ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
131.ఎల్లరు సుఖముగ ఉండాలోయ్:: బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 20, 2020 • T. VEDANTA SURY • Memories

మనిషి స్వార్ధం అవతలివారి చెడును కోరనంతవరకు ఫర్వాలేదు. తానొక్కడు మాత్రమే బాగుండాలి అని అనుకోవడం మూర్ఖత్వం.దాని
వల్ల చెడు ఫలితమే కలుగుతుంది. ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. పిల్లలకు ఆ విషయం అవగాహన పరచడానికి "అందరం బాగుండాలి"కథ రాశాను.ఇక కథలోకి వెళ్తే....నాగావళి నదీతీరాన రామలింగస్వామి అనే ఒక యోగి పుంగవుడుండేవాడు.ఆయన తన వద్దకు వచ్చిన భక్తులకుఒక శివలింగం ఇచ్చి భక్తితో పూజించండి మీ కోరికనెరవేరుతుంది అని దీవించి పంపేవాడు. ఒకరోజు
వేరు వేరు ఊళ్ళు నుంచి తమ్మయ్య తిక్కయ్య అనే ఇద్దరు భక్తులు వచ్చారు.యోగి ఆ ఇద్దరికీశివలింగాలిచ్చాడు.ఇద్దరూ వాళ్ళ ఊళ్ళు చేరుకున్నారు.తమ్మయ్య ధార్మికుడు.పూజామందిరంలో కూర్చుని"మా ఊరివారంతా బాగుపడాలి"అని రోజూ ప్రార్ధన చేసే
వాడు.తిక్కయ్య స్వార్ధపరుడు."ఊర్లో నేనొక్కడినేబాగుపడాలి.మిగిలిన వారంతా చెడిపోవాలి."అనిపూజ చేసేవాడు. కాలం గడుస్తోంది.తమ్మయ్య ఊరు పాడిపంటలతో విరాజిల్లింది.తమ్మయ్య చాలా సంబరపడ్డాడు.అందరూ లాభపడినందుకు
ఆనందించాడు.ఊరు శాంతి సౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంటే తమ్మయ్య సంతోషంతో పొంగిపోతుండేవాడు.దైవాన్ని కృతజ్ఞతతో స్మరించుకున్నాడు.తిక్కయ్య సంగతి చూద్దాం.తిక్కయ్య ఊర్లో పంటలు పండినట్లే పండి చీడపట్టి సర్వనాశనమయ్యాయి.కాని విచిత్రం!తిక్కయ్య పొలాల్లో మాత్రం ఇబ్బడిముబ్బడిగాపండింది.తిక్కయ్య ఆనందానికి హద్దు లేదు."బలే!బలే!ఊరి వారంతా తిండిగింజల కోసం
నా కాళ్ళు చుట్టూ తిరుగుతారు. రూపాయికిపది రూపాయలు చేసుకోవచ్చు. నా ప్రార్ధన ఫలించింది"అనుకున్నాడు.చేను కోయించి ధాన్యం
ఇంటికి తీసుకు వచ్చాడు.గాదెలు నింపాడు. తిక్కయ్య ఆనందం ఎంతోకాలం నిలవలేదు. చీటికీమాటికీ ఇరుగు పొరుగు వారు ధాన్యం అప్పుగాఅడగడం ప్రారంభించారు.మొహమాటంలో పెట్టి"వచ్చే యేడు పంట చేతికందగానే నీ అప్పు తీర్చేస్తాం"అని భరోసా ఇవ్వసాగారు.ఆకలితో అలమటిస్తున్న బంధువర్గానికి కొంతలో కొంతయినా ధాన్యంసర్దక తప్పింది కాదు తిక్కయ్యకు.అంతలో మరొక
సమస్య వచ్చి పడింది. గాదెల్లో ధాన్యం అప్పుడప్పుడు తస్కరణకు గురవుతుండేవి.తిక్కయ్య కలవరపడ్డాడు.ధాన్యం కాపలా కాయడానికి రాత్రులు మెలకువతో ఉండసాగాడు.నిద్ర లేమి వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింది.ఒకరోజు తిక్కయ్య పని మీద తమ్మయ్య ఊరు వెళ్ళాడు.తమ్మయ్య హాయిగాఉండడం చూసి "నీ లాగ నేను ప్రశాంతంగా లేను.అందరూ నన్ను పీక్కు తింటున్నారు.శివలింగ
ప్రార్ధన ఫలితమిచ్చింది గాని బాధలు మాత్రంనాకెక్కువయ్యాయి. నాకెందుకు అలా జరిగింది"అని తమ్మయ్య నడిగాడు తిక్కయ్య!తమ్మయ్యనవ్వుతూ"అంద‌రం బాగుండాలి అని ప్రార్ధనచేశాను.ఆ ప్రార్ధన ఫలితమే నా హాయికి కారణం"అని చెప్పాడు. తిక్కయ్యకు తను చేసిన పొరపాటు అర్థమయింది."తానొక్కడే బాగుంటేసరి కాదు. అందరి బాగు కోరాలి.చుట్టుపక్కల వారూ బంధువులూ బాగుంటేనే తన బాగుకుఅర్థముంటుంది"అని తెలుసుకొని ఇంటి దారిపట్టాడు.మరుసటి రోజు నుంచి తన ప్రార్థన తీరును మార్చుకున్నాడు. అందరం బాగుండాలనిప్రార్థన చెయ్యసాగాడు....ఈ కథ 2006 డిశంబరు19 వార్త దిన పత్రికలో వచ్చింది.మన పూర్వీకులు"సర్వే జనాః సుఖినో భవంతు"అని ప్రతి పూజలో చెప్పడం మనం గమనించగలం.(సశేషం)