరిగాకుక్క, పిల్లి గురించి ఎందుకు రాయకూడదు అనికథావస్తువు కోసం ఆలోచిస్తున్న నాకు ఒక ఉచితసలహా ఇచ్చింది నా శ్రీమతి.వెంటనే ఆలోచనలోపడ్డాను."ఊరు వదలని జంతువులు"పేరుతో కథ
తయారయింది.ఆ కథలోకి వెళ్దాం... పూర్వంఅడవులలోనే కుక్కలు, పిల్లులు కూడా ఉండేవి.ఒకరోజు ఒక కుక్క, ఒక పిల్లి అడవి దాటి ఒక ఊరికి వచ్చేశాయి. ఊరు వాటికి వింతగా అనిపించింది. భయపడుతూ అవి ఒక వీధి పెరడులోకి ప్రవేశించాయి.పిల్లికి కమ్మని వాసన ముక్కుకుతగిలింది. పిల్లి మరి ముందుకు అడుగు వెయ్యలేదు. కుక్క ఎంత రమ్మన్నా వెళ్ళలేదు.కుక్కకు కోపం వచ్చింది. పిల్లిని వదిలేసి ముందుకుకదిలింది.పిల్లి అక్కడున్న ఒక చెట్టు వెనక్కి దాగొనివాసన ఎక్కడ నుంచి వచ్చిందో పసిగట్టింది.పొయ్యి మీద మరుగుతున్న పాల వాసనది! పిల్లికి నోరూరింది.అటుగా చూసింది.పొయ్యి ముందు ఇంటి ఇల్లాలుంది.పాలగిన్నెనుకిందకు దించిఆమెవంట చెయ్యడం ఆరంభించింది. చెట్టు వెనకనున్న పిల్లి పాలగిన్నెనుచూస్తూ కాలక్షేపం చేయసాగింది.అదును కోసం
చూస్తోంది. వంట పూర్తయింది. ఇల్లాలు వండినవంటలను ఒకొక్కటి ఇంట్లోకి తీసుకు వెళ్తుంది.పిల్లికి అదును దొరికింది. పాలగిన్నెను చేరి గోరువెచ్చగా ఉన్న ఆ పాలను హాయిగా తాగేసింది.మూతికంటిన మీగడను నాలుకతో నాక్కుంటూచెట్టు వెనక్కి వచ్చేసింది. ఇంట్లోంచిపెరడుకు వచ్చిన ఆ ఇల్లాలు ఖాళీ గిన్నె చూసి లబోదిబోఅంది.ఎవరో వచ్చి పాలు వంపుకొని పోయారనితిట్టిపోసింది.అప్పటి నుంచి పిల్లి దొంగతనంగాఇళ్ళలోకి దూరి పాలు తాగడం ఆరంభించింది.ఆ పాల రుచికి అలవాటు పడింది. ఇక కుక్కగురించి తెలుసుకుందాం. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకు ఒకచోట ఎంగిలివిస్తరాకులు కనిపించాయి.విందు పదార్థాలుచిందరవందరగా అక్కడ పడున్నాయి.ఆకలితోఉన్న కుక్క విస్తరాకులపై పడి ఆబగా తినడంఆరంభించింది. నోటికి రకరకాల రుచులు తగిలాయి. రోజూ అలాంటి విస్తరాకులే దొరుకుతాయని ఆశ పడింది. మర్నాడు ఎక్కడాఎంగిలి విస్తరాకులు కనిపించలేదు. ఒక ఇంట్లోచొరబడి వంటగది లో వండి ఉంచిన కమ్మనివంటకాలు తినసాగింది.ఇంటి ఇల్లాలు చూసిబడిత పూజ చేసింది. కుయ్యో మొర్రో అంటూపరుగెడుతున్న కుక్కను చూసింది పిల్లి. ఏమయిందని కుక్కనడిగింది.కుక్క జరిగినది చెప్పింది. పిల్లి అప్పుడు "మనుషులకు ఎదురుపడకుండా తిని రావాలి.ఆ జాగ్రత్త తీసుకుంటేమనకు అడవి కంటే ఊరే నయం!కమ్మని పదార్థాలు ఇక్కడ తినొచ్చు!"అని ఉపాయం చెప్పింది. కుక్క ఆ రోజు నుంచి జాగ్రత్తలు తీసుకుంది.దొంగ తిళ్ళకు అలవాటు పడి ఆ రెండుజంతువులు ఊరిలో ఉండిపోయాయి.కొంత కాలంగడిచింది. అడవిలో తప్పిపోయిన పిల్లిని,కుక్కను వెతుక్కుంటూ అడవిలో ఉన్న పిల్లులు, కుక్కలు ఊర్లోకొచ్చేశాయి.వాటిని చూసిమొదట వచ్చిన పిల్లి, కుక్క సరదాపడ్డాయి. వాటికిమనుషులు వండుకుంటున్న కమ్మని వంటల రుచులు చూపించాయి.కమ్మని పాలను తాగించాయి.మరి ఆ కుక్కలు, పిల్లులు ఊరు వదలి వెళ్ళలేదు. మనుషులు విసుక్కుంటూ వాటిని తరమడం ప్రారంభించారు.అప్పుడు పిల్లులు కుక్కలు ఊరి చివర సమావేశమయ్యాయి."అడవిలోని క్రూర జంతువులు కంటే ఈ మనుషులే నయం. ప్రాణహాని చెయ్యకుండా మనల్ని వదిలేస్తున్నారు.మనం  మనుషుల అభిమానం పొంది శాశ్వతంగాఊర్లోనే ఉండిపోవాలి.ఇళ్ళల్లో తిండిగింజలనుమెక్కి వేస్తున్న ఎలుకల బెడదను పిల్లులు తగ్గించాలి.ఊర్లో దొంగలు ప్రవేశిస్తే కుక్కలు భౌభౌమని అరచి ప్రజలను లేపాలి.ఇలా మనం చేస్తే మనుషుల అభిమానం పొందగలం.ఇక్కడేఉంటే క్రూరమృగాల బాధ తప్పుతుంది. ఆ పైరుచికరమైన పదార్థాలు తినే భాగ్యం కలుగుతుంది" అని నిర్ణయించుకున్నాయి.అప్పటినుంచి మానవులకు మేలు చేస్తూ కుక్కలు, పిల్లులు మానవజాతికి దగ్గరయ్యాయి.పిల్లల సరదా కోసం ఈ కథ రాశాను.2005 అక్టోబర్ 26 వార్థ దిన పత్రికలో వచ్చింది.(సశేషం)