ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
135.మంచి నడవడే బాల్యానికి పునాది:--బెలగాం భీమేశ్వరరావు 9989537835.
September 24, 2020 • T. VEDANTA SURY • Memories

మంచి గుణాలు బాల్యంలోనే అలవడినట్లు పిల్లలకు చేయాలి.మొక్కై వంగనిది మ్రానై వంగదుకదా!బాల్యంలో పెద్దలు నడిపించే బాటలు మరో పది మందిని ఆ బాటల్లోకి రప్పించగలవు.ఒక అబ్బాయి మంచి నడవడి పిల్లలు పొందాలంటేఏం చేయాలో చెప్పిన గేయమే "నడవడి" గేయం.//గురువు బోధన మీద/గురిని చూపాలి/చదువుసంధ్యల పట్ల/శ్రద్ధ పెట్టాలి//అమ్మ చెప్పిన మాట/
అమలు చేయాలి/నాన్న చెప్పిన తీరు/ నడచుకోవాలి//పదిమందికీ చదువు/పంచగలగాలి/నీ తెలివి తేటలను/పెంచుకోవాలి/
మూగ జీవుల పట్ల/దయను చూపాలి/పగవారికీకూడ/మేలు చేయాలి//మంచి గుణములు మనము/వృద్ధి చేయాలి/కన్న వారికి మనము/
పేరు తేవాలి//....చుక్ చుక్ రైలు గేయసంపుటికోసం తయారు చేసిన గేయమిది! మరొక గేయం
"తొలిపొద్దు"!ఈ గేయాన్ని కూడా చుక్ చుక్ రైలుసంపుటి కోసం రాశాను.పాదాలన్నీ 12 మాత్రలున్నట్టు చూశాను. ఈ గేయాన్ని శ్రీ రెడ్డి
రాఘవయ్య గారు వంద కవుల గేయాల సంకలనం"చిలుకమ్మ పెండ్లి" కి తీసుకున్నారు.//తూర్పు దిక్కు వెలుగండీ/శుభం పల్కు బాటండీ/జీవశక్తిచైతన్యం/మనకు ఇవ్వ వచ్చెనండి//బారులుగాపక్షులెన్నొ/ఆకసాన ఎగురునండి/కిలకిలా రావాలతొ/మేలుకొలుపు పాడునండి//చల్లనైనచిరుగాలులు/తెరలు తెరలు వీచునండి/మనసు
పరవశించు రీతి/మనను పలుకరించునండి//
అరవిరిసిన పువ్వులండి/ఆహ్లాదం ఇచ్చునండి/
అందమైన ప్రతి ఉదయం/ఆరోగ్యం పెంచునండి//
బాట వెంట ఇరువైపుల/పచ్చనైన మొక్కలండి/
మంచు తోను చెలిమి చేసి/స్వచ్ఛముగా మెరయు
నండి//సూర్యోదయ సమయమండి/అందానికి
నిలయమండి/బలే బలే అందాలను/మనకు చూప గలుగునండి//....మరొక గేయం "వర్షధారలు" కూడా చుక్ చుక్ రైలు సంపుటి కోసం రాశాను.ఈ గేయం లో నీటి ప్రాముఖ్యత తెలిపాను.తేలిక పదాలతోనే రచన సాగించాను.
ప్రతి పాదం పది మాత్రలే.//కురవాలి కురవాలి/
వానల్లు కురవాలి/వర్ష ధారల తోటి/వసుధంత 
తడవాలి//చెరువుల్లు నిండాలి/ఏరులూ పొంగాలి/మండు వేసవి లోన/నీరమూ ఉండాలి//
చెట్టు చేమా లతలు/నీటితో తడవాలి/నీటి చెలిమిన పంట/పసిడియై పెరగాలి//ముత్యాలు
పండాలి/రతనాలు రాలాలి/రైతన్న కళ్ళలో/
మెరుపునే చూడాలి/జీవకోటికి నీరు/దాహార్తి 
తీర్చాలి/ఉచిత వస్తువు గానె/సతతమూ దొరకాలి//కురవాలి కురవాలి/వానల్లు కురవాలి/
నీటి కెన్నడు కరువు/రాకుండ ఉండాలి//(సశేషం)