ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
127.కోరి తెచ్చుకున్న కష్టం:--బెలగాం భీమేశ్వరరావు9989537835
September 16, 2020 • T. VEDANTA SURY • Memories

లోకంలో రకరకాల మనుషులుంటారు.ప్రతిభను  ప్రోత్సహించే వారు కొందరుంటే మరికొందరు నిరుత్సాహ పరచడంలో ఆనందం పొందుతారు.గౌరవం పొందిన వ్యక్తిని నలుగురిలో కించపరచడానికే పనిగట్టుకుని వుంటారు.బురద జల్లితే గానిఅటువంటి వారికి నిద్ర పట్టదు.ఆ ప్రయత్నం లోఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు.ఎన్ని అవమానాలైనా భరిస్తారు.ఆ కష్టాలు ఆ అవమానాలు అవతలివారిని తక్కువ చేయడంలోవిజయం సాధించినప్పుడు అవన్నీ గాలికెగిరి పోతాయి.అటువంటి ఒకయువకుని కథే "అసూయాపరుడు".కథ సంక్షిప్తంగా... మువ్వల పాలెం గ్రామముంది!ఆ గ్రామంలో రాంబాబు అనే యువకుడున్నాడు!అందరి కంటే తానే గొప్పవాడను కుంటాడు.ఎవరుఏ ప్రతిభ చూపినా "ఏముంది అందులో?!ఊరికేమీరంతా అందలమెక్కిస్తున్నారు!నేనంత కంటేప్రతిభ చూపగలను!"అని తన ఔన్నత్య ప్రదర్శన కు ఉవ్విళ్లూరుతుండేవాడు.ఒకసారి మువ్వల పాలెం లో ప్రసాద్ అనే యువకుడు మట్టితో
బొమ్మలు చేసి కళాప్రదర్శన ఏర్పాటు చేశాడు.చూసిన వారు ప్రశంసించారు. ఆ ప్రశంసలు విన్నరాంబాబు భరించలేకపోయాడు.వెంటనే నగరంలో ఉన్న ఒక మిత్రుని సహాయంతో  ఖరీదైనహంగులతో కళాప్రదర్శన ఏర్పాటు చేసి ప్రసాద్ప్రదర్శన కంటే తన ప్రదర్శనే మిన్ననిపించుకున్నాడు.అప్పుడు గాని రాంబాబు కు నిద్ర పట్టలేదు.చేతి డబ్బు వదిలినా ప్రసాద్ నుతక్కువ చెయ్యగలిగానన్న సంతృప్తి అతనికి హాయినిచ్చింది.మరోసారి మరో యువకుడు కవిత్వం రాసి వినిపించాడు.ప్రశంసలుఅందుకున్నాడు.అంతే రాంబాబు కు పూనకంవచ్చేసింది."ఇదేం కవిత్వం?! ఊరికే అందరుతెగ పొగుడుతున్నారు!నేను తలచుకుంటే దీనికిమించిన కవిత్వం అల్లగలను!"అని చెప్పి రాంబాబు ఒక వారం రోజులు తిరిగే సరికి కట్టలుకట్టలు కవిత్వం తెచ్చి అందరి ముందు పడేశాడు.
అవన్నీ చదివి మిత్రులు ముక్కున వేలేసుకున్నారు.ప్రాచీన కవుల పదబంధాలు,భావాలు మక్కీకి మక్కీగా రాసితయారు చేశాడు. రాంబాబు గుణం తెలిసివుండడం వల్ల ఎవరూ వాస్తవం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు.లోలోన తిట్టుకుంటూ "గొప్ప కవిత్వం రాశావు'అని అందరూ పొగిడారు.ఒకరోజు ఏదో జాతర సందర్భంగా ఆ ఊరిలో ఒక యువకుడు కణకణమండే నిప్పులుమీద నడిచి ప్రశంసలందుకున్నాడు.అంతే!రాంబాబు మనసు ఈసుతో రగిలిపోయింది."నిప్పుల్లో నడవడం ఏమంతగొప్ప కాదు. అందరు అది చేయగలరు.నేనమంటల్లో పరుగెత్తగలను.ఎవరు గొప్పో మీరేచూద్దురు. చూడాలంటే ఏర్పాటు చేయండి" బీరాలు పలికాడు. గ్రామస్తులు ఆలస్యం చేయలేదు.వెంటనే మంటలు ఏర్పాటు చేసేపనిలో పడ్డారు. ఈ దెబ్బతో రాంబాబు తిక్కకుదురుతుందనుకున్నారు.ఆప్తులు వద్దనివారించినా రాంబాబు వినలేదు. మంటల్లోకిదూకాడు. ఆ వేడిని తట్టుకోలేక చచ్చానురోయ్అని కేకలేస్తూ వెనక్కివచ్చేశాడు.ఒళ్ళంతా కాలిబొబ్బలెక్కింది.శరీరమంతా మంట!బాధ తట్టుకోలేక సొమ్మసిల్లి పోయాడు.ఆగమేఘాలమీద అక్కడున్న వారు అతడిని ఆసుపత్రికి
తీసుకు పోయారు.ఆత్మహత్యాయత్నం నేరంకింద పోలీసులు కేసు పెట్టారు. గాయాలు నయమవ్వడానికి వేలకు వేలు ఖర్చు తప్పలేదు.
ఈ సంఘటనతో రాంబాబు పూర్తిగా మారిపోయాడు.ఈ కథ 2006 జనవరి నవ్య వారపత్రికలో పాలపిట్ట శీర్షికన వచ్చింది.(సశేషం)