ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
134.అమ్మ మాటలు ఆణిముత్యాలు:--బెలగాం భీమేశ్వరరావు 9989537835.
September 23, 2020 • T. VEDANTA SURY • Memories

బాల్యంలో మనను మంచి దారిలో పెట్టే అవకాశం తల్లికే ఎక్కువ. బిడ్డ సరియైన తీరులో పెరగడానికితల్లి బోధలు,చేష్టలు చాలా దోహదపడతాయి.బిడ్డ బాల్యం తల్లి దగ్గరే ఎక్కువ గడుస్తుంది.ఆమెమాటలు బిడ్డలకు వేద వాక్కు.బాల్యంలో ఆమెనేర్పిన గుణాలు బిడ్డను కడ వరకు వదిలిపోవు.ఒక అబ్బాయి తన తల్లి తన బాగునెలా తీర్చిదిద్దిందో చెప్పే గేయమే "అమ్మమాట"!//నను కన్న
మా అమ్మ/నను జూసి మురిసింది/ప్రేమగా లాలించి/నను పెద్ద చేసింది//అడుగు తడబడితేను/పడకుండ పట్టింది/మాటలూ 
నేర్పుటకు/పదిసార్లు పలికింది//చెడుపనులుచేయగా/చీవాట్లు పెట్టింది/మంచిగా ఉండమని/మరి మరీ చెప్పింది//ఒరులతో ఓర్మిగా/ఉండమనికోరింది/పడినవాడెన్నడును/చెడడనీ చెప్పింది//మంచిగా నలుగురితో/మసలమని చెప్పింది/మాట తీరే మనకు/మంచి తేగలదంది//చదువుపెన్నిధి యనుచు/సద్బోధ చేసింది/ఆస్తి కన్నాచదువు/మిన్నయని చెప్పింది/అమ్మ మాటలునేను/ఆలకించానండి/అందరీ మన్ననలు/పొందగలిగానండి//ఈ గేయంలో తల్లీబిడ్డల పాత్రలుమా అమ్మా నేనే!ఈ గేయంలో సాధ్యమైనంత వరకు మాత్రాఛందస్సు వాడాను.అక్కడక్కడాఒక మాత్ర ఎక్కువనిపించినా అది చదవడానికిపాడడానికి ప్రతిబంధకం కాలేదు.ఛందస్సు కోసం
భావాన్ని పక్కదారి పట్టించలేదు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన చుక్ చుక్ రైలుబాలగేయ సంపుటి (2009)లో ఉంది.ఆ సంపుటినే 2016 లో నవచేతన పబ్లిషింగ్ హౌస్  వారు ప్రచురించారు. మరో గేయం "అలరింపు"గురించి చెబుతాను.ఈ గేయాన్ని కూడా చుక్ చుక్  రైలు సంపుటి కోసం రాశాను.ఇందులో నవ్వుగొప్పతనముంది.ఒక తల్లి తన పాపాయికినవ్వు గురించి చెబుతుంది://చిలకమ్మ నవ్వదు/కోకిలా నవ్వదు/జాబిల్లి నవ్వదు/సంద్రమూ నవ్వదు//తారకలు నవ్వవు/మల్లెలూ నవ్వవు/రత్నాలు నవ్వవు/వజ్రాలు నవ్వవు//ఇలలోన ఏప్రాణి/నవ్వలేదమ్మలూ/నవ్వు ఒక వరమమ్మ/నరజాతికేనమ్మ//నింగిలో తారలే/నీ హాస చంద్రికలు/రత్నాల రాశులే/నీ నవ్వు తళుకులు//వజ్రాల మెరుపులే/నీ జిలుగు నవ్వులు/విరయనీమల్లెలే/నీ చిన్ని నవ్వులు/నవ్వుతూ హాయిగా/నూరేళ్ళు జీవించు/నవ్వులను రువ్వుతూ/అందరిని అలరించు//మరోగేయం "కనువిందు"!ఆ గేయం://రారండీ తమ్ముళ్లు/గాలిలోకి ఎగురుదాం/రారండీ చెల్లెళ్లు/పక్షి లాగ తిరుగుదాం//మీద నుండి చూస్తుంటే/వింతలెన్నోకనువిందు/కొండలన్ని బండలుగా/చిత్రంగాకనిపించు//రహదారులు పాముల్లా/మెలికి తిరిగిపోతుంటాయ్/వనాలన్ని చిత్రంగా/పెరటితోటలవుతుంటాయ్// సెలయేరులు చూస్తుంటే/వీధి కాల్వలవుతాయి/గొప్ప చెప్పు మనుజులంతా/వ్రేలెడంత ఉంటారు//వంతెన లెన్నో చూడగ/వింతగాను కనిపిస్తాయ్/వింత వింత అనుభూతులు/మనకే సొంతమవుతాయ్//రారండీ రారండీ/గాలిలోనతేలుదాం/పైపైనా ఆకసాన/పక్షి లాగ ఎగురుదాం//ఈ గేయం కూడా చుక్ చుక్ రైలు సంపుటి
కోసమే రాశాను.(సశేషం)