ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
130.గేయ తరంగాలు:: బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 19, 2020 • T. VEDANTA SURY • Memories

ఇంటికి తాతగారొస్తే పిల్లలకు మహా సందడి.తినడానికి తాయిలాలు తెస్తారు.బహుమతులిస్తారు.ఆటబొమ్మలు తెస్తారు.కబుర్లు చెబుతారు.తాతగారు ఉన్నన్నాళ్ళూ ఇంట్లో సందడే సందడి!ఆ ఊహలకు అక్షర రూపమే "తాయిలాలు"గేయం!//తాతగారు మా ఇంటికి/వస్తుంటారు//బహుమతులు మాకెన్నో/తెస్తుంటారు//బొమ్మలెన్నో తెచ్చారు/ముంబాయి నుంచి//దుస్తులెన్నో
తెచ్చారు/ఢిల్లీ నుంచి//తాయిలాలు తెచ్చారు/తిరుపతి నుంచి//ఆటలాడ మీరంతా/నాతో రండి//తాయిలాలు అందరికీ/పంచుదునండీ//
ఈ గేయం 2006 జూన్ 25 వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది. మరొక గేయంవిశేషాలు. వెన్నెల్లో ఆడుకొని ఆరుబయట తాత
గారి పక్కన చేరబడి ఆకాశంలో వెలిగిపోతున్నచందమామను చూస్తూ చందమామ కబుర్లుతాతగారితో చెప్పించుకొని నిద్ర లోకి జారడం
అందమైన అనుభవం!ఆ అందమైన అనుభవానికిఅక్షర రూపమే " చంద్రయానం"!//ఆరుబయటవెన్నెల్లో/ఆడుకున్నాను//అమ్మమ్మ  పిలవగానే/ఇంటికెళ్ళాను//పులిహోర, బొబ్బట్లు/ఆరగించాను//వాకిట్లో తాతగారి/మంచమెక్కాను//చందమామ కబుర్లన్నీ/చెప్పమన్నాను//తాత చెప్పగ,ఊకొడుతూ/నిద్రపోయాను//నిద్ర లోన చంద్రుడినీ/తాకి వచ్చాను//చంద్రయానం చేసినట్లు/కలలు గన్నాను//ఈ గేయం 2006 ఆగస్టు 20 వార్త ఆదివారం అనుబంధంలో వచ్చింది. ఇంకొక గేయం "నిత్యానందం"!పిల్లలు ఏం చేస్తే పెద్దలు ఆనందపడతారో చెప్పడానికి ప్రయత్నించాను.//బుద్ధిగ మీరూ చదివారా/అమ్మకు నాన్నకుఆనందం//శ్రద్ధగ పాఠాల్ విన్నారా/గురువు గారికి
ఆనందం//హింసను వదలీ తిరిగారా/బుద్ధ దేవునికి ఆనందం//మతాలు మరచి మసలారా/భరతమాతకూ ఆనందం//చేయీ చేయీ కలిపారా/భూమాతకు పరమానందం//మానవత్వంతో ఉన్నారా/దేవునికి మరి నిత్యానందం//ఈ గేయం 2006 నవంబరు 12వార్త ఆదివారం అనుబంధం లో వచ్చింది.ఆకాశ సౌందర్యం, అందునా చందమామ గురించికవికి ఎంత చెప్పినా తనివితీరదు.కొత్త కొత్త
భావాలు పుడుతుంటాయి.పిల్లలకు ఆ భావాలుపంచాలని బాలసాహిత్య రచయితలు ఉవ్విళ్ళూరుతారు.చందమామతో నా ఊసులెలా
వున్నాయో"ఆకాశ నేస్తం"గేయం లో చూడండి.//అపురూప వజ్రమా/అందాల రూపమా/అంతరిక్షంలోన/ ఆకాశ దీపమా//తెలిమబ్బు
తోడుగా/దోబూచులాడుచూ/గగనాన పయనించి/విలసిల్లు తున్నావు//అంతరిక్షం నుండి/అమృత కిరణాలనూ/అన్ని జీవులకున్ను/
అందించు దాతవే//నిన్ను చూచిన అంత/కలువలేవికసించు/నిండు పున్నమి నాడు/సంద్రమే ఉప్పొంగు//గోరుముద్దల వేళ/మారాము చేసేటి/పసిబిడ్డలకు నీవు/చెలికాడవయ్యావు//జాబిల్లిచూడంటు/అమ్మ చూపంగాను/నిను చూచి మైమరచి/బుద్ధిగా తిందురు//అమ్మలందరకున్ను/అన్నదమ్ముడవేను/బాలలకు నేస్తుడా/ఓ చంద్రమామయ్య//ఈ గేయం 2007 జనవరి తెలుగు
విద్యార్ధి మాసపత్రిక లో వచ్చింది.(సశేషం)