ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
128.గేయాల పదనిసలు:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 17, 2020 • T. VEDANTA SURY • Memories

లాఫింగ్ థెరపీ ప్రచారంలో ఉన్న రోజులు!పిల్లలకునవ్వు గురించి గేయం రాయాలనుకున్నాను.గేయానికి నవ్వు అని పేరు పెట్టాను.//నవ్వాలండీనవ్వాలి/అందరు కలిసీ నవ్వాలి/ఆనందంగా నవ్వాలి/ఆహ్లాదంగా నవ్వాలి//చిరు చిరు నవ్వులు నవ్వాలి/కిలకిల నవ్వులు నవ్వాలి/కుషీ కుషీగా నవ్వాలి/గలగల గలగల నవ్వాలి//ఉల్లాసానికి నవ్వాలి/ఉత్సాహానికి నవ్వాలి/ఉత్తేజానికి నవ్వాలి/ఆరోగ్యానికి నవ్వాలి//
నవ్వాలండీ నవ్వాలి/నవ్వులు రువ్వుతు బతకాలి/నవ్వుల కడలిలో మునగాలి/ఇడుములనన్నీ దాటాలి//ఈ గేయం 2006 ఫిబ్రవరి 19 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.చదువు ప్రతి మనిషికి నేడు అవసరం. ఆధునిక యుగం మరియు సాంకేతిక యుగం ఈ యుగం! చదువును తప్పనిసరిగా పిల్లల కందివ్వాలి! పిల్లలు ఆహారమెలా తీసుకుంటారో అలాగే చదువు నేర్చుకోవాలి.అది వారి బాధ్యత. ఆ ప్రక్రియ సహజంగా సాగాలి.ఆ సద్భావం చెప్పడానికి "నైజం" అనే గేయం రాశాను.
//ఆహ్వానిస్తే వస్తాడా?/పొద్దుట రోజూ సూరీడు!//
రమ్మనమంటే వచ్చాడా/రాకాచంద్రుడు పౌర్ణమికి//
కావాలంటే పూస్తుందా/గులాబి చెట్లు గుత్తులుగా//పాడమంటే పాడాయా/కుహుకుహు
అని కోయిలలు//ఎవరు చెప్పగా చేశాయి?/భువిపై
కీర్తిని పొందాయి!//చదవండంటూ చెప్పాలా?/
మనిషికి చదువు తప్పదుగా!//శ్రద్ధగ రోజూ చదవాలి!/జగతికి మేలును చేయాలి!!//ఈ గేయం 2006 మార్చి 12 వార్త ఆదివారం అనుబంధం లోవచ్చింది.చలికాలంలో అపుడపుడు తుఫానులువస్తుంటాయి.చలికాలానికి తుఫాను గాలులుతోడైతే ఆ చలిని తట్టుకోవడం కడు కష్టం! ఎంతవేగరంగా సూర్యుడు వేడినందిస్తాడా అని ఎదురుచూస్తుంటాం!గేయవస్తువుగా ఈ విషయం తీసుకుని "సూరీడు"అనే గేయం రాశాను.//వానలూ తగ్గాలి/చలిగాలి పోవాలి/చల్లనైనా చలిని/దూరంగ తరమాలి//గజగజలు పోవాలి/రవరవలు రావాలి/పులి లాంటి చలి కూడ/బెదురుతూ పోవాలి//రగ్గులా రక్షణ లో/ఎందాకవుంటాము/వేడి కుంపటి కడను/ఎంత వరకుంటాము?//చలికత్తి గాయాలు/మాయమై
పోవాలి/చురచురల సూరీడు/వెచ్చగా దూరాలి// మాత్రాఛందస్సులో పాదాలు రావడానికి ప్రయత్నించాను. ఈ గేయం 2006 జనవరి 29
వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. దసరాసెలవుల్లో ఒకసారి మేము మాదలంగి వెళ్ళాం.అప్పుడు మా ముగ్గురు పిల్లలు చిన్న వాళ్ళే.మా అత్తవారింటి  పెరడు చాలా విశాలంగా ఉండేది. పూలమొక్కలతో పాటు మామిడి,దానిమ్మ,సీతాఫలం,నిమ్మ,నారింజ, సపోటా,జామచెట్లు ఉండేవి.పిల్లలు ముగ్గురు అక్కడ ఆడుకుంటున్నారు.అంతలో ఒక చిలుక జామచెట్టు మీద వాలింది. మా చిన్నమ్మాయిగాయత్రి మెల్లగా చెట్టు కిందకు వెళ్ళింది.సరిగ్గాఅప్పుడే ఆమె ముందు ఒక జామపండు పడింది.జాం జాం అంటూ అన్నయ్య దగ్గరకు అక్క దగ్గరకువచ్చింది. అప్పుడు మా అబ్బాయి ప్రదీప్ మాపెద్దమ్మాయి గీతా కిరణ్మయి జరిగింది చెప్పారు.
చిలుక జాంపండు కొరుకుతుంటే అది చెల్లి ముందు పడిపోయిందని చెప్పారు. ఆ సంఘటనగుర్తు వచ్చి ఒక గేయమల్లేను.//జామచెట్టు చేరింది/చిన్న చెల్లి//చెట్టు పైన వాలింది/రామచిలుక//జామపండు చూచింది/చిన్న చెల్లి//
ముక్కు తోడ పొడిచింది/రామచిలుక//ఆశ తోడ
చూచింది/చిన్న చెల్లి//పండు జార్చుకుందండి/
రామచిలుక//చెట్టు కింద జాంపండు/జాం! జాం! జాం!//చిన్న చెల్లి నోట్లోకి/ఆం!ఆం!ఆం!//ఈ గేయం2006 ఏప్రిల్ 9 వార్త ఆదివారం అనుబంధం లోవచ్చింది. ఈ గేయం చదివి బాలసాహితీ గురువరేణ్యులు శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు గారు
గేయాన్ని ప్రశంసిస్తూ ఉత్తరం రాశారు. మంచిప్రోత్సాహం లభించినట్లయింది.అలాగే గేయాలురాసేటప్పుడు బాధ్యతను కూడా పెంచింది.(సశేషం)