ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
129.కష్టసుఖాలు కావడి కుండలు:: --బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 18, 2020 • T. VEDANTA SURY • Memories

2006 వచ్చేసరికి పిల్లల చదువులు పూర్తయ్యాయి. అబ్బాయి రామ్ ప్రదీప్ హైదరాబాద్ లో ఉండి ఎం.సి.ఏ.చేశాడు. పెద్దమ్మాయి గీతాకిరణ్మయి బి.ఎస్సీ. కంప్యూటర్స్  \చేసింది. చిన్నమ్మాయి బి.ఎస్సీ. కంప్యూటర్స్  అయ్యాక ఎం.ఏ.ఎడ్యుకేషన్ చేసింది.మా పాఠశాల లోనే మా పెద్దమ్మాయి ఫిజిక్స్ వలంటీర్ గా పని చేస్తుంది. అబ్బాయి ఉద్యోగం వేటకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాడు.ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.అలాంటి ముఖ్యమైన సమయంలో నాకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. నాలుగు నెలల వరకు ఆహారం తీసుకోలేక పోయాను.చాలా బలహీనమయ్యాను.తరగతిలోకి వెళ్ళి పూర్తిగా పాఠం చెప్పలేకపోయేవాడిని.
చాలా బాధనిపిస్తుండేది.నా తోటి ఉపాధ్యాయుడుశ్రీ ఏ.మిన్నారావు గారి సలహాతో విశాఖపట్నం లోగేస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రొఫెసర్ డా.పెదవీర్రాజు గారివద్దకు వెళ్ళాను.పరీక్షలు చేసి ఆయన చికిత్స ఆరంభించారు.మెడికల్ లీవ్ పెట్టి ఇంట్లో ఒక నెలవిశ్రాంతి తీసుకున్నాను. క్రమంగా కోలుకున్నాను.పాఠశాలకు వెళ్లి పాఠం చెప్పగలిగాను.పాఠం చెప్పలేక పోతున్నానన్నబాధ తప్పింది. అంతలో అబ్బాయికి చెన్నైలోసాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది.అబ్బాయికి జాబ్ రావడంతో కుటుంబానికికఫర్వాలేదన్న ధైర్యం కలిగింది. అంతలో పెద్దమ్మాయికి భిలాయి నుంచి సంబంధం వచ్చింది.వాళ్ళొచ్చి అమ్మాయిని చూడడంఓకే చెప్పడం ముహూర్తం కట్టడం అన్నీ ఒకేరోజు జరిగిపోయాయి.పెళ్లికొడుకు పేరు సంతోష్కుమార్. పెళ్లి నాటికి రైల్వే డిపార్ట్ మెంట్ లో గ్రేడ్ వన్ టెక్నీషియన్.(ఇప్పుడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పదోన్నతి పొందారు.)  2007జనవరి 25 న పెళ్లి ముహూర్తం!పార్వతీపురంలోనే వివాహం!హోటల్ శ్రీకాంత్ బుక్ చేయడంజరిగింది. పెళ్ళిపనులు జరుగుతున్నాయి.సాధ్యమైనంత వరకు నా మీద వత్తిడి పడకుండామా ఆవిడ,పిల్లలు, మా తమ్ముళ్లు, మా బావమర్దులు చూసుకుంటున్నారు. నా ఆరోగ్యందెబ్బతింటాదేమోనని వాళ్ల భయం! ఆ రోజు జనవరి 23.పెళ్ళికింకా రెండు రోజులే ఉంది.ఉదయం గం.11లకి స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి నుంచి ఫోన్ వచ్చింది. వారన్నమాటలు:"2007 రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగాదేశంలోని బాలసాహితీ వేత్తలతో బాలసాహిత్య పరిశోధకులతో భారత రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు ఒక సమావేశం
ఏర్పాటు చేయమన్నారట.ఆ సమావేశానికిమీరు ఎంపికయ్యారు.మీరు హైదరాబాద్ కురేపు బయలుదేరిరండి.హైదరాబాద్ నుంచి 
ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్ళాల్సి వుంటుంది!"ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను.తేరుకొని"సారీ సర్!25న మా అమ్మాయి పెళ్లి! అందువల్ల నేను రాలేను!"అన్నాను."మరేం చేస్తాం?! నూతన వధూవరులకు మా శుభాకాంక్షలు తెల్పండి!"అని ఫోన్  పెట్టేశారు. జనవరి 25న వివాహం జరిగింది. మంచి అల్లుడు మాకు దొరికాడు.అది చాలు.మనసులో ఏ మూలనో ఉన్న ఢిల్లీ వెళ్ళలేకపోయానన్న వెలితి మాయమయింది.కొద్ది రోజులు తరువాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్,ఢిల్లీ వారి నుంచి ఆహ్వన ఉత్తర్వులందాయి.అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన వారి పేర్లున్నాయి. శ్రీ బుడ్డిగసుబ్బరాయన్,శ్రీ రెడ్డి రాఘవయ్య, డా.వెలగావెంకటప్పయ్య, డా.గంగిశెట్టి శివకుమార్, నేనుఅంటే బెలగాం భీమేశ్వరరావు, శ్రీ శాఖమూరి శ్రీనివాస్ గారల పేర్లు చూశాను. వెంటనే మిత్రులుశ్రీ శాఖమూరి శ్రీనివాస్ గారితో మాట్లాడాను.ఢిల్లీ విశేషాలు అడిగాను.భారత రాష్ట్రపతి డా.అబ్దుల్ కలామ్ గారు రిపబ్లిక్ డే సాయంత్రంబాలసాహిత్యవేత్తలతో బాలసాహిత్య పరిశోధకులతో సమావేశమయ్యారట!పిల్లల భవిష్యత్ నిర్మాణం లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుతరువాత బాలసాహిత్య రచయితలే ప్రముఖపాత్ర వహించగలరని అందుకు  తగిన రీతిలో బాలసాహిత్య రచయితలు స్పందించి రచనలుచెయ్యాలని లోకంలో అసాధ్యాలంటూ ఉండవనికృషితో దీక్షతో ఏదైనా సాధించగలమని విశదపరిచే రచనలు పిల్లలకందించాలని కోరారట!ముఖ్యంగా పిల్లల్లో ధైర్యం నూరిపోయాలని చెప్పారని, సమావేశమయ్యాక రాష్ట్రపతి గారి తో విందులో పాల్గొనే అవకాశం కలిగిందని అన్నీవివరంగా శాఖమూరి వారు చెప్పారు. అంతా  విన్నాక ఢిల్లీ వెళ్ళినంతసంతృప్తి కలిగింది. నా భావి రచనలకు అవసరమైన భావోద్వేగం పొందాను.(సశేషం)