ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
133.చందమామలో అడుగు పెట్టాను: బెలగాం భీమేశ్వరరావు 9989537835.
September 22, 2020 • T. VEDANTA SURY • Memories

అపుడెపుడో 9వ తరగతి చదువుతున్నప్పుడు(1966) బ్రహ్మరాతను తప్పించిన బుద్ధిబలంపేరుతో చందమామకు కథను పంపేను. అచ్చుకాలేదు.ఆ తరువాత 2006లో పంపేను. రెండవసారి చందమామకు కథ పంపడానికి    శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి గారు శ్రీ ఎం.వి.వి .సత్యనారాయణ గారు కారకులు.2006లో పి.వి.బి.గారి కథ చందమామ లో వచ్చింది.ఆ విషయం నాతో చెప్పి మీరు కూడా పంపండని
ప్రోత్సహించారు.చందమామ లో పాతిక సంవత్సరాలు వరకు సరిపడా కథలున్నాయని అందుకే కొత్త కథలను తీసుకోలేదని ప్రచారం
ఉండడం వల్ల చందమామకు పంపేవాడిని కాను.ఆ సమయంలో ఆ ఇద్దరు మిత్రుల ప్రోత్సాహం తో"ఆశ - పేరాశ " పేరుతో కథ పంపేను.2007 ఫిబ్రవరి సంచికలో వచ్చింది. చందమామలోఅదే నా మొదటి కథ.కథలోకి వెళ్తే....రఘువీరపురంలో అజయుడు విజయుడు అనేఇద్దరు స్నేహితులుండేవారు.ఒక్కొక్క మెట్టుగాపైకి రావాలని అజయుడి మనస్తత్వం. విజయుడిది మాత్రం అలా కాదు."నేను పులి లాంటి వాణ్ణి.పులి ఏనుగు మెదడునే కోరుకుంటుంది.ఆకలని పచ్చిగడ్డి తినదు"అనిగొప్పలు చెప్పుకొనేవాడు.డబ్బున్న కుటుంబంగనక విజయుడు సంపాయించక పోయినా పెద్దలంతగా పట్టించుకొనే వారు కాదు.కాకుంటే అతడిభవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బెంగపడేవారు.ఇలా ఉండగా మిత్రులిద్దరికీ విద్యనేర్పిన గురువు విద్యాసాగరుడు తన పూర్వవిద్యార్ధులెలా ఉన్నారో చూసి వెళదామని ఒకనాడు రఘువీరపురానికి వచ్చాడు. మిత్రులిద్దరు ఆతిథ్యమిచ్చారు.వారి స్థితిగతులుగురించి ఆరాతీశాడు ."వ్యవసాయం లోనూవ్యాపారం లోనూ మా తండ్రికి సాయపడుతున్నాను.సొంతంగా వ్యాపారం పెట్టడానికి కొంత కాలం పట్టవచ్చు" అన్నాడుఅజయుడు వినయంగా."చాలా సంతోషం.చేపట్టబోయే వృత్తిలో కొంత శిక్షణ, అనుభవంఅవసరం కదా.మంచి పనే చేస్తున్నావు"అని గురువు,"నీ పరిస్థితి ఏమిటి అన్నట్టు విజయుడుకేసి చూశాడు."ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు.ఆ అవసరం లేదు. మా తండ్రి గారు నడుపుతూన్ననగల దుకాణముంది.రేపు నేను దుకాణానికియజమానినైతే మా నాన్న కన్నా పదింతలు ఎక్కువ సంపాయించి నా అంత ధనవంతులులేరని పేరు తెచ్చుకుంటాను"అన్నాడు విజయుడు.ఆ మాటకు విస్తుపోయి గురువు"ఏ వ్యాపారమైనా
ధర్మబద్ధంగా చెయ్యాలి. దురాశకు పోతే అరిష్టాలుతప్పవు.పేరాశకు పోయి విపరీతమైన కోరికకోరుకున్న తిమ్మయ్య గతి ఏమయిందో చెబుతాను,విను"అంటూ ఇలా చెప్పాడు:లంబోదరపురంలో తిమ్మయ్య అనే తిండిపోతుఉండేవాడు.వాడికి ఎంత తిన్నా తినాలన్న కోరిక
ఉండేది.ఇంట్లో వండిన వంటంతా తినేసి ఊరిమీద పడేవాడు.ఊళ్లో వాళ్లు ఎంత కాలం పెడతారు.మా వల్ల కాదన్నారు. అడవికి వెళ్లి బల్లెం తో జంతువులను వేటాడి రాక్షస తిండితినడం ఆరంభించాడు.చిన్నా చితక జంతువులుతిమ్మయ్యను చూసి పారిపోతుండేవి. ఒకరోజుతిమ్మయ్యకు ఒక ఏనుగు కనిపించింది.ఆ ఏనుగుఅవలీలగా చెట్టు కొమ్మలను విరచి ఆకులు రెమ్మలతో సహా తినడం చూసి ఆశ్చర్య పడ్డాడు.అంత పెద్ద ఏనుగును అమాంతం పట్టి నమిలి మింగాలన్న విపరీతమైన కోరిక కలిగింది. వెంటనేచిన్నదిగా ఉన్న పొట్టను చూసుకొని ఏనుగుఇందులో పట్టదు కదా అని బాధపడిపోయాడు.ఎలాగైనా ఏనుగును తినాలన్న కోరికతో ఉన్నతిమ్మయ్యకు ఒక మునీశ్వరుడు కనిపించాడు.తన మనసులోని కోరికను తీర్చమన్నాడు.అడిగినవారికి లేదనకూడదన్న నియమం ఆ మునీశ్వరుడికి ఉంది. ఆయన ఒక మంత్రంఉపదేశించి "అదిగో ఆ కనిపిస్తున్న కొండ గుహ లోకి దూరి మంత్రం జపించు.నీ కోరిక నెరవేరుతుంది" అన్నాడు. తిమ్మయ్య గుహలోకివెళ్ళి మంత్రం జపించాడు.మూడోరోజు తెల్లవారుతుండగా తిమ్మయ్య పొట్ట పెరిగిపోయింది. వాడి
ఆనంందానికి హద్దులు లేకపోయింది.గుహ నుంచిబయటకు రాబోయాడు.భారీ కాయం వల్ల గుహద్వారం నుంచి బయటపడ లేకపోయాడు.వెలుపలికి మరో దారి లేదు. తినడానికి గుహలో ఏమీ లేవు.తన పేరాశకు,విపరీత కోరికకు పశ్చాత్తాపపడుతూ
ఆకలికి తట్టుకోలేక తిమ్మయ్య గుహలోపలేప్రాణాలు వదిలాడు."చూశావా,పేరాశకు పోయితిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు.అందుకే
దుఃఖం చేటు అన్నారు పెద్దలు. ఆకాశానికినిచ్చెన వెయ్యడం మానేసి ఎదుట ఉన్న సొంతచెట్టెక్కి పళ్లు కోయుట నేర్చుకో"అన్నాడు మందహాసంతో."చిత్తం గురువర్యా!ఈ రోజు నుంచేమా తండ్రి నగల దుకాణానికి వెళ్ళి వ్యాపారంలోమెళకువలు నేర్చుకుంటాను"అన్నాడు విజయుడుగురువుకు నమస్కరిస్తూ!ఈ కథలో అత్యాశ,విపరీత కోర్కెలు మనిషిని ప్రమాదాలలోకి
నెట్టుతుందని చెప్పడానికి ప్రయత్నించాను.(సశేషం)